
‘సున్నితమైన చాలా అంశాలపై అనవసరంగా ఎక్కువ స్పందించా. కోరి వివాదాలు తెచ్చుకున్నా. అలా చేయకుండా ఉండాల్సింది.’
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

‘సున్నితమైన చాలా అంశాలపై అనవసరంగా ఎక్కువ స్పందించా. కోరి వివాదాలు తెచ్చుకున్నా. అలా చేయకుండా ఉండాల్సింది.’
ఈనాడు, అమరావతి: ‘సున్నితమైన చాలా అంశాలపై అనవసరంగా ఎక్కువ స్పందించా. కోరి వివాదాలు తెచ్చుకున్నా. అలా చేయకుండా ఉండాల్సింది.’ అని యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా వీడియోలు చేసి, దేశద్రోహ సెక్షన్‌ కింద అరెస్టైన రావణ్‌ను పోలీసులు.. కస్టడీ మూడో రోజైన ఆదివారం విచారించారు. పలు అంశాలకు సంబంధించి గన్నవరం పోలీసులు ప్రశ్నలు సంధించారు. హిందూ దేవతలను కించపరుస్తూ వీడియోలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది మతసామరస్యాన్ని దెబ్బతీయడం కాదా అంటూ ప్రశ్నఛానల్‌లోని వివాదాస్పద వీడియోలను చూపించి ప్రశ్నించారు. వీటి జోలికి వెళ్లకుండా ఉండాల్సింది అని రావణ్‌ జవాబిచ్చినట్లు తెలిసింది. వీడియోలు రూపొందించేందుకు ఎవరి సూచనల మేరకు స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తారని అడగ్గా.. తానే సొంతంగా చేస్తానని, కొన్ని సందర్భాలలో ఇతరుల సూచనలుతీసుకుంటానని వివరించినట్లు సమాచారం. ఆర్థిక అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మౌనం దాల్చినట్లు తెలిసింది. ఛానల్‌ నిర్వహణలో గమన, ఇంద్రసేనానాయుడి పాత్రలపై ప్రశ్నించగా.. గమన పరిపాలన వ్యవహారాలు చూసుకునే వారని, ఛానల్‌ నడుస్తున్న కార్యాలయాన్ని ఇంద్రసేన నుంచి తీసుకున్నామని చెప్పాడు. వైకాపా నేతలతో సంబంధాలు, కథనాల ఎంపికలో వారి ప్రమేయంపై పలుసార్లు అడిగినా సమాధానం దాటవేశాడు. వీడియోల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది? ఛానల్‌ నిర్వహించేందుకు ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటారు? ప్రతినెలా గమన మీకు జీతం ఇస్తుందా? వచ్చిన ఆదాయాన్ని పంచుకుంటారా? ఛానల్‌ అడ్మిన్‌ రైట్స్‌ ఎవరెవరికి ఉన్నాయి? గమన, ఇంద్రసేన మధ్య సంబంధమేంటి? అని పలు కోణాల్లో పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆ వివరాలు తనకు తెలియదని, వాటితో సంబంధం లేదని రావణ్‌ దాటవేసినట్లు సమాచారం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి