translateexpand_more

Divyenndu Sharma Telugu Speech News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu01 Jun, 04:19 pm
తెలుగులో అదరగొట్టిన మీర్జాపూర్ మున్నా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్-ఇండియా 'పెద్ది' ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న ప్రముఖ నటుడు (మీర్జాపూర్ ఫేమ్) దివ్యేందు శర్మ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన తొలి తెలుగు సినిమా అనుభవాలను, చిత్ర యూనిట్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రేక్షకులతో పంచుకున్నారు. తన ప్రసంగం ప్రారంభంలో, భాష కొత్తదైనందున ఏవైనా తప్పులు ఉంటే క్షమించాలని విజయవాడ ప్రజలను కోరారు దివ్యేందు. ఆ తర్వాత తెలుగులో మాట్లాడి అభిమానులను ఖుషీ చేశారు,. తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన 'మీర్జాపూర్' సిరీస్‌లోని ఒక డైలాగ్‌ను గుర్తుచేస్తూ.. "మీరంతా మా ఫ్యామిలీ" అనే హిందీ డైలాగ్‌ను తెలుగులోకి అనువదించి, "మీరే మా కుటుంబం"* అనడంతో స్టేడియం మొత్తం కేరింతలతో మారుమోగిపోయింది,. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటించడంపై దివ్యేందు శర్మ సంతోషం వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "రామ్ చరణ్ అద్భుతమైన వ్యక్తి. ఆయనతో కలిసి నటించడం అంత సులువు కాదు, కానీ ఆయన నన్ను సెట్స్‌లో ఎంతో కంఫర్టబుల్‌గా ఉంచారు. దానివల్ల నా పాత్రను నేను అనుకున్న రీతిలో, చాలా చక్కగా ప్రెజెంట్ చేయగలిగాను." దర్శకుడు బుచ్చిబాబు సానాపై దివ్యేందు ప్రశంసలు కురిపించారు. ఆయనను ఒక "మ్యాడ్ జీనియస్" గా అభివర్ణిస్తూ.. తనపై నమ్మకం ఉంచి ఈ పాత్రను ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు,. తనకు తెలుగు సంస్కృతి, భాష, భావోద్వేగాలు కొత్తవైనప్పటికీ చిత్ర యూనిట్ ఎంతో మద్దతుగా నిలిచిందని చెప్పారు. అలాగే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సతీష్ గారికి మరియు విజయవాడ ప్రేక్షకుల అద్భుతమైన ఎనర్జీకి ఆయన థాంక్స్ చెప్పారు.