translateexpand_more

Ram Charan Peddi Pre Release Event News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu31 May, 04:26 am
పెద్ది’ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిథిగా స్టార్ హీరో

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ప్రమోషన్స్ చివరి దశకు చేరుకున్నాయి ముంబైలో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ చేయడం, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సెర్ట్ నిర్వహించడం, ఆ తర్వాత బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో ప్రెస్ మీట్స్‌తో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు . ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మేకర్స్ సర్వం సిద్ధం చేశారు . ఈ భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది జూన్ 1వ తేదీన (సోమవారం) సాయంత్రం 5 గంటల నుండి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం (గ్రౌండ్స్) వేదికగా ఈ ఈవెంట్ అత్యంత ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు భారీ ఎత్తున మెగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, అందుకు తగ్గట్టుగా నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథి (చీఫ్ గెస్ట్) ఎవరనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మేకర్స్ నుండి ఇంకా అధికారిక స్పష్టత రానప్పటికీ, ఈ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వీలును బట్టే విజయవాడలో ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశారని టాక్. ఇదే గనుక నిజమైతే.. ఒకే వేదికపై బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్‌లను చూసి మెగా అభిమానులకు పూనకాలు రావడం ఖాయం.ఈ వేడుకలో హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్,

NTV Telugu29 May, 09:15 am
బెజవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. సెలబ్రేషన్స్ పీక్స్

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం తాలూకూ ప్రమోషన్స్ స్పీడ్‌ను మేకర్స్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఎన్నడూ లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఈ మెగా వేడుకకు ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 1వ తేదీన జరగబోయే ఈ గ్రాండ్ ఈవెంట్‌కు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తం హాజరుకానుంది. దీనికి తోడు టాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర నటీనటులు, దర్శకులు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకు ప్రత్యేక షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతులు మంజూరు చేయడంతో ‘పెద్ది’ బజ్ ఒక్కసారిగా రెట్టింపయింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో సాంగ్స్ ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా నిలవగా ఈ ఈవెంట్‌లో విడుదల చేయబోయే సెకండ్ ట్రైలర్ సినిమా రేంజ్‌ను డిసైడ్ చేయనుంది. లక్షలాది మంది అభిమానుల మధ్య జరగనున్న ఈ వేడుకకు విజయవాడ మునిసిపల్ స్టేడియం ముస్తాబవుతోంది.

NTV Telugu01 Jun, 04:19 pm
తెలుగులో అదరగొట్టిన మీర్జాపూర్ మున్నా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్-ఇండియా 'పెద్ది' ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న ప్రముఖ నటుడు (మీర్జాపూర్ ఫేమ్) దివ్యేందు శర్మ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన తొలి తెలుగు సినిమా అనుభవాలను, చిత్ర యూనిట్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రేక్షకులతో పంచుకున్నారు. తన ప్రసంగం ప్రారంభంలో, భాష కొత్తదైనందున ఏవైనా తప్పులు ఉంటే క్షమించాలని విజయవాడ ప్రజలను కోరారు దివ్యేందు. ఆ తర్వాత తెలుగులో మాట్లాడి అభిమానులను ఖుషీ చేశారు,. తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన 'మీర్జాపూర్' సిరీస్‌లోని ఒక డైలాగ్‌ను గుర్తుచేస్తూ.. "మీరంతా మా ఫ్యామిలీ" అనే హిందీ డైలాగ్‌ను తెలుగులోకి అనువదించి, "మీరే మా కుటుంబం"* అనడంతో స్టేడియం మొత్తం కేరింతలతో మారుమోగిపోయింది,. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటించడంపై దివ్యేందు శర్మ సంతోషం వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "రామ్ చరణ్ అద్భుతమైన వ్యక్తి. ఆయనతో కలిసి నటించడం అంత సులువు కాదు, కానీ ఆయన నన్ను సెట్స్‌లో ఎంతో కంఫర్టబుల్‌గా ఉంచారు. దానివల్ల నా పాత్రను నేను అనుకున్న రీతిలో, చాలా చక్కగా ప్రెజెంట్ చేయగలిగాను." దర్శకుడు బుచ్చిబాబు సానాపై దివ్యేందు ప్రశంసలు కురిపించారు. ఆయనను ఒక "మ్యాడ్ జీనియస్" గా అభివర్ణిస్తూ.. తనపై నమ్మకం ఉంచి ఈ పాత్రను ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు,. తనకు తెలుగు సంస్కృతి, భాష, భావోద్వేగాలు కొత్తవైనప్పటికీ చిత్ర యూనిట్ ఎంతో మద్దతుగా నిలిచిందని చెప్పారు. అలాగే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సతీష్ గారికి మరియు విజయవాడ ప్రేక్షకుల అద్భుతమైన ఎనర్జీకి ఆయన థాంక్స్ చెప్పారు.