translateexpand_more

Peddi Movie Event Vijayawada News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy31 May, 10:03 am
విజయవాడలో పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్

గ్లోబల్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయవాడ వేదిక కానుంది. ఈ చిత్రం విడుదలకు ముందు భారీ స్థాయిలో అభిమానులను ఆకట్టుకునేలా ఈ వేడుకను నిర్వహించేందుకు చిత్రబృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అమరావతి, మే 31, (ఆంధ్రజ్యోతి): గ్లోబల్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ (Global Star Ram Charan) నటిస్తున్న భారీ చిత్రం పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు (Peddi Movie) విజయవాడ వేదిక కానుంది. ఈ చిత్రం విడుదలకు ముందు భారీ స్థాయిలో అభిమానులను ఆకట్టుకునేలా ఈ వేడుకను నిర్వహించేందుకు చిత్రబృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు(సోమవారం) సాయంత్రం 5 గంటల నుంచి ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేడుకలో హీరో రామ్ చరణ్‌తో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొననుంది. హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్‌ సందడి చేయనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటికే విజయవాడ నగరంలో మెగా అభిమానుల సందడి కనిపిస్తోంది. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానుల కోసం ప్రత్యేక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందు నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ సినిమా ప్రమోషన్లలో కీలక ఘట్టంగా మారనుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ హాజరుకానుండటంతో

NTV Telugu29 May, 09:15 am
బెజవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. సెలబ్రేషన్స్ పీక్స్

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం తాలూకూ ప్రమోషన్స్ స్పీడ్‌ను మేకర్స్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఎన్నడూ లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఈ మెగా వేడుకకు ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 1వ తేదీన జరగబోయే ఈ గ్రాండ్ ఈవెంట్‌కు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తం హాజరుకానుంది. దీనికి తోడు టాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర నటీనటులు, దర్శకులు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకు ప్రత్యేక షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతులు మంజూరు చేయడంతో ‘పెద్ది’ బజ్ ఒక్కసారిగా రెట్టింపయింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో సాంగ్స్ ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా నిలవగా ఈ ఈవెంట్‌లో విడుదల చేయబోయే సెకండ్ ట్రైలర్ సినిమా రేంజ్‌ను డిసైడ్ చేయనుంది. లక్షలాది మంది అభిమానుల మధ్య జరగనున్న ఈ వేడుకకు విజయవాడ మునిసిపల్ స్టేడియం ముస్తాబవుతోంది.