తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రక్షక సేన (టీఆర్ఎస్) పార్టీ స్థాపించిన కల్వకుంట్ల కవిత .. అధికార కాంగ్రెస్‌తోపాటు.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే అధికారం అంటూ ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ స్థాపించిన విజయ్.. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినట్లుగానే.. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత తొలి ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు.టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని.. తనకు మొదటి నుంచి నమ్మకం ఉందని తేల్చి చెప్పిన కవిత.. తమిళనాడులో విజయ్ గెలుపుతో ప్రజలకు కూడా నమ్మకం వచ్చిందని పేర్కొన్నారు. కొత్త పార్టీలకు అధికారం కట్టబెట్టాలని ప్రజలు భావిస్తున్నారని.. తన మనసులోని ఆమె మాట బయటపెట్టారు. గత 2, 3 ఏళ్లలో తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొని.. అడ్డంకులు దాటినట్లు చెప్పుకొచ్చారు. అప్పుడు వేలాది మంది మద్దతుదారులు తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. తాను జైలులో ఉన్నప్పుడు.. బయటికి వచ్చిన తర్వాత కూడా తనను ఆదరించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని.. ఏం ఇచ్చి వారి రుణం తీర్చుకోవాలో తనకు తెలియడం లేదని కవిత పేర్కొన్నారు. ఆ విధంగా తనకు మద్దతుదారులు ఉన్నారని.. వేలాది మంది టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని వెల్లడించారు. అయితే ఒకరికి మద్దతు అనేది ఊరికే రాదని.. పార్టీ పెట్టిన 10 రోజుల్లో జెండా పండగ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో అలాంటి కమిట్‌మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్నారని.. వారితోనే పార్టీ నిర్మాణం జరుగుతుందని తేల్చి చెప్పారు.
Kalvakuntla Kavitha News
Latest updates from Telugu Digital news sources.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశంపై మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడటం కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయానికి మీటర్లు బిగించేది లేదని కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలతో ముందుకెళుతున్నాయని ఆమె మండిపడ్డారు.రాష్ట్రంలో కొత్తగా రైతు డిస్కం ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని కవిత ఆరోపించారు. ఈ పేరుతో మిగిలిన రెండు డిస్కంలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ కుట్రను అడ్డుకోవడానికి అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళతామని హెచ్చరించారు. అదేవిధంగా, కేంద్రం తీసుకొచ్చిన కొత్త సోలార్ జీవో కేవలం బడా కార్పొరేట్ సంస్థలకే మేలు చేస్తుందని ఆమె విమర్శించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును దసరా నాటికి ప్రతిపాదించకపోతే, తాను పాదయాత్ర చేపడతానని కవిత హెచ్చరించారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో 18 రోజుల పసికందు చేయి కోల్పోయిన ఘటనపై కవిత తీవ్రంగా స్పందించారు. ఇది చాలా దారుణమని, దీనికి ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులే బాధ్యత వహించాలన్నారు. ఆ చిన్నారి పేరిట ప్రభుత్వం రూ.25 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు.

Kalvakuntla kavitha: మూతి పండ్లు రాలిపడ్తయ్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కల్వకుంట్ల కవిత మాస్ ధమ్కీ.. ఈ వార్తకు సంబంధించిన