translateexpand_more

100 Gram Silver Futures Contract News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu02 Jun, 01:57 am
ఇక 100 గ్రాముల వెండి కొనొచ్చు.. ఎంసీఎక్స్ లో 'సిల్వర్ 100' ఫ్యూచర్స్ లాంచ్

Silver 100 Futures : స్టాక్ మార్కెట్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే పెద్ద పెద్ద వ్యాపారస్థులు, పెట్టుబడిదారులకే అనువుగా ఉంటాయని భావిస్తుంటారు. అయితే, క్రమంగా ఆ ధోరణి మారుతోంది. ఉద్యోగులు, చిన్న చిన్న ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్, కమొడిటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే, ఇప్పటికీ చాలా వరకు చిన్న మదుపరులకు అనుకూలమైన పెట్టుబడి ఆప్షన్లు అందుబాటులో ఉండడం లేదు. ముఖ్యంగా మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ (MCX) లో వెండిలో పెట్టుబడులు అంటే పెద్ద సంస్థాగత పెట్టుబడిదారులకే అన్నట్లుగా ఉంది. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా చిన్న మదుపరులకు అందుబాటులోకి ఓ కొత్త కాంట్రాక్ట్ వచ్చింది. అదే సిల్వర్ 100 ఫ్యూచర్స్ . మరి ఈ కొత్త కాంట్రాక్ట్ పెట్టుబడి గురించి తెలుసుకుందాం. రిటైల్ ఇన్వెస్టర్లు, చిన్న ఆభరణాల వ్యాపారుల కోసం సిల్వర్ 100 ఫ్యూచర్స్ కాంట్రాక్టులను మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ సోమవారం లాంచ్ చేసింది. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి వెండి ఫ్యూచర్స్, ఆప్షన్స్‌కు ఈ కొత్త 100 గ్రాముల కాంట్రాక్టు జత కలిసింది. ప్రస్తుతం వెండి ఫ్యూచర్స్‌లో 30 కిలోలు, 5 కిలోలు, 1 కిలో కాంట్రాక్టులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నెలవారీ ఆప్షన్స్‌లో 30 కిలో గ్రాములు, 5 కిలో గ్రాముల పరిమాణాల కాంట్రాక్టులు ఉంటాయి. వీటికి 100 గ్రాముల కాంట్రాక్టు జత చేరింది. దీంతో కేవలం 100 గ్రాముల పరిమాణంలోనూ సిల్వర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులకు అవకాశం లభిస్తుంది. ఇప్పటి వరకు కాంట్రాక్టుల అధిక విలువ కారణంగా పెద్ద, సంస్థాగత పెట్టుబడిదారుల ఆధిపత్యం ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ఎక్కువగా ఉండేది. ఇకపై చిన్న మదుపరులూ ముందుకు వచ్చి సిల్వర్ 100 ఫ్యూచర్స్, ఆప్షన్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వీలు కలుగుతుంది. ఈ ట్రాన్సాక్షన్ల క్లియరింగ్, సెటిల్మెంట్ ప్రక్రియను మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (MCXCCL) నిర్వహిస్తుందని ఎంసీఎక్స్ తెలిపింది. 1- 5- 30 కిలో గ్రాముల కాంట్రాక్టులకు మార్జిన 17.25 శాతంగా ఉండగా 10 గ్రాములకు 10 శాతంగా నిర్ణయించారు. 'సిల్వర్ 100 ఫ్యూచర్స్ కాంట్రాక్ట్, భారత దేశంలోని వెండి పరిశ్రమలోని వ్యాపారాలకు ధరల అస్థిరత నుంచి తమను తాము రక్షించుకోవడానికి సహాయపడుతుంది. స్థానిక ఆభరణాల వ్యాపారాలు ఇప్పుడు తమ సరుకుల అవసరాలకు మరింత అనుగుణంగా ఉండే పరిమాణంలో హెడ్జ్ చేసుకోవచ్చు లేదా డెలివరీ తీసుకోవచ్చు.' రెగ్యులేటరీ ఫైలింగ్‌లో MCX మేనేజింగ్ డైరెక్టర్, CEO ప్రవీణ రాయ్ ఇలా అన్నారు.