translateexpand_more

Aamir Khan Wedding With Gauri Spratt News

Latest updates from Telugu Digital news sources.

AP7AM03 Jun, 04:21 pm
మూడో పెళ్లికి సిద్ధమైన ఆమిర్ ఖాన్.. పెళ్లికూతురు ఈవిడే

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఆయన తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను మూడో వివాహం చేసుకోనున్నారు. ఆమిర్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఏడాది జూలై 5న వీరిద్దరూ ఒక్కటవనున్నారు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ పెళ్లికి సంబంధించి సినిమా పరిశ్రమ వారి కోసం ఎలాంటి గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయడం లేదని కూడా తెలుస్తోంది. అయితే, ఈ పెళ్లి వార్తలపై ఆమిర్ ఖాన్ గానీ, ఆయన ప్రతినిధులు గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. గత సంవత్సరం మార్చిలో తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఆమిర్ ఖాన్ తన ప్రేయసి గౌరీని మీడియాకు పరిచయం చేసిన విషయం తెలిసిందే.దాదాపు 25 ఏళ్లుగా తాము స్నేహితులమని, కొన్నాళ్ల క్రితమే తమ మధ్య ప్రేమ చిగురించిందని ఆమిర్ ఆ సమయంలో వెల్లడించారు. అప్పటి నుంచి వీరిద్దరూ పలు సందర్భాల్లో కలిసి కనిపిస్తున్నారు. గౌరీకి ఇప్పటికే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు.ఆమిర్ ఖాన్‌కు గతంలో రెండుసార్లు వివాహమైంది. మొదట రీనా దత్తాను పెళ్లి చేసుకోగా, వారికి జునైద్, ఇరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2002లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో కిరణ్ రావును రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. అమీర్, కిరణ్ 2021లో విడిపోయారు.

Aamir Khan Wedding With Gauri Spratt News Keyword | Telugu Digital