
Adhik mass Jupiter and Saturn conjuction: అధిక మాసంలో శని, గురువు గ్రహాల కలయికను చాలా శక్తివంతమైందని చెప్తారు. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. కొన్ని గ్రహాలకు అనుకొని విధంగా ధనలాభంతో పాటు, జీవితంలో గొప్ప స్థానాలకు చేరుకుంటారు. జ్యోతిష్య పండితులు ప్రకారం ద్వాదశ రాశులపై గ్రహాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. గ్రహాల కదలికలు అనుకూలంగా ఉంటే మనుషులు ఏ పనిచేసిన వారికి కలిసి వస్తుంది. ఒకవేళ గ్రహాలగమనాలు సరిగ్గాలేకుంటే ఏది చేసిన వారికి కలిసి రాదు. పైగా నష్టం పోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అధిక జ్యేష్ట మాసం నడుస్తొంది. ఈ నేపథ్యంలో ఇటీవల గురు గ్రహాం మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించింది. కర్కాటక రాశివారికి పట్టుకున్నది ఏదైన బంగారం అవుతుంది. ఇక్కడే ఈసారి గురుగ్రహం, శని గ్రహాల అరుదైన కలయిక ఏర్పడబోతుంది. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. గురువు, శనిగ్రహాల కలయిక అనేది చాలా శక్తివంతమైందని చెప్తారు. మనకు జూన్ 5న శని, గురుడు రెండు సంయోగం చెందడం వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో ఊహించని గొప్ప మార్పులు సంభవించబోతున్నాయి. ఆ రాశులు ఏంటో చూద్దాం.. ధనస్సు.. వీరు కోర్టు కేసుల్లో విజయాల్ని సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో వీరు పెట్టిన పెట్టుబడి భారీ ఆదాయాల్ని తెచ్చిపెడుతుంది. ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ పనులన్ని కూడా జెట్ స్పీడ్లో పూర్తవుతాయి. పెళ్లికి ఏర్పడుతున్న అడ్డంకులు అన్ని దూరమై మంచి సంబంధం కుదురుతుంది. కుంభ రాశి.. ఈ రాశివారికి గురు, శని గ్రహాల సంయోగం వల్ల చాలా పాజిటివ్ ఫలితాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో రాణిస్తారు. లాటరీలు పగులుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లేందుకు మీరు చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లలో విజయాల్ని సాధిస్తారు. ప్రభుత్వఉద్యోగం పక్కాగా వస్తుందని పండితులు చెబుతున్నారు. సింహం రాశి వారు..ఈ రాశుల వారు ఈ అరుదైన సంయోగం వల్ల వ్యాపారాల్లో రాణిస్తారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. సంతానం కోసం ఎదురుచుస్తున్నవారు శుభవార్తలు వింటారు. రాజకీయాల్లో ఉన్న వారు ఉన్నత స్థానాలకు చెరుకుంటారు. రాదనుకుని వదిలేసిన సొమ్ము మీ సొంతమౌతుంది. మీన రాశి వారు.. ఈ రాశివారు ప్రతి రంగంలో కూడా తమదైన మార్క్ చూపిస్తారు. స్టాక్ మార్కెట్ లో వీరు పెట్టిన పెట్టుబడి భారీ ఆదాయాల్ని తెచ్చిపెడుతుంది. నైపుణ్యాల్ని మెరుగు పర్చుకుంటారు. పట్టిందల్లా బంగారం అవుందని చెప్పుకొవచ్చు. భూములపై మీరు పెట్టే ఇన్వెస్ట్ మెంట్ డబుల్, ట్రిబుల్ ఆదాయంను తెచ్చి పెడుతుంది. ( గమనిక - పైన ఇచ్చిన స్టోరీ కేవలం నమ్మకం, విశ్వాసాలపై మాత్రమే ఆధార పడి ఉంటుంది. దీనికి జీ తెలుగు మీడియా బాధ్యత వహించదు..)