translateexpand_more

Amb Cinemas News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu01 Jun, 02:05 pm
మహేశ్ బాబు, వెంకటేశ్, రానా కలిస్తే ఇదే ఫలితం.. హైదరాబాద్ కు భారీ గిఫ్ట్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Telugu States IMax: సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఏషియన్ గ్రూప్ భాగస్వామ్యంతో ఏర్పడిన ఏఎంబీ సినిమాస్ ఇప్పటికే అత్యుత్తమ సినిమా అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తోంది. సునీల్ నారంగ్, భరత్ నారంగ్ నేతృత్వంలోని ఏషియన్ గ్రూప్‌తో కలిసి ఈ సంస్థ ఎన్నో ఆధునిక సాంకేతికతలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. దక్షిణ భారతదేశంలో తొలి డాల్బీ సినిమా థియేటర్‌ను తీసుకురావడం, హైదరాబాద్‌లో తొలి హెచ్‌డీఆర్ బై బార్కో స్క్రీన్‌లలో ఒకదాన్ని ఏర్పాటు చేయడం వంటి విజయాలను ఏఎంబీ సినిమాస్ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరో భారీ అడుగు వేస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం మహేశ్ బాబుతో పాటు ప్రముఖ నటులు వెంకటేశ్ దగ్గుబాటి, రానా దగ్గుబాటి కూడా భాగస్వాములుగా ఉన్నారు. వీరి సహకారంతో తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక ఐమ్యాక్స్ స్క్రీన్‌ను ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ మల్టీప్లెక్స్‌ను హైదరాబాద్‌లోని చారిత్రాత్మక సుదర్శన్ 70ఎంఎం థియేటర్ స్థలంలో నిర్మిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో సుదర్శన్ థియేటర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇక్కడ ఘన విజయాలను నమోదు చేశాయి. సినీ అభిమానుల జ్ఞాపకాలతో ముడిపడిన ఈ ప్రదేశం ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐమ్యాక్స్ టెక్నాలజీ

Amb Cinemas News Keyword | Telugu Digital