
భారత రక్షణ చరిత్రలో అపూర్వమైన అధ్యాయానికి తెరలేచింది. దశాబ్దాలుగా ప్రభుత్వరంగ సంస్థలకే పరిమితమైన అధునాతన యుద్ధ విమానాల తయారీ ప్రక్రియ, ఇప్పుడు ప్రైవేటు రంగానికి విస్తరించింది. భారత స్వదేశీ స్టెల్త్ ఫైటర్ జెట్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్- ఏఎమ్సీఏ ప్రాజెక్టులో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం, రక్షణ రంగంలో భారతదేశం సాధిస్తున్న స్వావలంబనకు నిదర్శనం. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా, సొంత గగనతలాన్ని తామే రక్షించుకోవాలనే సంకల్పంతో భారత్ వేస్తున్న ఈ అడుగు, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి బాటలు పరుస్తోంది. భారత వాయుసేన అవసరాల దృష్ట్యా.. ఐదో తరం యుద్ధ విమానాల తయారీ అత్యంత అవసరమని గుర్తించిన భారత ప్రభుత్వం, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడీఏ నేతృత్వంలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గతంలో తేజస్ ప్రాజెక్టు విజయంతో ఊపిరి పోసుకున్న భారత స్వదేశీ రక్షణ పరిశ్రమ.. ఇప్పుడు మరింత శక్తిమంతమైన స్టెల్త్ సామర్థ్యాలు కలిగిన విమానాల తయారీకి సిద్ధమైంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ తో పాటు ప్రైవేటు దిగ్గజాలను కూడా ఈ బృహత్తర యజ్ఞంలో భాగం చేయడం ద్వారా, తయారీ సామర్థ్యాన్ని, వేగాన్ని పెంచాలని నిర్ణయించింది ప్రభుత్వం. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, లార్సెన్ అండ్ టూబ్రో, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి సంస్థల బిడ్లను ఆహ్వానించారు. మొదటి దశ ప్రోటోటైప్‌ల తయారీకి సుమారు రూ. 15 వేల కోట్ల భారీ కేటాయింపు చేశారు. 2031 నాటికి ఐదు ప్రోటోటైప్‌ల నిర్మాణం ఇందులోని ప్రధానాంశం. ఈ మార్పును కేవలం వాణిజ్య పరంగా చూడకూడదని అంటారు నిపుణులు. ఇది జాతీయ భద్రతకు సంబంధించినది. ఉగ్రవాదం, ప్రాంతీయ ఘర్షణలు, అస్థిరమైన సప్లై చైన్ ఉన్న ఈ సిట్యువేషన్లో విదేశీ యుద్ధ విమానాలపై ఆధారపడటం ప్రమాదకరమని భావించింది ప్రభుత్వం. ఏఎంసీఏలో రెండు