translateexpand_more

Antoine Moses News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu03 Jun, 09:22 am
గంటల్లో 47,460 మొక్కలు!.. ప్రకృతి కోసం గిన్నిస్ రికార్డు సృష్టించిన పర్యావరణ యోధుడు

ఒక రోజులో మనిషి ఎంత చేయగలడు? కొందరు ఇల్లు కడతారు. కొందరు కంపెనీని ప్రారంభిస్తారు… కానీ ఒక వ్యక్తి మాత్రం 24 గంటల్లో 47 వేల మొక్కలు నాటి అసాధ్యం కాది ఏదీ లేదని నిరూపించాడు. కెన్యా తీర ప్రాంతంలో మడ అడవుల పెంపకం కోసం పర్యావరణవేత్త ఆంటోయిన్ మోసెస్ 24 గంటల్లో 47,460 మొక్కలు నాటాడు. గిన్నిస్‌ రికార్డులోకెక్కిన అతని లక్ష్యం ఒక్కటే ..ప్రకృతిని కాపాడటం! కార్యక్రమంలో వందల మంది వాలంటీర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసి, ఒక్కో టీమ్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం వల్ల ఈ భారీ టార్గెట్ సాధ్యమైంది.నదీ జలాలు సముద్ర తీరంలో కలిసే చోట మడ అడవులు ఎక్కువగా తయారవుతాయి. చిత్తడి నేలలు ప్రకృతి పరంగా ఎంతో సున్నితమైనవి. అలల తాకిడి నుంచి ఒడ్డు కోతకు గురి కాకుండా, సునామీ నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాలను, పంట పొలాలను కాపాడుకోవడం కోసం ఈ మడ అడవులు సహజ సిద్ధంగా ఏర్పడతాయి. సునామీ వేళ రాకాసి అలల బారి నుంచి రక్షిస్తాయి. అలాంటి రక్షణ కవచాల్ని కొందరు నాశనం చేస్తూ చెట్లను నరికేయడం, చేపల చెరువులుగా మార్చేయడం చేస్తున్నారు. సముద్రం ఆటుపోట్లకు గురైనప్పుడు భూమి కోతకు గురవకుండా కాపాడటంతో పాటు సునామీ నుంచి రక్షించటంలో మడ అడవులది కీలకపాత్ర. తుపాన్ల వేళ పెనుగాలుల తీవ్రతనూ తగ్గిస్తాయి. జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తూ ఎన్నో రకాల వన్యప్రాణులకు నివాసంగా ఉంటున్నాయి. అందుకే వీటి పరిరక్షణతో పాటు విస్తరణ తప్పనిసరి. ఈ అవసరాన్ని గుర్తించిన యునెస్కో మడ అడవుల పరిరక్షణకు పిలుపునిచ్చింది. కెన్యాలో జరిగిన ఈ భారీ కార్యక్రమం ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఒక సందేశంగా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. “సంకల్పం ఉంటే ఒక వ్యక్తి కూడా ప్రకృతిని కాపాడొచ్చు” అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు “ఇలాంటి కార్యక్రమాలు ప్రతి దేశంలో జరగాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక్క రోజు… వేలాది చేతులు… లక్షల మందికి స్ఫూర్తి… భవిష్యత్తులో మరెంతో మందిని ప్రకృతి పరిరక్షణ వైపు నడిపించే అవకాశం కనిపిస్తోంది. వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు! ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్! ఈ కోడిని కూర వండుకుని తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష తప్పదు గొర్రెల కాపరి ఉద్యోగానికి భారీ క్యూ.. జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు

Antoine Moses News Keyword | Telugu Digital