translateexpand_more

Ap Farmers Get Rs Crores Income In Chilli Waste News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu03 Jun, 08:31 am
వేస్ట్ కింద వదిలేసే మిర్చి వ్యర్థాలతో రూ.కోట్లు సంపాదిస్తున్నారు.. ఈ ఐడియా ఏదో బావుందే

ఏపీలో రైతులకు మిర్చి వ్యర్థాలు పనికొచ్చేవి కాదు.. వాటికి నిప్పుపెట్టి కాల్చేవారు. అలా దేనికి పనికిరాని మిర్చి వ్యర్థాలు ఇప్పుడు కోట్లు కురిపిస్తున్నాయంటే నమ్ముతారా. అవును మీరు వింటున్నది నిజమే.. మిరప వ్యర్థాలతో భారీగా లాభాలు వస్తున్నాయి. మిర్చి వ్యర్థాల నుంచి విత్తనాలు, కాయలు, తొడిమలు వేరు చేసే యంత్రాలను తీసుకొచ్చి లాభాలు పొందుతున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోఈ సరికొత్త ఆలోచనతో మిర్చి వ్యర్థాల నుంచి ఆదాయం వస్తోంది. వ్యాపారులు ఈ వ్యర్థాలను కొనుగోలు చేస్తున్నారు.వ్యాపారులు మిరప తుక్కు కిలో రూ.30 నుంచి 40 వరకు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇలా కొనుగోలు చేసిన 100 కిలోల తుక్కు నుంచి తొడిమలు, 70 కిలోల తొడిమలు, 25 కేజీల వరకు విత్తనాలు వస్తున్నాయి. వీటితో పాటుగా కొన్ని కాయలు, దుమ్ము కూడా వస్తోంది. ఇలా వేరు చేసిన వాటిలో కిలో విత్తనాలు రూ.150కు కొనుగోలు చేస్తున్నారు. కాయల్ని కిలో రూ.80 నుంచి 120 వరకు నాణ్యతను బట్టి విక్రయిస్తున్నారు. తొడిమల్ని కేజీ రూ.3 చొప్పున సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపిస్తున్నారు. విత్తనాలను రాజస్థాన్, మహారాష్ట్ర వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.ఇలా మిర్చి వ్యర్థాల్లో దుమ్ము తప్ప అన్ని లాభాలు తెస్తున్నాయి.. చైనా నుంచి తీసుకొచ్చిన యంత్రాల ద్వారా వ్యర్థాల నుంచి విత్తనాలు, తొడిమలు, కాయల్ని వేరు చేస్తున్నారు. చైనా, పాకిస్థాన్‌తో సహా పలు దేశాల్లో మిర్చి విత్తనాల నుంచి నూనె తీసే యూనిట్లు ఉన్నాయి. ప్రస్తుతం చైనా నుంచి విత్తనాలకు డిమాండ్ ఉంటోంది.. గుంటూరు నుంచి విత్తనాలు అక్కడికి ఎగుమతి చేస్తున్నారు. గుంటూరులో ఏడాదికి రూ.60 కోట్ల వ్యాపారం జరుగుతోందని చెబుతున్నారు. స్థానికంగా ఉన్న మిర్చి వ్యర్థాలతో పాటుగా తెలంగాణ, కర్ణాటక నుంచి తుక్కును దిగుమతి చేసుకుని విత్తనాలు, తొడిమలు, కాయల్ని వేరు చేస్తున్నారు.మిరప విత్తనాల నుంచి నూనెను ప్యాకేజ్డ్ ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్‌లో ఉపయోగిస్తారు. ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి, రంగు కోల్పోకుండా ఉంచడానికి వినియోగిస్తారు. వంటల్లో కారం వేస్తే రంగు పోతాయి.. అందుకే ఈ మిరప విత్తనాల నంచి తీసిన నూనె వేస్తే రంగు మారకుండా.. ఘాటుగా ఉంటాయి. అంతేకాదు మిరప విత్తనాలతో పేస్ట్ కూడా తయారు చేస్తారు.. దీనికి కూడా డిమాండ్ ఉంది. మొత్తం మీద మిర్చి వ్యర్థాలతో రైతులు, వ్యాపారులు భారీగా ఆదాయం పొందుతున్నారు. గుంటూరు జిల్లాలో పలువురు చైనా నుంచి తీసుకొచ్చిన యంత్రాలతో ప్రత్యేకంగా యూనిట్లు ప్రారంభించారు.

Ap Farmers Get Rs Crores Income In Chilli Waste News Keyword | Telugu Digital