అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ (AP Minister Anagani Satya Prasad) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్పీపై గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఆయన ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మెగా డిఎస్సీని అడ్డుకోవడానికి 32 కేసులు వేసి విఫలమైనా గొడ్డలి పార్టీ ఇంకా కుట్రలు ఆపట్లేదని ఎద్దేవా చేశారు.

మెగా డీఎస్సీ 2025ను పూర్తి నిబంధనలు పాటిస్తూ, అవినీతికి. మానవ జోక్యానికి తావు లేకుండా నిర్వహించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆధారాల్లేకుండా ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ, డేటా డిలీట్ చేశారని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహించారు. గొడ్డలి పార్టీ కుయుక్తులను ఎదుర్కొని రికార్డు సమయంలో, పారదర్శకంగా మెగా డీఎస్సీని మంత్రి నారా లోకేశ్ నిర్వహించారని తెలిపారు. ప్రశ్నాపత్రాలు దొంగలించడం, లీక్ చేయడం గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డికే బాగా తెలుసు అని సెటైర్లు గుప్పించారు. హైదరాబాద్‌లో పదోతరగతి చదివేప్పుడు జగన్ రెడ్డి ప్రశ్నాపత్రం దొంగలించి లీక్ చేయలేదా..? అని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు.

ఈ వార్తలు కూడా చదవండి...

విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!

పోలీసులపై దాడులు సహించం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: అనిత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News