translateexpand_more

Ap Pension Scheme Apply Online News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu01 Jun, 11:52 am
ఏపీలో కొత్త పెన్షన్ దారులకు గుడ్ న్యూస్- ఆ రోజే దరఖాస్తులు-ఇవన్నీ తప్పనిసరి

ఏపీలో కూటమి ప్రభుత్వం తొలిసారి కొత్త పెన్షన్ల కోసం (new pension) దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వం.. పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ మేరకు శుభవార్త చెప్పింది. ఈ నెలలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఏయే పెన్షన్లకు కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారు, అర్హతలు ఏంటి ? ఇందుకోసం సమర్పించాల్సిన పత్రాలు ఏంటన్న వివరాలను వెల్లడించింది.AP Rains: 48 గంటల్లో భారీ వర్షాలు- ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 12న ప్రారంభించబోతోంది. ఈసారి కొత్తగా ఇచ్చే పెన్షన్లలో వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్ కూడా ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకోవాలనే వారు ప్రధానంగా ఐదు రకాల పత్రాల్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో ఆధార్ కార్డు, ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్, రేషన్ కార్డు, ఆదాయ ధృవపత్రం, కుల ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. Talliki Vandanam: తల్లికి వందనంపై కీలక అప్డేట్..! ఈసారి డబ్బుల జమకు ఇలా..!వితంతు పెన్షన్లకు పైన తెలిపిన ఐదు పత్రాలతో పాటు భర్త మరణ ధృవీకరణ పత్రం కూడా తప్పనిసరి. అలాగే ఒంటరి మహిళల పెన్షన్ కావాలంటే ఐదు ప్రధాన పత్రాలతో పాటు ప్రభుత్వం లేదా కోర్టు ద్వారా విడాకుల సర్టిఫికెట్ ఉండాలి. వృద్ధాప్య పెన్షన్ కావాలంటే ఐదు పత్రాలతో పాటు వయస్సు 60 ఏళ్లకు పైబడి ఉండాలి. వికలాంగుల పెన్షన్ కోసం ఐదు పత్రాలతో పాటు వైద్యులు ఇచ్చే సదరం సర్టిఫికెట్ కూడా సమర్పించాలి. ఈ పత్రాలతో ఈ నెల 12న సచివాలయాలకు వెళ్తే అక్కడ దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం

Zee Telugu01 Jun, 01:09 pm
ఏపీలో కొత్త పెన్షన్ల పండగ షురూ..దరఖాస్తు అప్పుడే..ఈ పత్రాలు రెడీ చేసుకోండి

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. AP Pension Scheme 2026 Update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో కొత్తగా పెన్షన్లు మంజూరు చేసేందుకు వీలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించబోతోంది. ఈ మేరకు అర్హతలు, సమర్పించాల్సిన పత్రాల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. సచివాలయంలో దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, అర్హులకు పెన్షన్లను ఖరారు చేస్తారు. పెన్షన్‌కి కావాల్సిన పత్రాలు.. ఈ విడతలో ప్రధానంగా వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళా, వికలాంగుల పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అన్ని రకాల పెన్షన్లకు కావలసిన 5 రకాల ప్రాథమిక పత్రాలతో పాటు, ఆయా కేటగిరీలను బట్టి క్రింది అదనపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వృద్ధాప్య పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే వారు కచ్చితంగా 60 ఏళ్లు పైబడి వయసు ఉండాలి. అలాగే వితంతువు పెన్షన్‌ కోసం భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. వీరితో పాటు ఒంటరి మహిళల పెన్షన్ పొందే వారు తప్పనిసరిగా కోర్టు ద్వారా భర్త నుంచి విడాకులు పొందిన సర్టిఫికేట్ ఉండాల్సిందే. మరోవైపు వికలాంగుల