translateexpand_more

Ap Thalliki Vandanam Eligibility List 2026 News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu03 Jun, 02:17 am
తల్లికి వందనం.. ప్రతి విద్యార్థికి రూ.15000 సాయం! ఆధార్ నెంబర్ తో ఒకే క్లిక్ లో మీ స్టేటస్

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Thalliki Vandanam Status Check From Mobile 2026: పాఠశాలల్లో డ్రాప్ అవుట్‌లను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం' ద్వారా ప్రతి ఏటా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 15,000 జమ చేస్తోంది. ఈ పథకం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి 12వ తరగతి విద్యార్థులకు వర్తిస్తుంది. ఇది విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పడటమే కాకుండా.. పుస్తకాలు, యూనిఫాంల కోసం అయ్యే ఖర్చును కూడా తగ్గిస్తుంది. అయితే, ఈ పథకం ప్రయోజనం పొందాలంటే 75 శాతం హాజరు తప్పనిసరి. అలాగే ఆధార్, NPCI ద్వారా బ్యాంకు ఖాతా లింక్ అయి ఉంటేనే నిధులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి. తల్లికి వందనం..ముఖ్యమైన సంక్షేమ పథకం.. మీరు తల్లికి వందనం పథకానికి అర్హులా? కాదా? మీ పేమెంట్ స్టేటస్‌ను కూడా సులభంగా తెలుసుకోవచ్చు. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా మీ స్టేటస్‌ను చెక్ చేసుకునే సౌలభ్యం ఉంది. జూన్ 19, 2026 నాటికి ఈ రూ.15,000 తల్లుల ఖాతాల్లో జమ అవుతాయని సమాచారం. ఏపీలో ఇది ఒక ముఖ్యమైన సంక్షేమ పథకంగా ఉన్న ఈ కార్యక్రమం వల్ల బడి మానేసే వారి సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తల్లికి వందనం ఎవరు అర్హులు? తల్లికి వందనం పథకం కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి. విద్యార్థులు గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి 12వ తరగతి చదువుతూ ఉండాలి. కనీసం 75 శాతం హాజరు ఉండటం, ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండటం తప్పనిసరి. నిధులు నేరుగా లబ్ధిదారులకు చేరడానికి బ్యాంకు ఖాతాకు ఆధార్ NPCI లింక్ అయి ఉండాలి.. KYC కూడా పూర్తి చేసి ఉండాలి. కావాల్సిన డాక్యుమెంట్లు: ఈ పథకానికి దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, స్టూడెంట్ ఐడి కార్డు, బ్యాంకు పాస్‌బుక్, మొబైల్ నంబర్, అటెండెన్స్ రికార్డ్స్ అవసరమవుతాయి. ఈ అర్హతలు ఉన్నవారికి ప్రతి ఏటా రూ. 15,000 నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకునే విధానం: తల్లికి వందనం నిధులు జమ అయ్యాయా? లేదా? అని మీ ఆధార్ నంబర్ , ఓటిపి ద్వారా మొబైల్‌లోనే తెలుసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout లోకి వెళ్లి 'తల్లికి వందనం స్టేటస్ చెక్' పై క్లిక్ చేయాలి. అక్కడ తల్లి 12 అంకెల ఆధార్ నంబర్ ఇచ్చి, ఓటిపి వెరిఫై చేస్తే మీ అర్హత కనిపిస్తుంది. అక్కడ 'ఎలిజిబుల్' అని వస్తే మీ పథకం ఆమోదించబడినట్లు, 'ఇన్ ఎలిజిబుల్' అని వస్తే అర్హత లేనట్లు అర్థం. 'అండర్ వెరిఫికేషన్' అని ఉంటే ప్రాసెసింగ్‌లో ఉందని, 'పెండింగ్ ఈకేవైసీ' అని వస్తే వెంటనే మీ స్కూల్ హెడ్‌మాస్టర్‌ను లేదా బ్యాంకును సంప్రదించి KYC పూర్తి చేయాలని అర్థం. ఒకవేళ 'NPCI నాట్ లింక్' అని వస్తే మీ ఆధార్ బ్యాంకు ఖాతాకు లింక్ కాలేదని అర్థం. NPCI లింక్ స్టేటస్ ఎలా చూడాలి? జూన్ 19న నిధులు పొందాలంటే మీ బ్యాంకులో NPCI లింక్ ఉందో లేదో చూసుకోవాలి. దీని కోసం 'మై ఆధార్' వెబ్‌సైట్‌లోకి వెళ్లి 'చెక్ ఆధార్ బ్యాంకు లింకింగ్ స్టేటస్' ఆప్షన్ ఎంచుకోవాలి. ఆధార్ నంబర్ వెరిఫై చేసిన తర్వాత, అది 'యాక్టివ్' అని వస్తే లింక్ అయినట్లు, 'ఇనాక్టివ్' అని వస్తే లింక్ లేనట్లు అర్థం. అప్పుడు వెంటనే మీ బ్యాంకుకు పాస్‌బుక్, ఆధార్ కార్డుతో వెళ్లి NPCI సీడింగ్ ఫారం సమర్పించాలి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Ap Thalliki Vandanam Eligibility List 2026 News Keyword | Telugu Digital