
Avengers Endgame: Encore: ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మళ్ళీ థియేటర్స్ లోకి వచ్చేస్తుంది.. అవెంజర్స్: డూమ్స్‌డే స్పెషల్ గ్లింప్స్ కూడా..
అవెంజర్స్: డూమ్స్‌డే డిసెంబర్ 18, 2026న థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. (Avengers Endgame: Encore)
© 2026 telugu.digital

అవెంజర్స్: డూమ్స్‌డే డిసెంబర్ 18, 2026న థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. (Avengers Endgame: Encore)

Sheikh Hasina | ఈ డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్‌కు.. జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం : షేక్ హసీనా

KAAKA On Jan 13 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్

రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ లో విద్యార్ధుల తిరుగుబాటుతో పదవీచ్యుతురాలై, భారత్ కు వచ్చేసి ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)ను తిరిగి తమకు అప్పగించాలని స్వదేశం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అయితే భారత ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. తాజాగా బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ భారత పర్యటనకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే అంతకంటే ముందే హసీనాను తమ దేశానికి అప్పగించాలని షరతు పెట్టారు. కానీ భారత్ స్పందించకపోవడంతో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు. దీనిపై హసీనా స్పందించారు.భారత్ కు బంగ్లా మరో షాక్..! పాక్ కూటమిలోకి నాలుగో దేశంగా..!బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ న్యూఢిల్లీ పర్యటనకు తనను అప్పగించడాన్ని ఒక షరతుగా పెట్టిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వ నిర్ణయాన్ని హసీనా ప్రశ్నించారు. తాను డిసెంబర్ నాటికి తన దేశానికి తిరిగి రావాలని భావిస్తున్నట్లు హసీనా తెలిపారు. హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఒక ప్రత్యేక టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఆమె.. బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్లడం తన సొంత నిర్ణయమని, తాను నిరవధికంగా బంగ్లాదేశ్ బయట ఉండాలనే ఉద్దేశంలో లేనని స్పష్టం చేశారు. భారత్‌లో తాను చేసిన బహిరంగ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలపై ఎందుకు ప్రభావం చూపాలని హసీనా ప్రశ్నిస్తున్నారు. భారత్-బంగ్లా మధ్య మళ్లీ హసీనా చిచ్చు..! ఢాకా ఫైర్-పాక్ తో పోల్చిన కుమారుడు..!బ్రిటన్‌లో ఉన్నప్పుడు రెహమాన్ చేపట్టిన రాజకీయ కార్యకలాపాల గురించి కూడా హసీనా ప్రస్తావించారు. అప్పట్లో తాను బ్రిటన్ జోక్యాన్ని కోరలేదన్న విషయం ఆమె గుర్తుచేశారు. తన చుట్టూ ఉన్న రాజకీయ, న్యాయపరమైన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నట్లు హసీనా చెప్పారు. డిసెంబర్ నాటికి బంగ్లాకు తిరిగి రావాలని తాను ఇప్పటికే నిర్ణయించుకున్నానని, ఖచ్చితమైన తేదీ, సమయం, ప్రవేశించే స్థలాన్ని తర్వాత ప్రకటిస్తానని ఆమె వెల్లడించారు. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం నిరవధికంగా కొనసాగనివ్వకూడదు కాబట్టి, తాను

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Folk dancer Eshwar sai filed bail petition in telangana high court: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ ల వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాధురీ రాథోడ్ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని మాధురి రాథోడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించి తన పరువుకు భంగం కలిగించేలా ఫేక్ వీడియోలు సృష్టించి డిజిటల్ వేధింపులకు గురిచేశాడని కూడా మాధురీ రాథోడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధురీ రాథోడ్ ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈశ్వర్ సాయి తాజాగా.. తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని భావించి ఈశ్వర్ సాయి తన లాయర్లతో ఈ బెయిల్ పిటిషన్ వేసుకున్నట్లు తెలుస్తొంది. మరోవైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ లు ఒకే గదిలో అడ్డంగా దొరికిపోయారు. వీరి బండారాన్ని ఈశ్వర్ సాయి శరణ్య బైటపెట్టింది. అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. తొలుత మాధురీ రాథోడ్ ది తప్పని ప్రచారం జరిగింది. ఇక ఈశ్వర్ సాయి సైతం పదే పదే వీడియోలు రిలీజ్ చేయడంతో మాధురీ రాథోడ్ కూడా అసలు విషయాన్ని బైటపెట్టింది. Read more: Disha Salian Death Case: దిశా

తెలంగాణ జానపద పాటలు, డాన్స్ షోలతో విపరీతమైన ప్రజాదరణ పొందిన బాసింగ బలాలు ఫేమ్, ప్రముఖ ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి చట్టపరమైన చిక్కుల్లో పడ్డాడు. వెండితెర, బుల్లితెరపై తన స్టెప్పులతో గుర్తింపు తెచ్చుకున్న అతడి అసలు స్వరూపం బయటపడటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని, తీరా సమయం వచ్చేసరికి ముఖం చాటేసి మోసం చేశాడంటూ అతడితో పాటు డాన్స్ చేసే తోటి కళాకారిణి మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించింది.బాధితురాలు మాధురి రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరి మధ్య జానపద పాటల షూటింగ్‌లు, సోషల్ మీడియా రీల్స్ చేసే క్రమంలో పరిచయం ఏర్పడింది. బాసింగ బలాలు పాటతో పాటు మరికొన్ని ప్రాజెక్టులలో ఇద్దరూ కలిసి నటించడంతో ఆ పరిచయం కాస్తా చొరవగా మారింది. ఆ తర్వాత మాధురిపై ప్రేమ పేరిట వల విసిరిన ఈశ్వర్ సాయి, ఆమెను పెళ్లి చేసుకుంటానని బలంగా నమ్మించాడు. అతడి మాటలను నిజమని నమ్మిన మాధురి, అతడితో సహజీవనానికి సైతం అంగీకరించింది.సహజీవనం.. ఆపై బెదిరింపులు!పెళ్లి చేసుకుంటాననే నెపంతో ఈశ్వర్ సాయి ఆమెను పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. అయితే, కొంతకాలంగా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తప్పించు తిరగడం ప్రారంభించాడు. అనుమానం వచ్చి గట్టిగా నిలదీయగా.. పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పడమే కాకుండా, ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, కెరీర్ నాశనం చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మాధురి రాథోడ్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈశ్వర్ సాయిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. అందుకే అర్ధరాత్రి మాధురి రూమ్ కు వెళ్లాను: అసలు నిజం బయటపెట్టిన ఫోక్ యాక్టర్ ఈశ్వర్ సాయిపోలీసుల కేసు నమోదు.. నిందితుడి కోసం గాలింపు!బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై సెక్సువల్ అబ్యూస్, మోసం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణ ముమ్మరం కావడంతో

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Eshwar Sai Missing: ఫోక్ డాన్సర్ 'భాసింగ బలాలు' ఫేమ్ ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని మోసం చేశాడని తోటి కళాకారిణి మాధురి రాథోడ్ ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆయన పరారయ్యారు. వేములవాడలోని ఒక హోటల్లో ఈశ్వర్ సాయి, మాధురి కలిసి ఉండగా, భార్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఆయన తప్పించుకున్నారు. అతని కోసం పోలీసులు రెండు బృందాలుగా గాలిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు అతని ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో నార్సింగి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తును వేగవంతం చేశారు. గత నెల 22న మాధురి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తనపై, తన కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేశారని పేర్కొన్నారు. అప్పటి నుండి ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు సమాచారం. మాధురి, ఈశ్వర్ సాయికి చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే, వేములవాడలోని ఒక హోటల్లో ఈశ్వర్ సాయి భార్య శరణ్య, వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రేమ పేరుతో తనను వంచించి మోసం చేశారని మాధురి ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి పోలీసులు సెక్షన్ 69 BNS ప్రకారం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేసినందుకు ఈ కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే, హోటల్ నుండి పరారైన ఈశ్వర్ సాయి ఇప్పటి వరకు ఎవరికీ అందుబాటులో లేడని పోలీసులు చెబుతున్నారు. ఈశ్వర్ సాయిని వెంటనే

వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project) ఫేజ్-1ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం సభా వేదికపై వెలిగొండ ప్రాజెక్ట్ కోసం ఉద్యమించిన పూల సుబ్బయ్య(Poola Subbaiah) కుమార్తెలు విలాసిని ( Vilasini), సునందన (Sunandana)ను ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తారని, చూస్తామని తాము ఎప్పుడూ అనుకోలేదని పూల సుబ్బయ్య కుమార్తెలు అన్నారు. తన తండ్రిని, సీఎం చంద్రబాబును మార్కాపురం జిల్లా ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని విలాసిని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కాళ్లకు వారు నమస్కరించారు. తమ కుటుంబం తరపున ధన్యవాదాలు తెలిపారు
సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా తీవ్ర వివాదాస్పదంగా మారిన జానపద కళాకారులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ల వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఎట్టకేలకు స్పందించడమే కాకుండా, తనపై దాడి చేసిన వారిపై రివర్స్ కేసు పెట్టడం ఇండస్ట్రీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. వేములవాడలోని రెడ్డి భవన్లో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని మాధురి రాథోడ్ వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొందరితో కలిసి వచ్చిన శరణ్య, తనను అసభ్యకర పదజాలంతో దూషించడమే కాకుండా భౌతికంగా దాడికి తెగబడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా దాడి చేస్తున్న సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని మాధురి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ గొడవ సమయంలో తన వద్ద ఉన్న రూ. 50 వేల విలువైన ఐఫోన్‌ను దొంగిలించారని ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం. ఈ వ్యవహారంపై నిజానిజాలు తెలుసుకోకుండా తన వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఛానళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు సంబంధిత వ్యక్తులపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో 'బాసింగా బలాలు' పాటతో ఈశ్వర్ సాయి, అనేక ప్రైవేట్ జానపద గీతాలతో మాధురి రాథోడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీసులు ఈ కేసు నమోదు చేయడంతో తదుపరి విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయోనని నెటిజన్లు ఎంతో ఉత్కంఠగా గమనిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ రిస్క్ ఫలించింది.. ఇరుముడి 200 కోట్లు పక్కా తమిళ ఇండస్ట్రీలో సంక్షోభం.. సెప్టెంబరు 1

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ భారత పర్యటనపై అనిశ్చితి నెలకొంది. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసి, గంటల్లోనే దానిని ఉపసంహరించుకోవడంతో ఈ సందిగ్ధత మరింత బలపడింది. ఆగస్టు 23 నుంచి 25 మధ్య తారిఖ్ రెహమాన్ ఢిల్లీలో పర్యటించవచ్చని జాతీయ మీడియాలో కథనాలు వెలువడిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.అయితే, ఈ పర్యటనపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. భారత్‌లో ఉంటున్న తమ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు ఇతర నిందితులను తమకు అప్పగించే విషయంపై భారత ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన కోసం బంగ్లాదేశ్ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై స్పష్టత వస్తేనే పర్యటన ఖరారయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం భారత్‌లో నివసిస్తున్న షేక్ హసీనా, తాను త్వరలోనే స్వదేశానికి తిరిగి వెళ్తానని ఇటీవల ప్రకటించారు. ఆమె మీడియా సమావేశాలు నిర్వహించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆమెను తమకు అప్పగించాలని పదేపదే డిమాండ్ చేస్తోంది. అయితే, ఈ విషయంలో భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు తారిఖ్ రెహమాన్ హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పర్యటనపై నెలకొన్న సందిగ్ధత ఈ సదస్సుపై ప్రభావం చూపుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది