translateexpand_more

Baal Aadhaar News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu30 May, 05:47 am
ఈ కార్డు మీ దగ్గర ఉందా? అన్నింటికీ ఆధారం అదే! ఈ అప్ డేట్ మిస్సవ్వద్దు

భారతదేశంలో నేడు ‘ఆధార్’ లేనిదే ఏ పనీ చేయలేని పరిస్థితి వచ్చింది. కేవలం ఒక గుర్తింపు కార్డుగా ప్రారంభమైన ఆధార్, నేడు దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా మారింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాత ‘ఎమ్‌ఆధార్’ యాప్‌ను నిలిపివేసి, సరికొత్త యాప్‌ను తీసుకురావడంతో పాటు భద్రతా నియమాలను కఠినతరం చేయడంతో ఆధార్ ప్రస్థానం మరోసారి చర్చనీయాంశమైంది. అసలు ఆధార్ ఎప్పుడు ప్రారంభమైంది? కాలక్రమేణా ఇందులో ఎలాంటి మార్పులు వచ్చాయి? చిన్న పిల్లలు, విద్యార్థులకు ఆధార్ నియమాలు ఏమిటి? ఆన్‌లైన్‌లో ఏ వివరాలు మార్చుకోవచ్చు? నేను మీకు మొత్తం డీటైల్స్ చెబుతాను. చాలా ఇంట్రస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి. ఆధార్ ఎప్పుడు ప్రారంభమైంది?.. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆధార్ ప్రాజెక్టుకు 2009లో అంకురార్పణ జరిగింది. అధికారికంగా 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా తెంబిలి గ్రామానికి చెందిన ఒక మహిళకు దేశంలోనే మొట్టమొదటి ఆధార్ కార్డును జారీ చేశారు. పౌరుల వేలిముద్రలు, కంటిపాప స్కాన్ వంటి బయోమెట్రిక్ సమాచారంతో కూడిన 12 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయించడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. దీని ద్వారానే పదిహేడు వందలకు పైగా పౌర సేవలు, సామాజిక పథకాలు అందుతున్నాయి. బ్యాంకు ఖాతాలు తెరవడానికి, ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందడానికి, మొబైల్‌ సిమ్‌ కార్డులు తీసుకోవడానికి ఆధార్‌ తోడ్పడుతోంది. దలకు ప్రత్యక్ష నగదు బదిలీ, ఇతర సంక్షేమ పథకాలను అందించడానికి-జన్‌ధన్‌ బ్యాంక్‌ అకౌంట్లు, ఆధార్‌ బయోమెట్రిక్‌ గుర్తింపు, మొబైల్‌ అనుసంధానతకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రత్యక్ష నగదు బదిలీలను ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా 4.15 కోట్ల నకిలీ ఎల్‌పీజీ కనెక్షన్లు, 5.3 కోట్ల నకిలీ రేషన్‌ కార్డులు తొలగించగలిగారు. దానివల్ల