translateexpand_more

Bakrid Market Scam News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 03:02 am
హైదరాబాద్ లో నకిలీ ఫోన్ పే యాప్ మోసం.. ఆరుగురి అరెస్ట్

హైదరాబాద్‌, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో నకిలీ డిజిటల్ చెల్లింపు యాప్‌లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను కంచన్‌బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బక్రీద్ సందర్భంగా గొర్రెల వ్యాపారిని మోసం చేసిన ఈ ఘటనలో ఇద్దరు మైనర్లతో సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు బక్రీద్ కోసం ఐదు గొర్రెలను కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి వ్యాపారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం నకిలీ ఫోన్‌పే యాప్‌ను ఉపయోగించి చెల్లింపు చేసినట్లు చూపించే ఫేక్ రసీదును చూయించి అక్కడి నుంచి పరారయ్యారు.

డబ్బు ఖాతాలో జమ కాలేదని గుర్తించిన బాధిత గొర్రెల వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన కంచన్‌బాగ్ పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించారు. దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసంలో ఇద్దరు మైనర్లు కూడా పాల్గొన్నట్లు గుర్తించారు.

ఈ వార్తలు కూడా చదవండి...

ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్‌రావు

బెట్టింగ్ రాకెట్‌పై సీఐడీ ఉక్కుపాదం.. 11 మంది అరెస్ట్

Read Latest  AP News And Telangana News And National News

And Telugu News

Bakrid Market Scam News Keyword | Telugu Digital