సింగరేణి కార్యాలయాలపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై పోలీసులు పలు సెక్షన్లు నమోదు చేశారు. తెలంగాణ భవన్‌లో ఉన్న బాల్క సుమన్‌ను అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసిన నాంపల్లి పోలీసులు.. ఆరున్నర గంటల పాటు విచారణ జరిపారు. ఆ తర్వాత శనివారం రాత్రి కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో మెడికల్ టెస్ట్‌లు నిర్వహించి అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి మేజిస్ట్రేట్ చందన ఎదుట పరిచిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్ విధించడంతో.. చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ నాంపల్లి కోర్టులో బాల్క సుమన్ అరెస్ట్, అతడిపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై విచారణ జరిగింది. అయితే ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాల్క సుమన్‌పై మొత్తం 3 సెక్షన్లు నమోదు చేయగా.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారనే సెక్షన్ వర్తించదని విచారణ సందర్భంగా నాంపల్లి కోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో 2 సెక్షన్లు మాత్రమే బాల్క సుమన్‌కు వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే బాల్క సుమన్‌పై నమోదు చేసిన మిగిలిన సెక్షన్లను కోర్టు రద్దు చేసింది. బాల్క సుమన్ రిమాండ్ రిజెక్ట్ కోరుతూ మెమోను దాఖలు చేశారు. ఇక ఈ కేసులో దేశద్రోహం సెక్షన్‌ను కూడా బాల్క సుమన్‌పై పోలీసులు నమోదు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని రాజద్రోహం సెక్షన్ 152ను కూడా పోలీసులు జోడించారు. గత నెల 26వ తేదీన తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీబీజీకేఎస్ సమావేశంలో మాట్లాడిన బాల్క సుమన్.. నాంపల్లిలోని సింగరేణి భవన్‌తోపాటు మందమర్రిలోని సింగరేణి జీఎం
Balka Suman In Chanchalguda Jail News
Latest updates from Telugu Digital news sources.
Samayam Telugu01 Jun, 03:17 pm
బాల్క సుమన్ పై దేశద్రోహం కేసు.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం సెక్షన్ చెల్లదన్న కోర్టు