translateexpand_more

Billionaire Zhang Yiming News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu03 Jun, 08:15 am
ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టిన 'టిక్-టాక్' ఫౌండర్.. ఆసియాలో టాప్-2.. ఆస్తి ఎంతో తెలుసా

Billionaires: చైనాకు చెందిన టిక్-టాక్ వ్యవస్థాపకుడు ఝాంగ్ యిమింగ్ సంపద భారీగా పెరిగింది. దీంతో భారత ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ని వెనక్కి నెట్టి ఆసియాలోనే రెండో అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ వెల్లడించింది. ప్రస్తుతం ఝాంగ్ యిమింగ్ నికర సంపద రూ.92.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపింది. ఇక ముకేశ్ అంబానీ సంపద 86.9 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో ముకేశ్ అంబానీ మూడో స్థానానికి పడిపోయారు. ఇక ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన నికర సంపద 117 బిలియన్ డాలర్లుగా ఉంది. టిక్ టాక్ (TikTok) మాతృ సంస్థ అయిన బైట్ డ్యాన్స్ లిమిటెడ్ (ByteDance Ltd) మార్కెట్ విలువ భారీగా పెరిగింది. ఈ కంపెనీ ఏఐ లక్ష్యాలపై ఇన్వెస్టర్లు ఆశాజనకంగా ఉండటంతో ఝాంగ్ యిమింగ్ నికర సంపద భారీగా పెరిగిందని బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ తెలిపింది. 2019, మార్చిలో ఝాంగ్ నికర సంపద 13 బిలియన్ డాలర్లుగా ఉండగా గడిచిన 7 సంతవత్సరాల్లోనే ఏకంగా 7 రెట్లు సంపద పెరగడం విశేషం. ఇటీవలే బైట్ డ్యాన్స్ సంస్థ తీసుకొచ్చిన డౌబావో ఏఐ చాట్ బాట్ చైనాలో చాలా పాపులర్ అయింది. నెలవారీ యూజర్ల సంఖ్య 300 మిలియన్లు దాటేసింది. భవిష్యత్తు ఏఐపై పెద్ద మొత్తంలో పెట్టుబడుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.బైట్ డ్యాన్స్ కంపెనీకి ఝాంగ్ 2012లో స్థాపించారు. దీని కింద టౌషియావో పేరుతో మీడియా అగ్రిగేటర్ తీసుకొచ్చారు. అలాగే డౌయిన్ పేరుతో వీడియో షేరింగ్ ప్లాట్ ఫారం తెచ్చారు. ఈ డౌయిన్ గ్లోబల్ మార్కెట్లో టిక్-టాక్ పేరుతో తెగ పాపులర్ అయిన విషయం తెలిసిందే. భారత్‌లోనూ కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకుంది. టిక్- టాక్ ద్వారా రీల్స్ చేస్తూ పాపులర్ అయిన వాళ్లు లక్షల్లో ఉన్నారు. టిక్ టాక్ మాదిరిగానే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ సంస్థలు సైతం రీల్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయంగా టిక్ టాక్ పేరుతో తెగ్ పాపులర్ అయిన తర్వాత ఆ మధ్య అమెరికాలో దీని వ్యాపార కార్యకలాపాల నిర్వహణపై చర్చ జరిగింది. చివరకు బైట్ డ్యాన్స్ అమెరికాలో తమ వ్యాపారాన్ని ఒరాకిల్ నేతృత్వంలోని కన్సార్షియంకు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి వచ్చింది. మరోవైపు ఈ కంపెనీ కొన్ని రోజులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ ఏడాది ఏఐలో 70 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Billionaire Zhang Yiming News Keyword | Telugu Digital