translateexpand_more

Blouse Pieces News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu03 Jun, 10:19 am
ఇంట్లో జాకెట్ ముక్కలు పడేస్తున్నారా? వాటిని ఎన్ని రకాలుగా వాడొచ్చో తెలుసా

ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగింది అంటే చాలు.. ప్రతి ఒక్కరూ ముత్తైదువులను పిలిచి పండు, తాంబూలంతో పాటు జాకెట్ ముక్క పెడుతూ ఉంటారు. ఆ జాకెట్ ముక్కలు ఏ చీరలకూ మ్యాచ్ అవ్వవు. ఒకవేళ మ్యాచ్ అయిన దానిని కుట్టించుకుంటారు మిగిలిన వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఆ జాకెట్ ముక్కలను కొందరు వేరే వాళ్లు తమ ఇంటికి వచ్చినప్పుడు పెట్టేస్తూ ఉంటారు. కానీ... అలా కాకుండా... ఇంట్లోకి ఉపయోగపడేలా వాటిని ఎలా వాడాలో తెలుసా? కేవలం ఇంట్లో వస్తువులకు మాత్రమేకాదు... అదిరిపోయే డ్రెస్సులు కూడా డిజైన్ చేసుకోవచ్చు అదెలాగో ఇప్పుడు చూద్దాం... జాకెట్ ముక్కలు అన్నీ దాదాపు 80 సెంటీ మీటర్స్ నుంచి 1 మీటర్ వరకూ ఉంటాయి. 1 మీటర్ వరకూ ఉన్నవాటిని సెలక్ట్ చేసుకుంటే.. పని ఈజీ అయిపోతుంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. వారికి చిన్న ఫ్రాక్స్ ఈజీగా కుట్టించొచ్చు. లేదు.. మా ఇంట్లో ఎవరూ చిన్న పిల్లలు లేరు అనుకుంటే...మీకు సరిపోయేలా కూడా టాప్స్ కుట్టించుకోవచ్చు. ముఖ్యంగా.. జీన్స్, స్కర్ట్స్ మీదకు ఇలాంటి షార్ట్ టాప్స్ చాలా క్యూట్ గా ఉంటాయి. పింట్రెస్ట్ లో వెతికితే చాలా రకాల మోడల్స్ కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చినవి.. డిజైన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు నచ్చిన అవుట్ ఫిట్ మీరే డిజైన్ చేసుకున్నవాళ్లు అవుతారు. అమ్మాయిలు గాజులు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్, మోడల్స్ కోరుకుంటున్నారు. కాబట్టి... థ్రెడ్ బ్యాంగిల్స్ మాదిరిగా.. ఫ్యాబ్రిక్ గాజులు కూడా తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న జాకెట్ ముక్కలు డ్రెస్ కి కంఫర్ట్ గా లేవు అనిపిస్తే.. మీరు వాటితో హెయిర్ యాక్సెసరీస్ తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా స్క్రంచీస్ తయారు చేయచ్చు. ఒక్క జాకెట్ ముక్కతో నాలుగైదు తయారౌతాయి. మీ ఫ్రెండ్స్ కి కూడా వాటిని గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు. చాలా ట్రెండీగా కూడా కనపడతారు. దాదాపు అందరూ.. ఇంట్లో ఉన్న దిండ్లకు, కుషన్స్ కి కవర్స్ బయట కొంటూ ఉంటారు. అలా కొనాల్సిన అవసరం లేకుండా.. మీరు మీకు నచ్చిన జాకెట్ ముక్కతో దిండుకు కవర్ లాగా కుట్టేయచ్చు. రెండు, మూడు కలిపి డిజైన్ లా మార్చి కూడా మీరు ట్రై చేయవచ్చు. చాలా డిఫరెంట్ గా ఉంటాయి.

Blouse Pieces News Keyword | Telugu Digital