translateexpand_more

Brown Rice For Weight Loss News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu01 Jun, 06:28 am
బ్రౌన్ రైస్ లో దాగున్న పోషకాల ఖజానా.. షుగర్ నుంచి గుండె వరకు రక్షణ

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Health Benefits Of Eating Brown Rice Every Day: ఈ కాలంలో ప్రజలందరూ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. అందుకోసం వ్యాయామాలు, యోగాలు చేస్తున్నారు. అలాగే రోజు తీసుకునే ఆహరంలో కూడా చాలా మార్పులు చేస్తున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్లో బ్రౌన్ రైస్ ఒకటి. ఇది పాలిష్ చేయని, సహజ రూపంలో ఉండే బియ్యం. బ్రౌన్ రైస్ అంటే తెల్ల బియ్యాన్ని పోలినప్పటికీ.. ఇది దాని చిప్పను తొలగించకుండా ఉంచిన బియ్యం. ఆ చిప్పలోనే పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, ఇది మన ఆరోగ్యానికి చాలా రకాల మేలు చేస్తుంది. మరి అలాంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రౌన్ రైస్‌లోని ముఖ్యమైన పోషకాలు: ఫైబర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సెలీనియం, బి విటమిన్స్, మాంగనీస్, ఐరన్, జింక్. బ్రౌన్ రైస్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే: 1. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం బ్రౌన్ రైస్‌లో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే మలబద్ధక సమస్యను నయం చేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పేగుల్లో పేరుకుపోయిన మలాన్ని బయటకు పంపిస్తుంది. మొత్తంగా జీర్ణ వ్యవస్థను సమన్వయం చేస్తుంది. 2. గుండె ఆరోగ్యాన్ని కాపాడడం బ్రౌన్ రైస్‌లో ఫైబర్, లిగ్నాన్స్, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. అలాగే ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించి, మంచి