translateexpand_more

Bsnl Data Plans News

Latest updates from Telugu Digital news sources.

AP7AM01 Jun, 12:13 pm
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్... తక్కువ ధరకు ఎక్కువ డేటా.. రోజుకు 3జీబీ

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఒక ఆకర్షణీయమైన కొత్త ప్లాన్‌ను సోమవారం అందుబాటులోకి తెచ్చింది. రూ.599 రీఛార్జ్‌తో వినియోగదారులకు భారీ ప్రయోజనాలను అందిస్తూ ఈ ప్లాన్‌ను రూపొందించింది. ప్రైవేట్ టెల్కోలకు గట్టి పోటీనిచ్చేలా ఈ ఆఫర్ ఉంది.ఈ కొత్త రూ.599 ప్లాన్ కింద రీఛార్జ్ చేసుకున్న వారికి 70 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ సమయంలో రోజుకు 3GB చొప్పున హై-స్పీడ్ డేటాను వాడుకోవచ్చు. అంటే, ప్లాన్ మొత్తం మీద 210 GB డేటా అందుబాటులో ఉంటుంది. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత కూడా ఇంటర్నెట్ సేవలు కొనసాగుతాయి, కానీ వేగం తగ్గుతుంది. డేటాతో పాటు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఉచిత నేషనల్ రోమింగ్ సదుపాయాలు కూడా ఈ ప్లాన్‌లో ఉన్నాయి.ఎక్కువ కాలం వ్యాలిడిటీతో పాటు అధిక డేటా కోరుకునే వారికి, ముఖ్యంగా సోషల్ మీడియా, యూట్యూబ్, ఓటీటీ వంటివి ఎక్కువగా చూసేవారికి ఈ ప్లాన్ చాలా అనువుగా ఉంటుంది. దీంతోపాటే, తక్కువ డేటా వినియోగించే వారి కోసం రూ.51 ప్లాన్‌ను కూడా బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ ప్రయోజనాలను అందిస్తుంది.

Zee Telugu27 May, 02:24 am
బీఎస్ఎన్ఎల్ రూ.255 రీఛార్జ్ ప్లాన్.. 30 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2.5 డేటా! ఫుల్ డిటెయిల్స్

BSNL Rs 255 Recharge Plan Benefits: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) తక్కువ ధరలో చాలా రకాల ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ అయిన BSNLలో మీరు ఎక్కువ డేటాతో పాటు వ్యాలిడిటీ సమయంతో మంచి ప్లాన్స్ పొందవచ్చు. BSNL అందిస్తున్న 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్తో మీరు రోజుకి 2.5 GB డేటాను కూడా పొందుతారు. దీని ధర కేవలం రూ.255 మాత్రమే. ఇందులో మీకు లభించే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. మీరు BSNL కస్టమర్ అయితే, తక్కువ ధరలో మంచి ప్లాన్ కోసం ఎదురు చూస్తున్నారా? ఇందులో మీరు రోజుకు 2.5 GB డేటాను ఉపయోగించుకోవచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా పొందుతారు. ఈ ప్లాన్ ధర కేవలం రూ.255 మాత్రమే. దీని వ్యాలిడిటీ 30 రోజుల పాటు లభిస్తుంది. తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉన్న ఈ BSNL రీఛార్జ్ ప్లాన్ సాధారణంగా చాలా టెలికాం కంపెనీలు 28 రోజుల ప్లాన్ మాత్రమే అందిస్తున్నాయి. దీనివల్ల ఏడాదికి 12 నెలలు అయితే 13 నెలల పాటు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే, BSNL అందిస్తున్న ఈ రీఛార్జ్ ప్లాన్‌తో 30 రోజులు అంటే 75 GB డేటా ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు 2.5 GB డేటా లభిస్తుంది. డేటా అయిపోయిన తర్వాత కూడా ఇంటర్నెట్ వేగం తగ్గే అవకాశం ఉంది, కానీ నెట్ మాత్రం లభిస్తుంది. BSNL 4G అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక BSNL రూ.485 ప్లాన్ కూడా 72 రోజుల పాటు వ్యాలిడిటీతో లభిస్తుంది. ఇందులో కూడా ప్రతిరోజు 2.5 GB డేటా, అపరిమిత కాలింగ్,