
BSNL Rs 255 Recharge Plan Benefits: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) తక్కువ ధరలో చాలా రకాల ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ అయిన BSNLలో మీరు ఎక్కువ డేటాతో పాటు వ్యాలిడిటీ సమయంతో మంచి ప్లాన్స్ పొందవచ్చు. BSNL అందిస్తున్న 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్తో మీరు రోజుకి 2.5 GB డేటాను కూడా పొందుతారు. దీని ధర కేవలం రూ.255 మాత్రమే. ఇందులో మీకు లభించే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. మీరు BSNL కస్టమర్ అయితే, తక్కువ ధరలో మంచి ప్లాన్ కోసం ఎదురు చూస్తున్నారా? ఇందులో మీరు రోజుకు 2.5 GB డేటాను ఉపయోగించుకోవచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా పొందుతారు. ఈ ప్లాన్ ధర కేవలం రూ.255 మాత్రమే. దీని వ్యాలిడిటీ 30 రోజుల పాటు లభిస్తుంది. తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉన్న ఈ BSNL రీఛార్జ్ ప్లాన్ సాధారణంగా చాలా టెలికాం కంపెనీలు 28 రోజుల ప్లాన్ మాత్రమే అందిస్తున్నాయి. దీనివల్ల ఏడాదికి 12 నెలలు అయితే 13 నెలల పాటు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే, BSNL అందిస్తున్న ఈ రీఛార్జ్ ప్లాన్‌తో 30 రోజులు అంటే 75 GB డేటా ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు 2.5 GB డేటా లభిస్తుంది. డేటా అయిపోయిన తర్వాత కూడా ఇంటర్నెట్ వేగం తగ్గే అవకాశం ఉంది, కానీ నెట్ మాత్రం లభిస్తుంది. BSNL 4G అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక BSNL రూ.485 ప్లాన్ కూడా 72 రోజుల పాటు వ్యాలిడిటీతో లభిస్తుంది. ఇందులో కూడా ప్రతిరోజు 2.5 GB డేటా, అపరిమిత కాలింగ్,