translateexpand_more

Career News News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu01 Jun, 11:57 am
ఏమిటీ.. రూ.72 లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తామంటే వద్దన్నాడా..! కారణమేంటో తెలిస్తే షాక్

Viral News : ఏకంగ 72 లక్షల రూపాయల జీతమిచ్చి ఉద్యోగం ఇస్తామంటే ఎవరు వద్దంటారు. ఇలాంటి జాబ్ ఆఫర్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఓ సాఫ్ట్‌వేర్ డెవలపర్ మాత్రం ఈ భారీ ఆఫర్‌ను వద్దనుకున్నాడు. ఈ రోజుల్లో ఉద్యోగులకు కేవలం జీతం మాత్రమే ముఖ్యం కాదని… వర్క్ కల్చర్, ఇతర సౌకర్యాలు కూడా ఎంత ముఖ్యమో ఈ సంఘటన తెలియజేస్తోంది. కళ్లు చెదిరే ప్యాకేజీల కన్నా ఇవే ముఖ్యమని కొందరు నిపుణులు భావిస్తున్నారు. రాగిణి పాండే అనే సాఫ్ట్‌వేర్ డెవలపర్ 'X' (గతంలో ట్విట్టర్)లో ఒక స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె స్నేహితుడు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసి, రూ.72 లక్షల వార్షిక వేతనంతో కూడిన ఆఫర్‌ను తిరస్కరించినట్లు ఆమె తెలిపారు. ఆ స్క్రీన్‌షాట్‌లో, మనీష్ అనే రిక్రూటర్... ఆఫర్‌ను అంగీకరించమని, మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేద్దామని కోరడం కనిపిస్తుంది. కానీ ఉద్యోగ నియమ నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఆ డెవలపర్ ఈ ఆఫర్‌ను వద్దనుకున్నాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను కూడా ఆ డెవలపర్ వివరించాడు. సరైన లీవ్ పాలసీ లేకపోవడం, ప్రస్తుత జీతంతో పోలిస్తే తక్కువ హైక్ ఉండటం, వేరే ప్రాంతానికి మారడానికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వకపోవడం వంటి అనేక అంశాలను అతను ప్రస్తావించాడు. ''ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అనుకూలంగా లేదు, అందుకే ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వస్తోంది" అని అతను స్పష్టంగా చెప్పాడు. రూ.72 లక్షల ప్యాకేజీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, తన వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రాధాన్యాలకు ఇది సరిపోదని ఆ డెవలపర్ నొక్కి చెప్పాడు. "జీవన వ్యయం, రిలోకేషన్ బోనస్ లేకపోవడం, లీవ్ పాలసీ