translateexpand_more

Viral News News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu31 May, 10:16 am
బాబోయ్.. కంచం నిండా మిరపకాయలు పెట్టుకుని ఎలా తినేస్తున్నాడో చూడండి.. వైరల్ వీడియో

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Green Chilli Eating Challenge Viral Video Watch: సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం ఏదో ఒక వింత వీడియో సోషల్ మీడియా వినియోగదారుల ముందుకు వస్తూనే ఉంది. లైకులతో పాటు వ్యూస్ కోసం కొందరు చేసే సాహసాలు ఒక్కొక్కసారి ఆశ్చర్యపోయేలా చేస్తే.. మరికొన్నిసార్లు భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి.. తాజాగా అలాంటి కోవాకు చెందిన ఆశ్చర్యం కలిగించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. సాధారణంగా కూరగాయల్లో ఒకటో రెండో పచ్చిమిరపకాయలు ఎక్కువైతేనే కారంతో నోరంతా మండిపోతూ ఉంటుంది.. కానీ ఈ వీడియోలో వ్యక్తి మాత్రం అత్యంత ఘాటైన పచ్చిమిరపకాయలను థియేటర్లలో లభించే పాప్‌కార్న్ తిన్నట్లు రెండు చేతులతో గుప్పిళ్ళకొద్దీ నోట్లో వేసుకుని నమిలేస్తున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే వైరల్‌గా మారింది.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో సదరు వ్యక్తి తన ముందు ఒక పెద్ద కంచం నిండా పచ్చిమిరపకాయలను పెట్టుకొని కూర్చుని ఉన్నాడు.. దాదాపు రెండు నుంచి మూడు కేజీలకు పైగా ఉన్న ఆ పచ్చిమిరపకాయలను అతని ఏమాత్రం లెక్కచేయకుండా తినడం ప్రారంభించాడు. ఒకటి రెండు కాదు.. ఒకేసారి పదుల సంఖ్యలో మిరపకాయలను రెండు చేతులతో తీసుకొని నోట్లో కుక్కుకుంటూ.. కటకటా నములుతూ మింగేస్తున్నాడు.. ఈ దృశ్యాలు చూస్తున్న వారికే నోరు

Andhra Jyothy01 Jun, 04:04 pm
సినిమా స్టైల్లో చోరీ.. క్షణాల వ్యవధిలో రూ. 5.50 లక్షలు కొట్టేశాడుగా

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లోని అత్యంత రద్దీగా ఉండే అహ్మదాబాద్ మానేక్ చౌక్ ప్రాంతంలో సినిమా తరహా చోరీ కలకలం సృష్టించింది. ఒక బులియన్ వ్యాపారి వద్ద పనిచేసే ఉద్యోగి ఏమరపాటును ఆసరాగా చేసుకున్న ఓ గుర్తు తెలియని దొంగ.. అత్యంత చాకచక్యంగా నగదును దోచుకెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత ఉద్యోగి మానేక్ చౌక్ వీధిలో నడుస్తూ వెళ్తూ తన మొబైల్ ఫోన్‌లో నిమగ్నమైపోయాడు. ఆ సమయంలో చుట్టుపక్కల జనం తిరుగుతున్నప్పటికీ.. దొంగ అతడి సమీపానికి వచ్చి నిలబడ్డాడు. ఉద్యోగి ఫోన్ చూసుకుంటున్న సమయంలో దొంగ.. క్షణాల వ్యవధిలో అతని బ్యాగ్ జిప్ తీసి రూ. 5.50 లక్షల నగదును దొంగిలించాడు.

ఫోన్ చూసుకోవడంలో మునిగిపోయిన ఉద్యోగికి ఆ సమయంలో ఏం జరిగిందో అస్సలు తెలియలేదు. ఆ తర్వాత అతను తన కార్యాలయానికి చేరుకుని, బ్యాగ్‌ను తెరిచి చూడగా నగదు మాయమైనట్లు గుర్తించి షాక్‌కు గురయ్యాడు. చోరీ ఘటన మొత్తం.. అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.

ఇవి కూడా చదవండి..

పింఛన్లను రూ.4వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ..

పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: ఎమ్మెల్యే వసంత

Andhra Jyothy31 May, 02:22 am
మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన.. బాబాగా మారాలని జననాంగం నరుక్కున్నాడు

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఓ షాకింగ్ చోటుచేసుకుంది. సాధువు కావాలనే కోరికతో ఓ వ్యక్తి తన జననాంగాన్ని కోసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సమస్యలను తట్టుకోలేక బాబాగా మారాలనుకున్న ఓ 42 ఏళ్ల వ్యక్తి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గొడ్డలితో తన జననాంగాన్ని నరుక్కుని బావిలోకి విసిరేశాడు. మహారాజ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది (Sadhu Story).

రైతుగా జీవనం సాగిస్తున్న ఆ వ్యక్తి కుటుంబ బాధ్యతల నుంచి, పాపభీతి నుంచి విముక్తి పొంది బాబాగా మారాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో అతడు అత్యంత ప్రమాదకరమైన చర్యకు పాల్పడ్డాడు. తన పాప కర్మలకు జననాంగమే కారణమని భావించి దానిని నరుక్కున్నాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న అతడిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు (Madhya Pradesh News).

అతడికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు (Shocking Viral News). అతడి భార్య పక్షవాతం కారణంగా మంచాన పడింది. పెద్ద కూతురి వివాహం జూన్ 25వ తేదీన జరగాల్సి ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల కారణంగా అతడు కొంత కాలంగా తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడు. అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన నౌక.. అమెరికా క్షిపణి దాడి..

బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా

Zee Telugu29 May, 11:13 am
టీవీ సీరియల్ పేరిట డాక్టర్ కు కుచ్చుటోపీ.. తీగలాగితే తెలంగాణ, ఆంధ్ర మధ్య జరిగిన సైబర్ నేరం

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Cyber Crime On Serials Chance: సోషల్‌ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తి ఓ వైద్యురాలిని నమ్మించాడు.. తనదైన మాటలతో బుట్టలో వేసుకున్నాడు. అనంతరం ఆమె అకౌంట్ల నుంచి విడతల వారీగా డబ్బులు వేయించుకున్నాడు. ఆమెకు సీరియల్స్‌ ఇష్టం కావడంతో సీరియల్స్‌లో నటించే అవకాశం కల్పిస్తానని చెప్పి డబ్బులు వేయించుకుని అనంతరం పత్తా లేకుండాపోయాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. ఆమె డబ్బులతో అతడు ఓ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఈ ఉదంతం విశాఖపట్టణం జిల్లాలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్టణంలో ఓ కార్ల షోరూమ్‌ ఉంది. ఆ షోరూమ్‌లో ఓ వ్యక్తి రూ.22 లక్షలు ఖర్చు చేసి కారు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు కార్ల షోరూమ్‌ అకౌంట్‌ ఫ్రీజ్‌ అయింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఓ ఏఎస్‌ఐ కేసు నమోదు చేయకుండా దర్యాప్తు ప్రారంభించాడు. ఆ డబ్బు పంపిన అకౌంట్‌ నంబర్‌ ఆధారంగా ఖమ్మంలోని ఓ మహిళా డాక్టర్‌ను సంప్రదించారు. మీరే నిందితురాలు అని ఏఎస్‌ఐ నిలదీయగా.. అయ్యో తాను అసలైన బాధితురాలినని చెప్పారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం జరిగింది ఏమిటో తెలుసుకుందాం. బాధితురాలి కథనంతో.. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెంది ఓ డాక్టర్‌ భార్యకు సోషల్‌ మీడియా ద్వారా విశాఖపట్టణంలోని మధురవాడకు చెందిన జంబాడ లక్ష్మీ వరప్రసాద్‌

Zee Telugu25 May, 11:29 am
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ,...

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంల...

Eenadu27 May, 02:49 pm
కేన్స్ వేదికపై సహజ సౌందర్యం.. ఎవరీ తబిత

రంగు, రూపు, చక్కదనం.. అందమంటే చాలామంది వీటినే ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ సిసలైన సౌందర్యం మన ఆత్మవిశ్వాసంలోనే ఉందని నిరూపిస్తున్నారు కొందరమ్మాయిలు. తబితా మేరీ ఇదే కోవకు చెందుతుంది. రంగు, రూపు, చక్కదనం.. అందమంటే చాలామంది వీటినే ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ సిసలైన సౌందర్యం మన ఆత్మవిశ్వాసంలోనే ఉందని నిరూపిస్తున్నారు కొందరమ్మాయిలు. తబితా మేరీ ఇదే కోవకు చెందుతుంది. జర్మనీలో స్థిరపడిన ఈ తమిళ మోడల్‌ తన చామనఛాయ రంగు కారణంగా చిన్నతనం నుంచి వర్ణ వివక్షను ఎదుర్కొంది. కానీ ఎప్పు్డైతే తనను తాను అంగీకరించడం మొదలుపెట్టిందో అప్పట్నుంచి.. తానెలా ఉందో అలాగే కెమెరా ముందుకు రావడం ప్రారంభించింది. ఇటీవలే ముగిసిన ప్రతిష్టాత్మక కేన్స్‌ చిత్రోత్సవంలోనూ తన సహజసిద్ధమైన లుక్‌తో రెడ్‌ కార్పెట్‌పై మెరిసింది. ఈ ఫొటోల్ని తబిత తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. తన ఆత్మవిశ్వాసాన్ని చూసి చాలామంది నెటిజన్లు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ‘ఈ న్యాచురల్‌ బ్యూటీకి సినిమాల్లో అవకాశమివ్వమం’టూ దర్శకనిర్మాతల్ని కోరుతున్నారు. ‘లవర్‌ ఆఫ్‌ లైఫ్‌’.. సోషల్‌ మీడియాలో తనను తాను ఇలాగే పరిచయం చేసుకుంటుంది తబిత. తద్వారా తనలోని స్వీయ ప్రేమను చాటుకుంటుంది. అయితే నిజానికి 19 ఏళ్లొచ్చే దాకా తానింత పాజిటివిటీతో లేనని, ఎందుకంటే చర్మ ఛాయ కారణంగా సమాజం తనను చిన్న చూపు చూసిందని చెబుతోంది. ‘మాది తమిళ మూలాలున్న కుటుంబం. నేను పుట్టకముందే మా అమ్మానాన్నలు జర్మనీలోని ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డారు. విదేశంలోనే పుట్టినా తమిళమ్మాయిగానే నన్ను పెంచారు. నాకు చిన్నతనం నుంచి మోడలింగ్‌ అంటే చాలా ఇష్టం. కానీ ఇందుకు నేను సరిపోనేమో అని భావించేదాన్ని. ఎందుకంటే చర్మ ఛాయ తక్కువగా ఉన్న మోడల్స్‌, ఇతర ప్రముఖుల్ని నేను

Zee Telugu24 May, 11:56 am
Wife Killed: ప్రియుడితో రహాస్య సంబంధం.. భర్తను భార్య హత్య చేసి జేసీబీతో పూడ్చివేత

- జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. - ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. - గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Asianet News Telugu01 Jun, 11:57 am
ఏమిటీ.. రూ.72 లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తామంటే వద్దన్నాడా..! కారణమేంటో తెలిస్తే షాక్

Viral News : ఏకంగ 72 లక్షల రూపాయల జీతమిచ్చి ఉద్యోగం ఇస్తామంటే ఎవరు వద్దంటారు. ఇలాంటి జాబ్ ఆఫర్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఓ సాఫ్ట్‌వేర్ డెవలపర్ మాత్రం ఈ భారీ ఆఫర్‌ను వద్దనుకున్నాడు. ఈ రోజుల్లో ఉద్యోగులకు కేవలం జీతం మాత్రమే ముఖ్యం కాదని… వర్క్ కల్చర్, ఇతర సౌకర్యాలు కూడా ఎంత ముఖ్యమో ఈ సంఘటన తెలియజేస్తోంది. కళ్లు చెదిరే ప్యాకేజీల కన్నా ఇవే ముఖ్యమని కొందరు నిపుణులు భావిస్తున్నారు. రాగిణి పాండే అనే సాఫ్ట్‌వేర్ డెవలపర్ 'X' (గతంలో ట్విట్టర్)లో ఒక స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె స్నేహితుడు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసి, రూ.72 లక్షల వార్షిక వేతనంతో కూడిన ఆఫర్‌ను తిరస్కరించినట్లు ఆమె తెలిపారు. ఆ స్క్రీన్‌షాట్‌లో, మనీష్ అనే రిక్రూటర్... ఆఫర్‌ను అంగీకరించమని, మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేద్దామని కోరడం కనిపిస్తుంది. కానీ ఉద్యోగ నియమ నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఆ డెవలపర్ ఈ ఆఫర్‌ను వద్దనుకున్నాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను కూడా ఆ డెవలపర్ వివరించాడు. సరైన లీవ్ పాలసీ లేకపోవడం, ప్రస్తుత జీతంతో పోలిస్తే తక్కువ హైక్ ఉండటం, వేరే ప్రాంతానికి మారడానికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వకపోవడం వంటి అనేక అంశాలను అతను ప్రస్తావించాడు. ''ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అనుకూలంగా లేదు, అందుకే ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వస్తోంది" అని అతను స్పష్టంగా చెప్పాడు. రూ.72 లక్షల ప్యాకేజీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, తన వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రాధాన్యాలకు ఇది సరిపోదని ఆ డెవలపర్ నొక్కి చెప్పాడు. "జీవన వ్యయం, రిలోకేషన్ బోనస్ లేకపోవడం, లీవ్ పాలసీ

Andhra Jyothy28 May, 08:17 am
వామ్మో.. బెంగళూరులో బట్టలు ఇస్త్రీ చేయించడం ఇంత ఖరీదా.. నోయిడా వాసి షాక్

బెంగళూరులో పెరుగుతున్న జీవన వ్యయాలపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. బెంగళూరులో ఒక్క షర్టు ఇస్త్రీ చేయడానికి రూ.20 వసూలు చేశారని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. బెంగళూరులో పెరుగుతున్న జీవన వ్యయాలపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. బెంగళూరులో ఒక్క షర్టు ఇస్త్రీ చేయడానికి రూ.20 వసూలు చేశారని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అదే పనికి నోయిడాలో చాలా తక్కువ చెల్లించేవాడినని ఆయన తెలిపారు. ఆయన పోస్ట్‌పై జోరుగా చర్చ జరుగుతోంది (Bengaluru laundry prices). సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్ ప్రకారం.. బెంగళూరులో ఒక షర్ట్ లేదా ప్యాంట్‌ను ఇస్త్రీ చేయడానికి రూ.20 వరకు తీసుకుంటున్నారని ఆ వ్యక్తి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నోయిడాలో ఇదే పనికి కేవలం రూ.5 నుంచి రూ.8 వరకు మాత్రమే తీసుకుంటారని తెలిపాడు. ఈ పోస్టుపై అనేక మంది తమ అనుభవాలను పంచుకుంటున్నారు. బెంగళూరులో పెరుగుతున్న ధరల గురించి ఆందోళన వ్యక్తం చేశారు (Noida vs Bengaluru). బెంగళూరులో అద్దెలు, కార్మిక వ్యయాలు, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు ఎక్కువగా ఉండటంతో సేవల ధరలు కూడా అధికంగా ఉంటాయని ఒక వ్యక్తి వ్యాఖ్యానించారు (Bengaluru expensive living). ఐటీ నగరంగా మారిన తర్వాత బెంగళూరులో సాధారణ సేవల ఖర్చులు అమాంతం పెరిగిపోయాయని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరులో అద్దెలు, ఆహారం, క్యాబ్ ఛార్జీలు, లాండ్రీ వంటి రోజువారీ సేవల ధరలు ఎక్కువని కొందరు అభిప్రాయపడ్డారు. వడదెబ్బ బాధితుల కోసం కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు: డాక్టర్ వాణి

Eenadu28 May, 09:09 am
సార్లు ల్యాండింగ్ విఫలం.. ప్రయాణికుల్లో భయాందోళన

Viral video | ఇంటర్నెట్‌ డెస్క్‌: కొలంబియాలోని ఓ విమానానికి అనూహ్య పరిస్థితి ఎదురైంది. పర్వత శిఖరాల్లో ఉన్న విమానాశ్రయం వద్ద ల్యాండింగ్‌ సమయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో రెండుసార్లు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పైలట్‌ అప్రమత్తతతో విమానానికి ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ విమానం కొలంబియాలోని బొగోటా నుంచి పాస్టోలోని విమానాశ్రయానికి బయలుదేరింది. ఈ ఎయిర్‌పోర్టు సముద్ర మట్టానికి దాదాపు 6 వేల అడుగుల ఎత్తులో ఉంది. దట్టమైన పొగమంచు, బలమైన గాలులు వీయడంతో పైలట్‌ తొలుత విమానాన్ని ల్యాండింగ్‌ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. రెండోసారి ప్రయత్నించినా కుదరలేదు. దీంతో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనలకు గురయ్యారు. భయంతో కొందరు అరవడం, మరికొందరు ఏడవడం, ఇంకొందరు ప్రార్థనలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ల్యాండింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో పైలట్‌ మరో ప్రయత్నం చేయకుండా విమానాన్ని తిరిగి బొగోటాకు మళ్లించాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణం కుదుటపడ్డాక విమానం ఎట్టకేలకు పాస్టోలోని ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ ఘటనపై సదరు విమానయాన సంస్థ స్పందించింది. ప్రతికూల వాతావరణం కారణంగానే ఇలా జరిగిందని పేర్కొంది. క్లిష్ట పరిస్థితుల్లో పైలట్‌ సరైన నిర్ణయం తీసుకున్నారని అభినందించింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర

TV9 Telugu29 May, 07:47 am
బుర్జ్ ఖలీఫాలా మారిన బుడ్డోడి క్రేజ్.. బ్యాట్ పై స్టిక్కర్ కోసం ఏకంగా బ్లాంక్ చెక్ ఆఫర్

Vaibhav Sooryavanshi Bat Sponsorship: భారత క్రికెట్‌లో మరో మహా సంచలనం నమోదైంది. కేవలం పదిహేనేళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దిగ్గజాల రికార్డులను ముక్కలు చేస్తూ ఒక కుర్రాడు సృష్టిస్తున్న ప్రభంజనం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారిస్తూ, బ్రాండ్ వాల్యూలో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌లకే సవాల్ విసురుతున్న ఆ యువ కిరటంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల విధ్వంసం సృష్టిస్తున్నాడు. మైదానంలోకి దిగితే చాలు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏకంగా 680 పరుగులు సాధించి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు బాది క్రికెట్ ప్రపంచాన్ని ఊపిరి సలపకుండా చేశాడు. ఈ క్రమంలోనే ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును సైతం ఈ కుర్రాడు బద్దలు కొట్టడం విశేషం. వైభవ్ సూర్యవంశీ కేవలం మైదానంలోనే కాదు, మార్కెట్ ప్రపంచంలోనూ సునామీ సృష్టిస్తున్నాడు. నిన్నటివరకు అంతగా గుర్తింపు లేని ఈ ఆటగాడి బ్రాండ్ వాల్యూ ఇప్పుడు రోజురోజుకూ ఆకాశాన్నంటుతోంది. భవిష్యత్తులో విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాల రికార్డులను, వారి క్రేజ్‌ను అధిగమించగల ఏకైక ఆటగాడు వీడేనని క్రీడా విశ్లేషకులు గట్టిగా చెప్తున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ప్రదర్శనతో మార్కెట్ డిమాండ్‌లో ఎంతోమంది సీనియర్ స్టార్ ఆటగాళ్లను ఈ కుర్రాడు ఎప్పుడో వెనక్కి నెట్టేశాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వాడుతున్న బ్యాట్ స్పాన్సర్‌షిప్ ఒప్పందం విలువ కేవలం