
రంగు, రూపు, చక్కదనం.. అందమంటే చాలామంది వీటినే ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ సిసలైన సౌందర్యం మన ఆత్మవిశ్వాసంలోనే ఉందని నిరూపిస్తున్నారు కొందరమ్మాయిలు. తబితా మేరీ ఇదే కోవకు చెందుతుంది. రంగు, రూపు, చక్కదనం.. అందమంటే చాలామంది వీటినే ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ సిసలైన సౌందర్యం మన ఆత్మవిశ్వాసంలోనే ఉందని నిరూపిస్తున్నారు కొందరమ్మాయిలు. తబితా మేరీ ఇదే కోవకు చెందుతుంది. జర్మనీలో స్థిరపడిన ఈ తమిళ మోడల్ తన చామనఛాయ రంగు కారణంగా చిన్నతనం నుంచి వర్ణ వివక్షను ఎదుర్కొంది. కానీ ఎప్పు్డైతే తనను తాను అంగీకరించడం మొదలుపెట్టిందో అప్పట్నుంచి.. తానెలా ఉందో అలాగే కెమెరా ముందుకు రావడం ప్రారంభించింది. ఇటీవలే ముగిసిన ప్రతిష్టాత్మక కేన్స్ చిత్రోత్సవంలోనూ తన సహజసిద్ధమైన లుక్‌తో రెడ్ కార్పెట్‌పై మెరిసింది. ఈ ఫొటోల్ని తబిత తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. తన ఆత్మవిశ్వాసాన్ని చూసి చాలామంది నెటిజన్లు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ‘ఈ న్యాచురల్ బ్యూటీకి సినిమాల్లో అవకాశమివ్వమం’టూ దర్శకనిర్మాతల్ని కోరుతున్నారు. ‘లవర్ ఆఫ్ లైఫ్’.. సోషల్ మీడియాలో తనను తాను ఇలాగే పరిచయం చేసుకుంటుంది తబిత. తద్వారా తనలోని స్వీయ ప్రేమను చాటుకుంటుంది. అయితే నిజానికి 19 ఏళ్లొచ్చే దాకా తానింత పాజిటివిటీతో లేనని, ఎందుకంటే చర్మ ఛాయ కారణంగా సమాజం తనను చిన్న చూపు చూసిందని చెబుతోంది. ‘మాది తమిళ మూలాలున్న కుటుంబం. నేను పుట్టకముందే మా అమ్మానాన్నలు జర్మనీలోని ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డారు. విదేశంలోనే పుట్టినా తమిళమ్మాయిగానే నన్ను పెంచారు. నాకు చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఇందుకు నేను సరిపోనేమో అని భావించేదాన్ని. ఎందుకంటే చర్మ ఛాయ తక్కువగా ఉన్న మోడల్స్, ఇతర ప్రముఖుల్ని నేను