translateexpand_more

Cbse Board News

Latest updates from Telugu Digital news sources.

Eenadu02 Jun, 12:15 pm
సీబీఎస్ ఈ పోర్టల్ పై లక్షకుపైగా సైబర్ దాడుల యత్నాలు

దిల్లీ: సీబీఎస్‌ఈ విద్యార్థుల రీవాల్యూయేషన్‌ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో తమ పోర్టల్‌పై సైబర్‌ దాడి యత్నాలు జరిగాయని సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు వెల్లడించింది. మధ్యాహ్నం 3గంటల సమయంలో 16 వేలమంది విద్యార్థులు రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. ఈ సమయంలోనే కొందరు డినయల్-ఆఫ్-సర్వీస్ (DoS)అనే విధానంతో దాడికి ప్రయత్నించారని, దీని వల్ల రెండు నిమిషాల వ్యవధిలోనే పోర్టల్‌లోకి లాగిన్‌ అవ్వడానికి దాదాపు 15 లక్షల మంది ప్రయత్నించారని తెలిపింది. ఫైళ్లలోకి అనధికారికంగా ప్రవేశించడానికి లక్షకుపైగా సైబర్‌దాడుల ప్రయత్నాలు జరిగినట్లు తమ సిస్టమ్‌ గుర్తించిందని తెలిపింది. ఈ సైబర్‌ దాడులు జరిగినప్పటికీ.. ప్రస్తుతం పోర్టల్ పనిచేస్తూనే ఉందని, విద్యార్థుల దరఖాస్తులను ప్రాసెస్ చేస్తోందని సీబీఎస్‌ఈ తెలిపింది. ఈ పోర్టల్‌లో ఒకేసారి 8,000 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకునే సామర్థ్యం ఉందని వెల్లడించింది. సాంకేతిక బృందాలు ఈ ప్లాట్‌ఫామ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని.. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే స్పందిస్తున్నాయని తెలిపింది. విద్యార్థులు ఎలాంటి అంతరాయం లేకుండా సేవలను పొందగలిగేలా తమ బృందాలు కృషి చేస్తున్నాయని పేర్కొంది. సీబీఎస్‌ఈ 12వ తరగతిలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ (ఓఎస్‌ఎం) పద్ధతి కారణంగా తమ సమాధాన పత్రాలు తారుమారయ్యాయంటూ కొందరు విద్యార్థులు ఆందోళనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే (CBSE Class 12 Results). దీనిపై స్పందించిన బోర్డు విద్యార్థులకు జవాబు పత్రాల స్కానింగ్‌ కాపీలను అందిస్తామని, వాటిని సరిచూసుకొని రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ రీవాల్యూయేషన్‌ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకునే పోర్టల్‌పైనే తాజాగా సైబర్‌ దాడి జరిగినట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది. ఇదో మాల్వేర్‌. ఇందులో సైబర్‌ దుండగులు ఒకటి లేదా పలు కంప్యూటర్ల నుంచి ఏదైనా వెబ్‌సైట్‌కు వచ్చేందుకు యత్నిస్తారు. ఈ మాల్వేర్‌ ఒక్కసారిగా టార్గెట్‌ చేసిన వెబ్‌సైట్‌ను లక్షలమంది యాక్సస్‌ చేసేందుకు వస్తున్నట్టుగా చూపిస్తుంది. దీంతో టార్గెట్‌ చేసిన వెబ్‌సైట్‌ అంత ట్రాఫిక్‌ అందుకోలేక ఆ సర్వర్‌ నిలిచిపోతుంది. అయితే సీబీఎస్‌ఈ ఈ దాడులను సమర్థంగా అడ్డుకుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. భోపాల్‌లో ఆత్మహత్య చేసుకున్న నటి, మోడల్‌ ట్విషా శర్మ కేసులో నిందితుడి తరఫు అనుచరులు.. సాక్షులపై దాడులకు తెగబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.