translateexpand_more

Cctv Footage News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy01 Jun, 04:04 pm
సినిమా స్టైల్లో చోరీ.. క్షణాల వ్యవధిలో రూ. 5.50 లక్షలు కొట్టేశాడుగా

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లోని అత్యంత రద్దీగా ఉండే అహ్మదాబాద్ మానేక్ చౌక్ ప్రాంతంలో సినిమా తరహా చోరీ కలకలం సృష్టించింది. ఒక బులియన్ వ్యాపారి వద్ద పనిచేసే ఉద్యోగి ఏమరపాటును ఆసరాగా చేసుకున్న ఓ గుర్తు తెలియని దొంగ.. అత్యంత చాకచక్యంగా నగదును దోచుకెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత ఉద్యోగి మానేక్ చౌక్ వీధిలో నడుస్తూ వెళ్తూ తన మొబైల్ ఫోన్‌లో నిమగ్నమైపోయాడు. ఆ సమయంలో చుట్టుపక్కల జనం తిరుగుతున్నప్పటికీ.. దొంగ అతడి సమీపానికి వచ్చి నిలబడ్డాడు. ఉద్యోగి ఫోన్ చూసుకుంటున్న సమయంలో దొంగ.. క్షణాల వ్యవధిలో అతని బ్యాగ్ జిప్ తీసి రూ. 5.50 లక్షల నగదును దొంగిలించాడు.

ఫోన్ చూసుకోవడంలో మునిగిపోయిన ఉద్యోగికి ఆ సమయంలో ఏం జరిగిందో అస్సలు తెలియలేదు. ఆ తర్వాత అతను తన కార్యాలయానికి చేరుకుని, బ్యాగ్‌ను తెరిచి చూడగా నగదు మాయమైనట్లు గుర్తించి షాక్‌కు గురయ్యాడు. చోరీ ఘటన మొత్తం.. అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.

ఇవి కూడా చదవండి..

పింఛన్లను రూ.4వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ..

పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: ఎమ్మెల్యే వసంత

Cctv Footage News Keyword | Telugu Digital