translateexpand_more

Chandrababu Naidu News

Latest updates from Telugu Digital news sources.

Sakshi02 Jun, 12:44 pm
డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సాక్షి,విశాఖ: యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అయ్యిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. విశాఖలో మంగళవారం బొత్స మీడియాతో మాట్లాడారు. ‘డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. వ్యవస్థను కూటమి ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోంది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే సమాధానం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పదివేల ఉద్యోగాలు భర్తీ చేశామ’ని గుర్తు చేశారు. చీరలో ధగధగా మెరిసిపోతున్న దివ్యభారతి (ఫొటోలు) సింగర్ సునీత తనయుడు ఆకాష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కొత్త మలుపు’ (ఫొటోలు) విజయవాడలో గ్రాండ్ గా ‘పెద్ది ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) భర్తతో కలిసి జపాన్ ట్రిప్‌లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు) అన్యాయంగా, బలవంతగా తీసుకున్న, మీ భూమిని వెనక్కి ఇచ్చే బాధ్యత నాది భారత్ ను కమ్మేసిన 2500 కిలోమీటర్ల రాకాసి మేఘాలు నాకు ఏపీలోనే దిక్కు లేదు.. తెలంగాణ లో సీఎం నా ?

NTV Telugu02 Jun, 12:28 pm
గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష.. పవన్ కల్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం

CM Chandrababu: 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘంతో కీలక సమీక్ష నిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. పుష్కరాల నిర్వహణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పుష్కర ఘాట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల మెరుగుదల, ఆరోగ్య సేవల విస్తరణ, నీటి వనరుల నిర్వహణ వంటి అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఆరు జిల్లాల్లో మొత్తం 525 పుష్కర ఘాట్లను అభివృద్ధి చేసి భక్తుల అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు తెలిపారు. రాజమహేంద్రవరాన్ని (రాజమండ్రి) భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మెగాసిటీగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గోదావరి పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అంతటి భారీ జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వసతులను ముందస్తుగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం వెల్లడించారు. పుష్కరాల సందర్భంగా రాష్ట్ర ప్రతిష్ఠ పెరిగేలా అన్ని ఏర్పాట్లు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని ఆయన సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హోంమంత్రి వంగలపూడి అనిత, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వర్చువల్‌గా హాజరయ్యారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ (లేదా సీఎస్ సాయి ప్రసాద్‌గా పేర్కొన్న వివరాల ప్రకారం), డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గోదావరి పుష్కరాల నోడల్ అధికారి వీరపాండియన్ తదితర ఉన్నతాధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

Andhra Jyothy02 Jun, 09:57 am
పనిచేయకపోతే నమస్కారం పెట్టి పక్కనపెట్టేస్తా.. ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు

అమరావతి, జూన్ 2: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌పై వర్క్ షాప్‌లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 4న ఎన్డీఏ నేతల సమావేశం జరగనుందని తెలిపారు. రాష్ట్ర, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఎన్డీఏ సమన్వయ కమిటీల నియామకం జరగనున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలను కలుపుకువెళ్లాలని.. బలం ఎక్కువా తక్కువా అనేది అనవసరమని, అటువంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దన్నారు. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలకు సీఎం స్పష్టం చేశారు. జెండా మోయాలంటే జెండా ద్వారా వచ్చిన అధికారంలో కార్యకర్తలను భాగస్వామ్యులను చేయాల్సిందే అని చెప్పారు.

పదవి ఎవరికీ శాశ్వతం కాదని.. పనిచేసినంత కాలం పదవికి ఢోకా ఉండదని సీఎం అన్నారు. పని చేయకపోతే నమస్కారం పెట్టి ఎటువంటి మొమమాటం లేకుండా పక్కనపెట్టేస్తానని తేల్చిచెప్పేశారు. ఎవరూ వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దన్నారు. అమెరికన్ డెమోక్రసీలో రెండు సార్లు మాత్రమే ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. ‘మన దగ్గర ప్రజలు మెచ్చినంత కాలం మనం ఎమ్మెల్యేగా ఉండవచ్చు. ఎమ్మెల్యేల ప్రవర్తన బాగుంటే.. ఓట్లు పడతాయి.. ప్రజలు ఆదరిస్తారు. ఎమ్మెల్యేల ప్రవర్తన బాగోలేకపోతే ఓట్లు పోతాయి.. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. పనిచేయకపోయినా పర్వాలేదు.. నోరు మాత్రం పారేసుకోవద్దు. తస్మాత్... జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలను చంద్రబాబు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి..

మే నెలలో రికార్డు స్థాయి దర్శనాలు

తెలంగాణ ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

Read Latest AP News And Telugu News

Andhra Jyothy02 Jun, 05:04 am
తెలంగాణ ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమరావతి, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలు ఏర్పడినా.. తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటే అని సీఎం అన్నారు. మూడున్నర కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలతో యువత బలిదానాలతో సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోవాలి: చంద్రబాబు ‘తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు. ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా... తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటే. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోటీ పడి దూసుకుపోవాలి. ఎంతో చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలుగు గడ్డ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలి. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలి. ప్రతి తెలుగు కుటుంబానికి అభివృద్ధి ఫలాలు దక్కాలి. అత్యుత్తమ జీవన ప్రమాణాలు పొందాలి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో మన రెండు రాష్ట్రాలు కలిసి పని చేసి, కీలక భూమి పోషించి తెలుగు వైభవాన్ని, ప్రాభవాన్ని చాటాలి’ అంటూ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు: పవన్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మూడున్నర కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలతో యువత బలిదానాలతో సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. జనసేన ఊపిరులూదుకొన్నది తెలంగాణ గడ్డపైనే. ఈ నేల నుంచే వారసత్వంగా పోరాట పటిమను పుణికి పుచ్చుకున్నది. అణగారినవర్గాల సంక్షేమం, యువత ఆకాంక్షలు, వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగితే గళం వినిపించే తెగువ తెలంగాణలో ఉంది. అటువంటి లక్షణం జనసేన శ్రేణుల్లోనూ నిండుగా ఉంది. ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద విలసిల్లే తెలంగాణ రాష్ట్రం సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికీ అంజలి ఘటిస్తున్నాను’ అంటూ పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏలూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

Sakshi02 Jun, 01:18 am
చంద్రబాబు సర్కారుపై సమరభేరి. డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువతరం. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.