translateexpand_more

Cm Chandra Babu News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu03 Jun, 05:23 am
కూటమికి మొదటి పరీక్ష, సీరియస్ గా తీసుకోవాల్సిందే - తాజా నిర్ణయం

ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి అవుతోంది. అటు ప్రతిపక్షం ప్రభుత్వం టార్గెట్ గా కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. మూడు పార్టీల మధ్య సమన్వయం పైన పార్టీల అధినాయకత్వం ఫోకస్ చేసింది. అందులో భాగంగా క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న సమాచారంతో అలర్ట్ అయింది. దీంతో.. కూటమి నేతలు కీలక భేటీకి నిర్ణయించారు. జిల్లా స్థాయిలోనూ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇక.. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్లాలని కూటమి నేతలు డిసైడ్ అయ్యారు.ఏపీలో కూటమి పార్టీల మధ్య సమన్వయం పైన సీఎం చంద్రబాబు ఫోకస్ చేసారు. అందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్.. బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ తో చంద్రబాబు రేపు (గురువారం) కీలక భేటీ ఏర్పాటు చేసారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలతో పాటుగా సర్ ప్రక్రియ పైనా చర్చించున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యేల వర్క్ షాప్ లో చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేసారు. సర్‌ ప్రక్రియ పర్యవేక్షణలో కూటమి పార్టీలను కూడా సమన్వయం చేసుకుని వెళ్లాలని నిర్దేశించారు. సర్‌పై మూడు పార్టీలతో త్వరలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, గ్రామ స్థాయిలోనూ సమన్వయ కమిటీలు వేస్తామని చెప్పారు. ప్రభుత్వంలోనే కాదు... అన్ని కార్యక్రమా ల్లో నూ జనసేన, బీజేపీతో సమన్వయం చేసుకోవాలని నిర్దేశించారు. పార్టీల మధ్య సమన్వయానికి సర్‌ మొదటి పరీక్షగా పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల మిత్రపక్షాలు ఉండకపోవచ్చని... అయినా వారిని కలుపుకొని వెళ్లాలని తేల్చి చెప్పారు.షర్మిల కు రాజ్యసభ సీటు ఖరారు వేళ బిగ్ ట్విస్ట్, ఆయన ఎంట్రీతో..!!సమన్వయ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు 2024 ఎన్నికలకంటే ఎక్కువగా మిత్రపక్షాలతో పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేసారు. అదే విధంగా ప్రతి 20 -25 ఏళ్లకోసారి సర్‌ ప్రక్రియ జరుగుతుంది. 2002లో జరిగింది. మళ్లీ ఇప్పుడు ఆ ఓటర్ల జాబితాను తీసుకుని దీనిని నిర్వహిస్తారు. జూలై 14లోగా రెండుసార్లు ఓట్ల మ్యాపింగ్‌ చేస్తారు. అప్పటిలోగా అర్హుల ఓట్ల చేరికలు పూర్తి కావాలని సూచించారు. సర్‌ను అందరూ సీరియ్‌సగా తీసుకోవాలని.. ఎలాంటి నిర్లక్ష్యమూ ఉండకూడదని స్పష్టం చేసారు. మన పార్టీకి బూత్‌ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు) ఉన్నారని,వారు ఎన్నికల కమిషన్‌ నియమించిన బీఎల్‌వోలతో కలిసి వెళ్లాలని చెప్పారు. ఎక్కడా ఉదాసీనత వద్దని... ప్రతి రోజూ మానిటర్‌ చేస్తా... సమీక్ష నిర్వహిస్తానని వెల్లడించారు. మన ఓట్లు ఉన్నాయో లేదో నిరంతరం చూసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ పర్యవేక్షణ లో మూడు పార్టీల నియోజకవర్గాల నేతలు ఉండే విధంగా రేపు జరిగే సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా రాజ్యసభ.. స్థానిక సంస్థల ఎన్నికల పైనా చర్చించనున్నారు.

Cm Chandra Babu News Keyword | Telugu Digital