
CM Vijay | తమిళనాడులో ఎనిమిదో తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్ పథకం.. ప్రారంభించిన సీఎం విజయ్
CM Vijay | తమిళనాడులో ఎనిమిదో తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్ పథకం.. ప్రారంభించిన సీఎం విజయ్
© 2026 telugu.digital

CM Vijay | తమిళనాడులో ఎనిమిదో తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్ పథకం.. ప్రారంభించిన సీఎం విజయ్

CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..

New CM Vijay-themed Ganesha idols were installed in Chennai’s RK Nagar. The designs drew inspiration from the film Ghilli and were presented in a Vijay-themed format, linking the deity idols with the Tamil Nadu CM Vijay theme in the local area. ఈ ఏడాది చెన్నైలోని ఆర్ కే నగర్ కొరుక్కుపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు సాధారణ భక్తులతో పాటు సినీ ప్రేమికులను ఆకట్టుకుంటోన్నాయి.

CM Vijay | స్టాలిన్‌ను బాడీ షేమింగ్ చేయలె.. మాటల మధ్యలో అలా చేశానంతే..!

తమిళ చిత్రసీమలో రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్గా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న కోలీవుడ్ క్వీన్ త్రిష కృష్ణన్, ప్రస్తుతం లండన్‌లో ప్రారంభమైన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌తో మళ్లీ వార్తల్లో నిలిచింది. తమిళ చిత్రసీమలో రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్గా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న కోలీవుడ్ క్వీన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan), ప్రస్తుతం లండన్‌లో ప్రారంభమైన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌తో మళ్లీ వార్తల్లో నిలిచింది. అయితే ఈ సినిమా ప్రాజెక్ట్ ప్రారంభమైన నాటి నుంచి కోలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన ప్రచారం జోరందుకుంది. ఇదే త్రిష నటిస్తున్న చివరి సినిమా కానుందా? ఆమె త్వరలోనే సినిమాలకు పూర్తి స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుందా? అనే చర్చలు నడుస్తున్నాయి. దళపతి విజయ్‌తో త్రిషకు ఉన్న సాన్నిహిత్యం,వారిద్దరి కాంబినేషన్‌కు కోలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం, ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఈమధ్య కాలంలో విజయ్- త్రిష కలిసి కనిపించడం తగ్గింది. విజయ్ రాజకీయాల్లో బిజీగా మారగా.. త్రిష వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ఈమధ్యనే లండన్ లో ఫ్రెండ్స్ తో కనిపించిన త్రిష తాజాగా అక్కడే సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాకు శ్రీకారం చుట్టింది. బాలీవుడ్లో ఎయిర్‌లిఫ్ట్, చెఫ్, పిప్పా వంటి విభిన్న కథాంశాలతో ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు రాజా కృష్ణ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా న ప్రముఖ నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ బ్యానర్.. లోకోమోటివ్ గ్లోబల్, ఫ్యూజన్ ఫ్లిక్స్ సంస్థలతో కలిసి కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ ఈ ఈ సినిమాతో మొదటిసారి తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్, నేషనల్ అవార్డ్ విన్నర్ అపర్ణ బాలమురళి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముగ్గురు పవర్ఫుల్ నటీమణులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటం, లండన్ నేపథ్యంలో సాగే

తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు దళపతి విజయ్ ఇటీవల సేలం పర్యటించారు. ఆయన అక్కడ ఒక వృద్ధురాలికి డియోర్ సన్‌గ్లాసెస్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ అపురూపమైన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ సీఎం విజయ్ బహుమతిగా ఇచ్చిన ఆ సన్‌గ్లాసెస్ ధర ఎంత ఉంటుందో తెలుసా..!. ఆ సన్‌గ్లాస్ ప్రత్యేకత ఇది.. ఇక్కడ క్రిస్టియన్ డియోర్ అనేది ఫ్యాషన్‌కి సంబంధించిన బ్యూటీ లేబుల్ దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉంది. ఇది విలాసవంతమైన హ్యాండ్‌బ్యాగులు, నాణ్యమైన దుస్తులు, ప్రత్యేకమైన యాక్సెసరీలకు ప్రసిద్ధిగాంచింది. ఇది బ్లాక్ రెక్టాంగులర్ సన్ గ్లాసెస్ అని తెలుస్తోంది. ఆ బ్రాండ్ వెబ్సైట్ ప్రకారం..ఈ సన్‌గ్లాసెస్ ఖరీదు వచ్చేసి రూ. 46,450లు. దీనిలో సన్నని నల్లటి ఫ్రేమ్‌కు క్రిస్టల్-టోన్, సిల్వర్-ఫినిష్ మెటల్ టెంపుల్స్ అమర్చబడి, సూక్ష్మంగా కాంట్రాస్ట్‌గా ఉండే 'క్రిస్టియన్ డియోర్' సంతకం కూడా ఉంటుంట. ఇటలీలో తయారైన ఈ యాక్సెసరీ నీలి రంగు లెన్సులు, నీలి రంగు టెంపుల్ చివరలు, నల్లటి ఎసిటేట్ ఫ్రేమ్ ఉన్నాయి. ఇది సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ ఇచ్చే చలువ కళ్లజోడే. కాగా, కావేరీ డెల్టాలో సాంబ వరి సాగు కోసం మెట్టూరు డ్యామ్ గేట్లను తెరిచి నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రి విజయ్ సేలంలో ఉన్నారు. పవర్ స్టేషన్‌ను తనిఖీ చేసిన తర్వాత, ఆయన రోడ్డు పక్కన ఉన్న ఒక ఫామ్‌హౌస్‌ను సందర్శించారు. అక్కడ ఆయనకు చెల్లం అనే వృద్ధురాలిని కలిశారు. అంతేగాదు ఆయన ఆమెను భోజనం చేశారా అని అడగగా, తన కోసం ఎదురుచూస్తూ తినలేదని చెప్పిందామె. అలాగే ఆమె ఆరోగ్యం గురించి అడిగాను. కానీ ఆ వృధ్దురాలు విజయ్‌ని చూసిన ఆనందంలో తను పడుతున్న కష్టాల గురించి వెళ్లబోసుకోవడం మర్చిపోయిందామె. (చదవండి: క్లౌడ్ కిచెన్‌తో లక్షల్లో నష్టం..కానీ పదినెలల్లోనే రూ. 2 కోట్లు!) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ
వృద్ధురాలికి తమిళనాడు సీఎం విజయ్ గిఫ్ట్.. ఆమె ఫుల్ ఖుషీ తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. సాలేమ్ జిల్లా పర్యటనలో భాగంగా ఒక గ్రామీణ ప్రాంతంలో పర్యటించారు. కావేరి డెల్టా సాగు నీటి కోసం మెట్టూరు జలశాయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అధికారిక కార్యక్రమం నిమిత్తం.. సీఎం విజయ్ సాలేమ్ వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం సాలేమ్ విమానాశ్రయానికి తిరుగు పయనమవుతున్న సమయంలో.. మార్గమధ్యలో ఒక పొలం వద్ద.. కాన్వాయ్‌ను ఆపాలని సెక్యూరిటీకి సూచించారు. అలా దగ్గర్లోని పొలంలో పని చేసుకుంటున్న కొందరు మహిళల వద్దకు స్వయంగా కారు దిగి సీఎం విజయ్ వెళ్లారు. ఆ ప్రాంతానికి చెందిన చెల్లమ్ అనే వృద్ధురాలు ఆశ్చర్యంతో ముందుకు వచ్చి ఆయన చేయి పట్టుకున్నారు. "భోజనం చేశావా?" అని సీఎం విజయ్ ఆమెను ఆప్యాయంగా పలకరించగా.. మిమ్మల్ని చూడాలని అలాగే ఎదురుచూస్తున్నాను.. అందుకే ఇంకా తినలేదు అని ఆమె బదులిచ్చారు. ఈ వార్తకు సంబంధించిన

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న జైలర్ 2 పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జైలర్ భారీ విజయాన్ని అందుకుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న జైలర్ 2 (Jailer 2) పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జైలర్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక జైలర్ 2 అంతకుమించి ఉండనుందని తెలియడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ కానుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 15 న రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే.. జైలర్ 2 అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించడం లేదని తమిళ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జైలర్ 2 వాయిదా పడడానికి ప్రధాన కారణం తమిళనాడు సీఎం విజయ్ అని కోలీవుడ్ కోడై కూస్తోంది. అదేంటీ.. ఆయనకు, జైలర్ 2 కి సంబంధం ఏంటి అంటే.. ఈ సినిమాలో మొదట విజయ్ రాజకీయాల్లో గెలవరు అనుకోని రజనీ ప్రభుత్వం, రాజకీయ పనితీరుపై కొన్ని ఘాటు డైలాగ్స్ చెప్పాడట. కానీ, విజయ్ గెలిచి సీఎం కూడా అయ్యారు. ఇప్పుడు ఆ డైలాగ్స్ ని విజయ్ ఫ్యాన్స్ అపార్థం చేసుకుంటే సినిమాకి డ్యామేజ్ జరుగుతుందనే ఉద్దేశంతో డైరెక్టర్ నెల్సన్ కీలక మార్పులు చేయడం మొదలుపెట్టాడట. దీనికోసమే కొత్తగా డైలాగ్స్ రాసి.. రీషూట్ చేస్తున్నారట. ఈ షూట్ కాకుండా ఇంకా ఈ సినిమాకు బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ కాలేదని టాక్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేకర్స్.. అక్టోబర్ 15 న కాకుండా కొత్త తేదీని వెతికే పనిలో పడ్డారట. ఇక ఈ రేసులో జైలర్ 2 వెనక్కి తగ్గితే ఆ స్లాట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ వారి
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను వైఎస్సార్సీపీ ఎంపీ కలిశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకుఎంపీ డాక్టర్ గుమ్మా తనూజ రాణి, తన భర్త వినయ్‌తో కలిసి చెన్నైలోని సచివాలయంలో విజయ్‌తో సమావేశం అయ్యారు. పార్లమెంటరీ స్టడీ టూర్ కోసం ఎంపీ తనూజ రాణి చెన్నైకి వెళ్లారు.. ఈ సందర్భంగా సీఎం విజయ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తమిళనాడు సీఎంను కలవడం ఆనందంగా ఉందంటూ ఫోటో, వీడియోను పోస్ట్ చేశారు.ఎంపీలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో స్టడీ టూర్ కోసం చెన్నై వెళ్లారు. CMDA (చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ), తమిళనాడు అర్బన్ హ్యాబిటాట్ డెవలప్మెంట్ బోర్డు, CMRL (చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్), గ్రేటర్ చెన్నై కార్పొరేషన్, కమిషనరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్, CMWSSB (చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు) సంస్థల ఉన్నతాధికారులతో పట్టణాభివృద్ధి, మౌలిక వసతులపై చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో పట్టణ ప్రణాళికను మరింత బలోపేతం చేయడం, ప్రజా మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, గృహ నిర్మాణం, రవాణా సౌకర్యాలు, నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ వ్యవస్థలను మెరుగుపరచడం, స్థిరమైన అభివృద్ధిని సాధించడం వంటి అంశాలపై చర్చించారు. ఈ కమిటీలో మరికొందరు ఎంపీలు కూడా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను కలిశారు.2024 ఎన్నికల్లో తనూజ రాణి అరకు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు. తనూజ అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ కోడలు. పాల్గుణ 2019 ఎన్నికల్లో అరకు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు 2024 ఎన్నికల్లో సీటు దక్కలేదు.. ఆయన స్థానంలో రేగ మత్స్యలింగంకు టికెట్ కేటాయించారు. అయితే పాల్గుణ కోడలు తనూజకు అరకు ఎంపీగా అవకాశం ఇచ్చారు. తనూజ రాణి డాక్టర్ కాగా.. మాజీ ఎమ్మెల్యే పాల్గుణ

సాక్షి, చెన్నై: జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మాత్రమే ప్రధాని అభ్యర్థిగా ఉంటారని, తమిళనాడు సీఎం విజయ్‌కి అలాంటి ఆలోచన ఊహల్లో కూడా ఉండదని ఎండీఎంకే నేత వైగో వ్యాఖ్యానించారు. ఇకపై మంత్రులు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సీఎం విజయ్ చూసుకోవాలని సూచించారు. సోమవారం తిరునెల్వేలిలో వైగో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమిళనాడులో ఒక భారీ ప్రభుత్వ మార్పు వచ్చిందని, టీవీకే ప్రభుత్వాన్ని సీఎం విజయ్ అవి నీతి రహితంగా నడిపిస్తున్నారని కొనియాడారు. గతంలో ప్రతి శాఖలో లంచాలు ఇస్తేనే పనులు జరిగే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ప్రజలు ఏ ప్రభు త్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కమీషన్లు లేకుండా నేరుగా పాల న సాగుతోందన్నారు. 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ ప్రభుత్వానికి తాను 100కి 80 మార్కులు ఇస్తున్నానని, అవినీతిని పూర్తిగా నిర్మూలించడం హిమాలయాన్ని కదిలించినంత కష్టమైన పనిగా పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చక్కగా పనిచేస్తున్నట్టు వైగో అభినందించారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వం: ‘’రాహుల్ గాంధీని ప్రధానిగా అంగీకరించకపోతే రాజీనామా చేస్తాం’’ అని మంత్రి రాజేష్‌కుమార్ చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సీఎం విజయ్ ఊహల్లో కూడా అలాంటి ఆలోచన ఉండదన్నారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాం«దీనే ప్రధాని అభ్యరి్థగా ఉంటారని, మంత్రులు బాధ్యతారాహిత్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సీఎం విజయ్ నిరోధించాలని సూచించారు. ఇక, కావేరీ నిర్వహణ బోర్డు తన బాధ్యతను విస్మరించిందని, కర్ణాటక ప్రభుత్వానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తూ తమిళనాడుకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని, ఈ ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని వైగో డిమాండ్ చేశారు. కాగా, సీఎం విజయ్ భావి ప్రదాని అంటూ మంత్రులు వ్యాఖ్యల తూటాలను అందుకోవడంతో కాంగ్రెస్ నాయకులు గుర్రు మంటున్న విషయం

Telangana Politics : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి... వరుసగా రెండుసార్లు సీఎంగా చేశారు. ఇక ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR) సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్... ఆ పార్టీ సీఎం అభ్యర్థి కూడా ఆయనే అనేది పొలిటికల్ టాక్. అయితే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా సీఎం రేసులో ఉన్నారా? అంటే అవుననే జవాబు వినిపిస్తోంది. బిఆర్ఎస్ పార్టీ ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన ఆమె తండ్రి, సోదరుడికి పొలిటికల్ గా దూరమయ్యారు... ఇటీవల కొత్త పార్టీ పెట్టారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరు కలిసివచ్చేలా తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ పెట్టారు... దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో కవిత పలువురు ముఖ్యమంత్రులకు ఆధ్యాత్మిక సలహాదారుగా ఉన్న ఓ జ్యోతిషుడిని కలిశారు... ఇలా మరోసారి వార్తల్లో నిలిచారు కవిత. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రముఖ జ్యోతిషులు రాధన్ పండిట్ వేత్రివేల్తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని కవిత నివాసానికి రాధన్ పండిత్ విచ్చేశారు... ఆమెతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ మీటింగ్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో పొలిటికల్ గా ప్రాధాన్యం సంతరించుకుంది. కవిత, రాధన్ పండిత్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి... ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. రాధన్ పండిట్ ప్రముఖ రాజకీయ జ్యోతిషులు. ఆయన చూసే జాతకాలు, చెప్పే జోస్యాలు కరెక్ట్‌గా జరుగుతాయని చాలామంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు నమ్ముతారు. దేశవ్యాప్తంగా చాలా మంది రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు ఈయనే ఆధ్యాత్మిక, జ్యోతిష సలహాదారు. వేద జ్యోతిషం, న్యూమరాలజీలో ఆయనకు ఏకంగా నలభై ఏళ్లకు పైగా

ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న తాయిమామన్ తంగ మోతిరం పథకం టెండర్ ప్రక్రియ పూర్తయింది. ప్రముఖ జ్యువెలరీ సంస్థలు జోయ్ ఆలుక్కాస్, కల్యాణ్ జ్యువెలరీస్ ఎంపిక అయ్యాయి. 755 కోట్ల రూపాయల విలువ చేసే టెండర్లు ఇవి. బంగారం ఉంగరాన్ని తయారు చేయడం, రవాణా, ఇతరత్రా ఖర్చులను ఆ సంస్థలే భరించాల్సి ఉంటుంది.ఈ పథకం కింద తమిళనాడులోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే సుమారు 4.42 లక్షల మంది నవజాతా శిశువులకు ఒక్కో గ్రాము చొప్పున బంగారు ఉంగరాలను బహూకరిస్తారు. ఈ పథకానికి సంబంధించిన బంగారపు వ్యయాన్ని మార్కెట్ ధరల ఆధారంగా ప్రభుత్వమే భరిస్తుంది. నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచేందుకు విజయ్ ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోన్నారు.దీనికోసం తమిళనాడు మెడికల్ సర్వీసెస్ జూలై 14న దేశవ్యాప్తంగా టెండర్లను ఆహ్వానించింది. అధికారిక టెండర్ల పోర్టల్ ద్వారా జోయ్ ఆలుక్కాస్, కల్యాణ్ జ్యవెలరీస్, జీఆర్టీ జ్యువెలర్స్, ఉమ్మిడి జ్యువెలర్స్ వంటి మొత్తం 11 జ్యువెలరీ సంస్థలు ఈ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. బిడ్డింగ్ దాఖలు చేశాయి. ఆయా సంస్థల్లో అన్నింటికంటే తక్కువ ధరను కోట్ చేశాయి.. జాయ్ అలుక్కాస్, కల్యాణ్ జ్యువెలర్స్.ఆనందం పట్టలేక.. నిండు సభలో విజయ్ పై పాట పాడిన మహిళా ఎమ్మెల్యే: సిగ్గుతో మెలికలు తిరిగిన సీఎందీంతో వీటిని ప్రభుత్వం ఎంపిక చేసింది. 70:30 నిష్పత్తిలో బంగారు ఉంగరాల తయారీ, సరఫరా బాధ్యతలను అప్పగిస్తూ పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. జాయ్ ఆలుక్కాస్ అతి తక్కువ బిడ్డింగ్ నమోదు చేసింది. ఒకే ఒక్క పైసా సర్వీస్ ఛార్జీని మాత్రమే కోట్ చేస్తూ ఈ టెండర్‌ను దక్కించుకుంది. బంగారం ధర తప్ప.. ఉంగరం మేకింగ్ ఛార్జీలు, రవాణా, ఇన్సూరెన్స్, హాల్ మార్కింగ్, సర్వీస్ ఛార్జీలు.. అన్నింటికీ కలిపి ఒకే ఒక్క పైసా కోట్ చేసి టెండర్ దక్కించుకుంది జాయ్ అలుక్కాస్.సీఎం విజయ్ బిగ్

దిగ్గజ నటి షావుకారు జానకి (Sowcar Janaki) మృతి పట్ల యావత్ సినీ పరిశ్రమ విచారంలో మునిగిపోయింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు. షావుకారు జానకి పార్థివదేహాన్ని తమిళనాడు, తేనాంపేటలో ఉన్న ఆమె స్వగృహంలో శనివారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం వుంచి, సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నామని షావుకారు జానకి మనవరాలు, నటి వైష్ణవి భర్త అరవింద్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. చెరగని ముద్ర: సీఎం విజయ్ తనదైన ప్రత్యేక నటనతో తరతరాలుగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి షావుకారు జానకి మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురయ్యానని ముఖ్యమంత్రి విజయ్ తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘సినీ పరిశ్రమలో 70 యేళ్ళకుపైగా లెక్కలేనన్ని పాత్రలకు జీవం పోసిన ఆమె కళాత్మక ప్రస్థానం కూడా ప్రశంసనీయం. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ వంటి భాషా చిత్రాల్లో నటించి పద్మశ్రీ, కలైమామణి, నంది పురస్కారాలతోపాటు అనేకఅవార్డులు అందుకున్న షావుకారు జానకి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. జానకి మరణంతో దుఃఖసాగరంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, చిత్రపరిశ్రమకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు భగవంతుని పాదాల చెంత శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’’ అని సీఎం విజయ్ విడుదల చేసిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఒక శకం ముగిసింది: టీఎఫ్ఏపీఏ షావుకారు జానకి మృతిపట్ల తమిళ చిత్ర యాక్టివ్ నిర్మాతల సంఘం (టీఎఫ్ఏపీఏ) కార్యవర్గం, సభ్యులు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. భారతీయ చిత్రపరిశ్రమలోని గొప్ప, అత్యంత గౌరవనీయ నటీమణుల్లో ఒకరైన షావుకారు జానకి మృతి తీవ్ర విచారాన్ని కలిగించింది. ఏడు దశాబ్దాలకు పైగా తన అపారమైన నటనతో తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం చిత్రపరిశ్రమలను సుసంపన్నం