translateexpand_more

Cm Vijay News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 06:48 am
విజయ్ సీఎం అయిన వేళ.. ధనుష్ పొలిటికల్ ఎంట్రీ పై తండ్రి వ్యాఖ్యలు వైరల్

Dhanush : గత కొన్నాళ్లుగా సినీ సెలబ్రిటీలు రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే. నార్త్ లో అనేకమంది సినీ సెలబ్రిటీలు పలు పార్టీల్లో ఉండి ఎన్నికల్లో గెలిచారు. సౌత్ లో కూడా చాలా మంది నటీనటులు రాజకీయాల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లారు. ఇటీవలే తమిళ్ స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టి తమిళనాడు సీఎం అయ్యారు. అనేకమంది సినీ నటీనటులు రాజకీయాల్లోకి వస్తూనే ఉన్నారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయాల్లోకి వస్తారనే వార్త వైరల్ అవుతుంది. దీనిపై ధనుష్ తండ్రే కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. Also Read – Peddi Collections : ఇలా అయితే కష్టమే.. పెద్ది కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్.. నిరాశ వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో పాల్గొనగా ధనుష్ పొలిటికల్ ఎంట్రీ పై ప్రశ్నలు ఎదురవడంతో ఆయన స్పందిస్తూ.. ఆసక్తి ఉంటే ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్లే హక్కు ఉంది. భవిష్యత్తులో నా కొడుకు ధనుష్, నా మనవళ్ళు కూడా రాజకీయాల్లోకి వెళ్లొచ్చు అని అన్నారు. దీంతో ధనుష్ రాజకీయాల్లోకి వస్తాడు అనే వార్తలకు మరింత బలం చేకూరింది. మరి విజయ్ లాగే కొత్త పార్టీ పెడతాడా లేదా ధనుష్ వేరే ఏదైనా పార్టీలో చేరుతారా చూడాలి. దీనిపై ధనుష్ నుంచి అయితే ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ధనుష్ మాత్రం పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడు లేకపోయినా సేవా కార్యక్రమాలు మాత్రం నిర్వహిస్తున్నారు.

Chitrajyothy02 Jun, 01:42 am
అర గంట కూడా ఆగలేకపోతున్నారు.. సీఎం కోటు, సూటు వేసుకోవడం తప్పా

<p>ముఖ్యమంత్రిగా తాను కోటు, సూటు ధరించడాన్ని ప్రత్యర్థులు విమర్శించడం విడ్డూరంగా ఉందని టీవీకే అధినేత విజయ్ (TVK Vijay) అన్నారు. తన మనస్సులాగే తన డ్రెస్సు కూడా బ్లాక్ అండ్ వైట్ అని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపించిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఏర్పాటైన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. </p><p>సమావేశం కోసం భారీ సభావేదిక ఏర్పాటు చేసినా, ఆయన వ్యాన్ పైనుంచే అభిమానులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పెరియార్, అన్నాదురై. ఎంజీఆర్ బాటలోనే తాను పయనిస్తున్నానన్నారు. 1977లో ఎంజీఆర్ సాధించినదానికంటే అత్యధిక ఓట్ల శాతాన్ని సాధించిన ఘనత టీవీకేకు దక్కిందన్నారు. అంతమాత్రాన తనను ఎంజీఆర్తో పోల్చుకోవాలని అనుకోవడం లేదని తెలిపారు. </p><p>డీఎంకే ఓ దుష్టశక్తి అని దుయ్యబట్టారు. "కొత్త ప్రభుత్వానికి 6నెలల గడువిస్తామన్నారు. కానీ అధికారం చేతిలో లేకపోవడంతో అరగంట కూడా ఆగలేకపోతు న్నారు." అని నిప్పులు చెరిగారు. తిరుచ్చిలో ప్రజలకు నచ్చిన వ్యక్తినే పోటీకి దింపుతానని విజయ్ పేర్కొన్నారు.</p><div id="articlebodyAdsDiv"></div><iframe width="100%" height="415" src=" https://www.youtube.com/embed/JqFJm_E9SfY" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen loading="lazy"></iframe>