translateexpand_more

Cricket News Telugu Translation News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu01 Jun, 01:25 pm
పాపం యశస్వి జైస్వాల్.. ఎంత పని చేశావ్ వైభవ్ సూర్యవంశీ

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించింది. ముల్లాన్‌పూర్‌లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌తో రాజస్థాన్ ప్రయాణం ముగిసినప్పటికీ, ఆ జట్టు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌ను అద్భుతమైన రికార్డులతో ముగించాడు. 15 ఏళ్ల ఈ వండర్‌కిడ్ 16 మ్యాచ్‌ల్లో 48.50 సగటుతో, 237.31 భారీ స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించాడు. తన భయం తెలియని, వీరోచిత బ్యాటింగ్ శైలితో ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ క్రికెట్ అభిమానులను మైమరపించాడు. యశస్వి జైస్వాల్ ఫామ్‌పై ఆకాశ్ చోప్రా ఆందోళన ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు అందరి దృష్టి సూర్యవంశీ పైనే ఉంది. అదే సమయంలో, అతనితో పాటు ఓపెనర్‌గా వచ్చిన యశస్వి జైస్వాల్ ఫామ్ ఈ సీజన్‌లో కాస్త పడిపోయింది. జైస్వాల్ 16 మ్యాచ్‌ల్లో 30.50 సగటు, 152.50 స్ట్రైక్ రేట్‌తో 427 పరుగులు చేశాడు. చాలా మ్యాచ్‌ల్లో జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే బౌలర్లపై దాడి చేయడానికి ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. దీనిపై మాజీ భారత క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందిస్తూ.. జైస్వాల్, సూర్యవంశీ పక్కన బ్యాటింగ్ చేయడం వల్ల ఒత్తిడికి గురవుతున్నాడని అభిప్రాయపడ్డాడు. "నాకు యశస్వి జైస్వాల్ గురించి కాస్త ఆందోళనగా ఉంది. మీరు ఒక సునామీ పక్కన నిలబడితే, మీరు ఎంత గొప్పవారైనా సరే, కేవలం కొన్ని చిన్న కెరటాల లాగే కనిపిస్తారు. అవతలి వైపు జరుగుతున్న ఆ అసాధారణ బ్యాటింగ్‌ను అందుకోవడం ఎవరికైనా అసాధ్యం, కానీ జైస్వాల్ కూడా అతనిలాగే ఆడాలని ప్రయత్నిస్తున్నాడు. వైభవ్ ఆడుతున్న తీరు చూసి యశస్వి ఒత్తిడి

NTV Telugu27 May, 10:30 am
క్రిస్ గేల్ ఆల్ టైమ్ ఐపీఎల్ రికార్డుకు ఎసరు.. గురి తప్పదంటున్న వైభవ్ సూర్యవంశీ

టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ నెలకొల్పిన ఒక అద్భుతమైన ఐపీఎల్ రికార్డు ఇప్పుడు ప్రమాదంలో పడింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన 15 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం అడుగు దూరంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఈ యువ ఓపెనర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎలాగైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్న సూర్యవంశీ.. జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇవ్వడమే కాకుండా, గేల్ పేరిట ఉన్న మోస్ట్ సిక్సర్ల రికార్డును దాటాలని చూస్తున్నాడు. ప్రమాదంలో క్రిస్ గేల్ ‘సిక్సర్ల’ రికార్డు 2012 ఐపీఎల్ ఎడిషన్‌లో క్రిస్ గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడుతూ ఒకే సీజన్‌లో ఏకంగా 59 సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఒకే ఐపీఎల్ సీజన్‌లో లేదా ఒకే టీ20 టోర్నమెంట్‌లో నమోదైన అత్యధిక సిక్సర్ల రికార్డు ఇదే. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో 53 సిక్సర్లతో గేల్ రికార్డుకు అత్యంత సమీపంలో ఉన్నాడు. క్రిస్ గేల్ రికార్డును అధిగమించాలంటే సూర్యవంశీకి ఇంకా 7 సిక్సర్లు కావాలి. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ నాకౌట్ కావడంతో.. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే సూర్యవంశీకి గేల్ రికార్డును బద్దలు కొట్టేందుకు ఇదే చివరి అవకాశం అవుతుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ ఓడిపోవడంతో, పాట్ కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టుపై గెలవడం రాజస్థాన్‌కు చావో రేవో లాంటిదే.