
Crime News | ఢిల్లీలో మరో దారుణం.. పోలీసులమని బెదిరించి 17 ఏళ్ల బాలికపై ముగ్గురి అఘాయిత్యం..!
Crime News | ఢిల్లీలో మరో దారుణం.. పోలీసులమని బెదిరించి 17 ఏళ్ల బాలికపై ముగ్గురి అఘాయిత్యం..!
© 2026 telugu.digital

Crime News | ఢిల్లీలో మరో దారుణం.. పోలీసులమని బెదిరించి 17 ఏళ్ల బాలికపై ముగ్గురి అఘాయిత్యం..!

విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో వారు మరికొంత కాలం జైలులోనే గడపాల్సి ఉంటుంది.ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఐ నాగరాజు (ఏ1), హెడ్ కానిస్టేబుల్ జంగం నాని (ఏ3), హెడ్ కానిస్టేబుల్ బాబురావు (ఏ5), సాంబయ్య (ఏ6) తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయవాడలోని 8వ ఏడీజే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చుతూ వారి పిటిషన్లను కొట్టివేసింది.ప్రస్తుతం ఈ నలుగురు రిమాండ్ ఖైదీలుగా వేర్వేరు జైళ్లలో ఉన్నారు. సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా, జంగం నాని ఏలూరు సబ్ జైలులో, బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, సాంబయ్య గన్నవరం సబ్ జైలులో ఉన్నారు. తాజా తీర్పు నేపథ్యంలో వారంతా జైలుకే పరిమితం కానున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ ఎలా సాగుతుందనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

లేని భూమిని కాగితాల్లో సృష్టించిన రియల్ ముఠా డబ్బుతో అధికారులను ఏమార్చి.. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి.. వాటిని బ్యాంకుల్లో తనాఖా పెట్టి ఏకంగా రూ. 4.11 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. బుధవారం సబ్ రిజిస్ట్రార్‌ను సైతం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లేని భూమితో బ్యాంకు రుణాలు రూ.4.11 కోట్లు కొట్టేసి రియల్ వ్యాపారం హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): లేని భూమిని కాగితాల్లో సృష్టించిన రియల్ ముఠా డబ్బుతో అధికారులను ఏమార్చి.. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి.. వాటిని బ్యాంకుల్లో తనాఖా పెట్టి ఏకంగా రూ. 4.11 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. బుధవారం సబ్ రిజిస్ట్రార్‌ను సైతం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిర్యాదు అందినా పట్టించుకోకుండా నిందితులకు సహకరించిన పోలీసులపైనా చర్యలు చేపట్టారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర సీఐ అంజనేయులతో కలిసి మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ వివరాలు వెల్లడించారు... ప్రస్తుతం చంపాపేట ఎస్ఆర్వోగా ఉన్న మహ్మద్ యూసఫ్ రహమాన్ గతంలో కీసరలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఆ సమయంలో కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆయన్ను సంప్రదించారు. కేవలం కాగితాల్లోనే భూమిని సృష్టించి, వాటిని నిజమైన వ్యక్తులకు సంబంఽధించిన భూమి పత్రాలుగా రిజిస్ట్రేషన్ చేయించారు. అందుకుగాను సబ్ రిజిస్ట్రార్‌కు రూ. 5లక్షలు ముట్టజెప్పారు. తాను మంచివాడినని నిరూపించుకోవడానికి జరిగిన మోసంపై గతేడాది డిసెంబర్లో కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కేవలం కంప్లైంట్ రావడమే తప్ప.. ఈఎంఐల విషయంలో గానీ, ఆర్థిక లావాదేవీల గురించి గానీ, బ్యాంకు అధికారుల నుంచి కూడా సమస్యలు లేకపోవడంతో.. అప్పట్లో కొంతమంది పోలీసులు ఈ ముఠాకు సహకరించారు. కాగా ఇటీవల కీసర పోలీస్ స్టేషన్లో కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ఇటీవల బాధ్యతలు

అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి... బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ మృతి న్యూయార్క్, సెప్టెంబరు 2: అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి (32) మృతి చెందారు. ఓ 49 ఏళ్ల మహిళ తనతో పాటు బ్యాగులో తెచ్చుకున్న రెండు కత్తులతో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద సోమవారం వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. అక్కడ ఉన్న ఇద్దరిపై ఆమె విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఎరిన్ పియాసెంటి అక్కడికక్కడే మృతిచెందగా.. 68 ఏళ్ల మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితురాలు పోలీసులపైకీ దూసుకెళ్లడంతో వారు ఘటనా స్థలంలోనే ఆమెను కాల్చి చంపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

ఆళ్లగడ్డ పట్టణం: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేయించింది. ఈ సంఘటన ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఆళ్లగడ్డకు చెందిన ఆంజనేయులు(32) పట్టణ శివారులోని సమీప పొలాల్లో మంగళవారం ఉదయం మృతిచెంది కనిపించాడు. సీఐ నాగరాజారావు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. తలపై ఎవరో బండరాయితో మోది అతడిని హత్య చేసినట్లు గుర్తించారు. భార్య సుబ్బులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. భార్యపై అనుమానం రావడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. చాగలమర్రి మండలం తోడేళ్లపల్లె గ్రామానికి చెందిన గురు ప్రసాద్‌తో సుబ్బులుకు వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో వారి బంధానికి ఆంజనేయులు అడ్డువస్తుండడంతో సుబ్బులు భర్త హత్యకు వ్యూహరచన చేసింది. సోమవారం రాత్రి తన ప్రియుడితో భర్తకు ఫోన్ చేయించింది. గురు ప్రసాద్ తనవెంట ప్రొద్దుటూరుకు చెందిన షరీఫ్‌ను వెంట తీసుకువెళ్లాడు. ముగ్గురు కలిసి పట్టణ శివారులో మద్యం సేవించారు. అనంతరం మత్తులో ఉన్న ఆంజనేయులు తలపై గురు ప్రసాద్ మద్యం సీసాతో కొట్టి, బండరాయితో మోదాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. మద్యం సీసా మూతపై ఉన్న క్యూఆర్ కోడ్ సాయంతో పోలీసులు దానిని ఎవరు ఏ షాప్‌లో కొనుగోలు చేశారనేది సీసీ కెమెరాల ద్వారా గుర్తించి నిందితులను బుధవారం అరెస్టు చేశారు. ముగ్గురిని న్యాయస్థానంలో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు

జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తుక్కుగూడ నర్సుకేసును సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. హైదరాబాద్, సెప్టెంబర్02: ఇటీవలే తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ నర్సు హత్య కేసును సుమోటాగా స్వీకరించింది. ఈ ఘటనపై ఏడు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని తెలంగాణ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యకు గల కారణాల గురించి సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని జాతీయ మహిళా కమిషనర్ లేఖలో పేర్కొన్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని, త్వరితగతిన కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ఆమె సూచించారు. నిందితుడి పూర్వ నేరచరిత్రపై ఆరా తీయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు నిందితుడిపై తక్షణమే కఠినచర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట: మంత్రి అజహరుద్దీన్

Sircilla: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి - ఎస్పీ మహేష్ గితే ఈ వార్తకు సంబంధించిన

నవీపేట: నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్పూర్ గ్రామానికి చెందిన రమావత్ సాయికిరణ్ (25) గోదావరి నదిలో పడి చనిపోయాడు. యూకేలో ఎంబీఏ చేస్తున్న అతడు ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 5న తిరిగి యూకే వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో మంగళవారం బాసర ఆలయానికి సాయికిరణ్ వెళ్లాడు. దర్శనం అనంతరం బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. విషయం తెలుసుకుని కుటుంబసభ్యులు గాలింపు చేపట్టగా బుధవారం అతడి మృతదేహం లభ్యమైంది. తండ్రి రమావత్ భోజారామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

హైదరాబాద్ నగర పరిధిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల దందాపై సైబరాబాద్ పోలీసులు దాడులు చేశారు. అర్హత లేకపోయినా వైద్యుల అవతారమెత్తి క్లినిక్‌లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను అరెస్ట్ చేశారు. హైదరాబాద్, సెప్టెంబర్ 1: నగరంలో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల దందాపై సైబరాబాద్ పోలీసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అర్హత లేకపోయినా వైద్యుల అవతారమెత్తి క్లినిక్‌లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెరుపు దాడుల వివరాలను కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటి రెడ్డి వెల్లడించారు. ఏకకాలంలో దాడులు.. 10 ఫేక్ క్లినిక్‌ల సీజ్ మేడ్చల్ - మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో నకిలీ క్లినిక్‌ల దందా విచ్చలవిడిగా సాగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్, జగద్గిరిగుట్ట, సూరారం, పటాన్ చెరు, ఆర్సీ పురం తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 నకిలీ క్లినిక్‌లను సీజ్ చేశారు. టెన్త్, బీకామ్ చదివి.. సెలైన్లు ఎక్కిస్తూ! టెన్త్, ఇంటర్, బీకామ్ వంటి చదువులు మాత్రమే చదివిన ఈ కేటుగాళ్లు, ఎలాంటి కనీస మెడికల్ నాలెడ్జ్ లేదా గుర్తింపు పొందిన డిగ్రీలు లేకుండానే క్లినిక్‌లు తెరిచి ప్రాక్టీస్ చేస్తున్నారని విచారణలో తేలింది. చిన్నపిల్లలకు వైద్యం: ఎలాంటి అర్హత లేకున్నా క్లినిక్‌లలో ఏకంగా బెడ్లు ఏర్పాటు చేసి, అమాయక రోగులకు, చిన్నపిల్లలకు వైద్యం అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సిరంజీలు, సెలైన్ల వాడకం: తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో వచ్చే పేషెంట్లకు ఎడాపెడా సెలైన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ (IV Fluids) ఎక్కిస్తూ ప్రాణాలపైకి తెస్తున్నారని పోలీసులు తెలిపారు. సామగ్రి సీజ్: దాడుల సమయంలో ఈ క్లినిక్‌ల నుంచి పెద్ద ఎత్తున బీపీ మిషన్లు, స్టెతస్కోప్‌లు

కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. చిగురుమామిడి మండలం సుందరగిరి శివారులో ఉన్న వ్యవసాయ బావిని ఢీకొట్టి బస్సు ఆగిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు హుస్నాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వార్త చదివారా: బండను చీల్చిన గుండెరా!

న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ కూడలిలో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన మహిళను బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటిగా అధికారులు గుర్తించారు. ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ కూడలిలో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన మహిళను బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటిగా అధికారులు గుర్తించారు. మంగళవారం ఈ దాడి జరిగిన విషయం తెలిసిందే. క్వీన్స్‌కు చెందిన ఓ 49 ఏళ్ల మహిళ టైమ్స్ స్క్వేర్ వద్దకు రెండు కత్తులతో వచ్చి అక్కడున్న ఎరిన్‌తో పాటు మరో వ్యక్తిని కత్తితో పొడిచింది. ఈ ఘటనలో ఎరిన్ కన్నుమూశారు. తీవ్రగాయాలపాలైన మరో వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నతస్థానంలో ఉన్న ఎరిన్ ఇటీవల ఓ బిడ్డకు తల్లయ్యారు. ఇంతలో అనూహ్యంగా ఆమె మరణించడంతో ఆ కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. ఎరిన్ మృతిపై బ్యాంక్ ఆఫ్ అమెరికా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా యూఎస్‌లో రెండో అతిపెద్ద బ్యాంకు అన్న విషయం తెలిసిందే. కత్తులతో దాడికి పాల్పడ్డ మహిళ కూడా పోలీసు కాల్పుల్లో కన్నుమూసింది. ఆమెను పామెలా సిస్నెరోస్‌గా (49) పోలీసులు గుర్తించారు. పామెలాకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఆమెకు మానసిక ఆరోగ్యం సరిగా లేదని పోలీసులు తెలిపారు. గతంలో ఓసారి ఆమెపై ఫిర్యాదు వచ్చినా కేసులు మాత్రం నమోదు కాలేదని చెప్పారు. పామెలా దశాబ్దాలుగా మానసిక సమస్యలతో బాధపడుతోందని ఆమె సోదరుడు చెప్పాడు. అయితే, ఇప్పటివరకూ ఏనాడు ఆమె హింసాత్మక ధోరణి కనబరచలేదని అన్నాడు. నాటో సదస్సు సందర్భంగా ట్రంప్ విమానం మార్పుపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. నేపాల్‌ను వణికిస్తున్న వర్షాలు.. ప్రమాదకర స్థాయిలో నదుల ప్రవాహం

ఐదు కోట్ల వ్యూస్.. ఆ యువ గాయకుడి ప్రాణాలనే బలి తీసుకుంది! యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ఒకే ఒక్క పాట హరియాణాకు చెందిన సింగర్ అంకిత్ బాల్యన్ పాలిట శాపంగా మారింది. పాట సక్సెస్‌ను చూసి ఆనందించాల్సిన వేళ, అదే అతడిని కడతేర్చేందుకు కారణమవుతుందని అంకిత్ ఊహించి ఉండడు. గ్యాంగ్స్టర్ల కక్ష సాధింపునకు బలైన ఈ ఉత్కంఠభరిత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే. ఆగస్టు 26న జిమ్ నుంచి బయటకు వస్తున్న 28 ఏళ్ల అంకిత్‌ను దారుణంగా కాల్చి చంపారు. బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాల ప్రకారం ఏకంగా 16 రౌండ్లు కాల్పులు జరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ‘భరీ కోర్ట్ మే గోలీ మారేంగే’ అనే పాటలో అంకిత్ నటించాడు. అది యూట్యూబ్‌లో 54 మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్లింది. అయితే ఈ పాటలోని సాహిత్యం ..2021లో రోహిణి కోర్టులో హత్యకు గురైన తమ గ్యాంగ్ లీడర్ జితేందర్ గోగిని అవమానించేలా ఉందని గోగి గ్యాంగ్ భావించింది. అంతేకాదు, ప్రత్యర్థి గ్యాంగ్‌కు అంకిత్ మద్దతు ఇస్తున్నాడన్న కక్షతోనే గోగి గ్యాంగ్ , అంకిత్‌ను దారుణంగా కాల్చి చంపింది. ఈ హత్య తర్వాత పోలీసులు వేగంగా స్పందించారు. గత నెల 31న దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయగా, ఎదురుకాల్పుల్లో మోహిత్, సుమిత్ అనే నిందితులు హతమయ్యారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, లేదంటే సీఎం ఇంటి ముందు ఆత్మాహుతి చేసుకుంటామని అంకిత్ భార్య హెచ్చరించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇద్దరు నిందితుల ఎన్‌కౌంటర్‌తో ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లో.. హోమ్ లోను ఉంటే ఎవరు కట్టాలి? H1N1 virus: విజృంభిస్తున్న H1N1 వైరస్…ఫ్లూ వ్యాక్సిన్‌కు భారీగా పెరిగిన డిమాండ్ Konaseema: కోనసీమ జిల్లాలో అద్భుతం…150 ఏళ్ల నాటి

నగరంలోని చందానగర్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఆర్సీ పురం ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఈ ఇంజెక్షన్లతో ఇద్దరు వ్యక్తులు దొరికారు. హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఆర్సీ పురం ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చందానగర్ పీజేఆర్ స్టేడియం వద్ద చేపట్టిన తనిఖీల్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్లతో ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. వారి నుంచి రూ. లక్ష విలువ చేసే ఈ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని, నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా స్టెరాయిడ్లు విక్రయిస్తున్న వీరిని సరసాయి రామ్, కుంచాల రవీంద్రలగా గుర్తించారు. నిందితుల దగ్గర మెఫెంటెరమైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు (Wofen 10ml) ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య లావాదేవీలు అన్నీ ఆన్లైన్ పేమెంట్స్ ద్వారానే జరిగినట్లు వెల్లడించారు. అయితే ఈ విక్రయాల్లో వినియోగదారులుగా ఉన్న దీపక్, సాయి ప్రసాద్, షకీల్, కిషోర్, నితీష్ అనే మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది

మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున మళ్లీ హింస చెలరేగింది. ఆయుధాలతో వచ్చిన దుండగులు మూడు లియాంగ్మై నాగ గ్రామాలపై దాడి చేయడంతో కనీసం 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఓ గ్రామస్థుడికి బుల్లెట్ గాయం అయినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో టాపోన్ ఖుల్లెన్, టాపోన్ ఖునౌ, మకుయి పిపురామ్ గ్రామాల్లో దాడి జరిగింది. దుండగులు కాల్పులు జరిపి ఇళ్లు, ఇతర ఆస్తులకు నిప్పుపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకునేలోపే భారీగా ఆస్తి నష్టం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం, దాని కోబ్రా విభాగంతో పాటు మణిపూర్ పోలీసు సిబ్బందిని అదనంగా మోహరించారు. అనంతరం గ్రామాల చుట్టుపక్కల భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇరువైపుల నుంచి కాల్పులు పలు గంటల పాటు కొనసాగి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆగినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన భద్రతా సిబ్బందికి ఇళ్లు, వాహనాలు, ఇతర వస్తువులు భారీగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అయితే మొత్తం నష్టం ఎంత, ఎన్ని ఆస్తులు ప్రభావితమయ్యాయనే దానిపై అంచనా ఇంకా కొనసాగుతోంది. ఈ ఘటనకు ఒక రోజు ముందు, కాంగ్పోక్పి జిల్లాలోని టెయిఖాంగ్ కుకీ గ్రామంపై దాడి జరిగింది. అందులో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు పౌరులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. వరుస దాడులతో ఇంఫాల్ తమెంగ్లాంగ్ రహదారి పరిసరాల్లో ప్రతీకార దాడులపై ఆందోళనలు పెరిగాయి. కుకీ జో, నాగ వర్గాల మధ్య గతంలోనూ వరుస దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకున్నాయి. మే 13 నుంచి ఈ రెండు వర్గాలకు చెందిన 17 మంది వేర్వేరు ఘటనల్లో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 27న జరిగిన దాడిలో నలుగురు నాగ పౌరులు, ఆగస్టు 31న కాంగ్పోక్పి-తమెంగ్లాంగ్ పరిసరాల్లో జరిగిన దాడిలో ముగ్గురు కుకీ పౌరులు మృతి చెందినట్లు సమాచారం. తాజా

చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణం 21వ వార్డు చెర్లోపల్లి ప్రాంతంలో అక్రమంగా కొనసాగుతున్న క్వారీలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న బ్లాస్టింగ్ల కారణంగా రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తరతరాలుగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతుల పంట పొలాలకు సమీపంలో ఇష్టారాజ్యంగా క్వారీలు నిర్వహిస్తూ పేలుళ్లు జరపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ పేలుళ్ల కారణంగా రాళ్లు ఎగిరిపడి భూములు కంపిస్తున్నాయని, ఇళ్లు, బోర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుందా అని నిలదీశారు. కేంద్రానికి రోజా రిక్వెస్ట్.. హైవే సమస్యపై అలుపెరుగని పోరాటం!చెర్లోపల్లి రైతులు తమ ఆవేదనను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని రోజా ఆరోపించారు. పోలీసు శాఖతో పాటు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా, ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ కాలయాపన చేయడం సరికాదన్నారు. క్వారీలకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా? పర్యావరణ, గనుల, రెవెన్యూ, పోలీసు శాఖల నిబంధనలు పాటిస్తున్నారా? అనే దానిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. క్వారీ యాజమాన్యాలకు రాజకీయ అండదండలు ఉన్నాయని, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌పై వస్తున్న క్వారీ వసూళ్ల ఆరోపణలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఆ పని చేయకుంటే కూటమి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమన్న రోజా ప్రమాదం జరిగే వరకు ఎదురుచూడొద్దు!ఒక ప్రాణం పోయిన తర్వాతో, రైతు భూమి నాశనమైన తర్వాతో పరిహారం ఇచ్చినా పోయిన జీవనాధారం తిరిగి రాదని రోజా స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగే వరకు ప్రభుత్వం నిద్రపోకుండా ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. చెర్లోపల్లి ప్రాంతంలోని అక్రమ క్వారీలను వెంటనే నిలిపివేసి, అనుమతులు లేకుండా జరుగుతున్న బ్లాస్టింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు

Suryapet: సూర్యాపేటలో 'సైబర్ వారియర్స్' కు ప్రత్యేక శిక్షణ & సమీక్ష! ఈ వార్తకు సంబంధించిన
మణుగూరు గ్యాంగ్‌వార్ హత్య కేసు ఛేదింపు.. 27 మంది నిందితులు అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మణుగూరు నేతాజీ గ్రౌండ్లో ఈ నెల 27న జరిగిన శివ హత్య కేసులో మొత్తం 27 మందిని నిందితులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రాఖీ పండుగ కోసం ఇంటికి వచ్చిన శివను, ఎం.కే గ్యాంగ్ సభ్యులు మాట్లాడాలని చెప్పి నేతాజీ గ్రౌండ్‌కు పిలిచారు. అక్కడ ఇరువర్గాల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. గ్రూప్‌లోని సభ్యులు విచక్షణారహితంగా దాడి చేయడంతో శివ ప్రాణాలు కోల్పోయాడు. నిందితులంతా మణుగూరు స్థానికులేనని, కేవలం పార్టీల పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. అయితే, నిందితులు గంజాయి వంటి మాదకద్రవ్యాలు తీసుకుంటున్నట్లు విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదని డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వార్తకు సంబంధించిన

రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. హిట్ అండ్ రన్ కేసులో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, సెప్టెంబర్ 1: రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. హిట్ అండ్ రన్ కేసులో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నడుచుకుంటూ వెళ్తున్న నందులాలను ఇన్నోవా కార్ బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని విద్యార్థి జైద్‌షా కద్రీ ఆస్పత్రికి తీసుకెళ్తుండా మరో ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న విద్యార్థిని మహేంద్ర కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నందులాల అక్కడికక్కడే మృతిచెందగా.. విద్యార్థి జైద్‌షా కద్రీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత కారు యాజమాని వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు.. విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.. మహేంద్ర కార్ యాజమానిని గుర్తించారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్.. కారు నడిపి ఒకరి మృతికి కారణమైనట్లు విచారణలో తేలింది. దీంతో కారును సీజ్ చేసిన పోలీసులు.. సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. చంద్రబాబు చేతుల మీదుగా విడుదల మూడు పోలవరాలు కట్టేంత మొత్తాన్ని పెన్షన్లకు ఖర్చు చేశాం: సీఎం చంద్రబాబు

పల్నాడు: ‘ఒరేయ్ మీ నాన్న నాకు మంచి స్నేహితుడురా... నీకు కూల్‌డ్రింక్ ఇప్పిస్తా..రా’ అంటూ బాలుడికి మాయమాటలు చెప్పి సైకిల్‌తో ఉడాయించిన ఘటన గణపవరం గ్రామంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకునూరి నాగేశ్వరరావు కుమారుడు పవన్‌కుమార్ స్థానిక జెడ్పీహైస్కూలులో ఐదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో స్నేహితులతో ఆడుకునేందుకు సైకిల్‌పై ఇంటి నుంచి బయలుదేరాడు. సినిమాహాల్ రోడ్డులో వెళ్తుండగా ఓ యువకుడి ఎదురై పవన్‌కుమార్‌ను ఆపాడు. మీ నాన్న నాకు తెలుసు.. బజారుకు వెళ్దాం రా అంటూ మాటలు కలిపాడు. పవన్‌కుమార్‌ను సైకిల్‌పై వెనుక కూర్చొబెట్టుకుని మెయిన్‌రోడ్డులోని ఓ బడ్డీ దుకాణం వద్దకు తీసుకెళ్లాడు. పవన్‌కుమార్‌కు కూల్‌డ్రింక్ ఇప్పించి, గ్లాసులు తీసుకొనివస్తా ఇక్కడే ఉండమని చెప్పి సైకిల్ తీసుకొని వెళ్లాడు. ఎంతసేపటికి తిరిగిరాకపోయేసరికి బాలుడు పవన్‌కుమార్ ఇంటికి వెళ్లి విషయాన్ని తండ్రికి వివరించాడు. అగంతక వ్యక్తి కోసం గ్రామంలో వెతికినా ఫలితం లేకపోవటంతో ఓ ఇంటి సీసీ కెమేరాల ఫుటేజీని పరిశీలించారు. బాలుడిని సైకిల్‌పై ఎక్కించుకుని వెళ్తున్న సంఘటన సీసీ కెమెరాలో రికార్డు అవటంతో బాలుడి తండ్రి నాగేశ్వరరావు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు) పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు) యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు) పోలీసుల తీరుపై కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప శ్రీ వాణి పాపం ఆ లీడర్ పరిస్థితి సైలెంట్ గా సైడ్ కు నెట్టేసిన చంద్రబాబు

తెలంగాణ జానపద పాటలు, డాన్స్ షోలతో విపరీతమైన ప్రజాదరణ పొందిన బాసింగ బలాలు ఫేమ్, ప్రముఖ ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి చట్టపరమైన చిక్కుల్లో పడ్డాడు. వెండితెర, బుల్లితెరపై తన స్టెప్పులతో గుర్తింపు తెచ్చుకున్న అతడి అసలు స్వరూపం బయటపడటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని, తీరా సమయం వచ్చేసరికి ముఖం చాటేసి మోసం చేశాడంటూ అతడితో పాటు డాన్స్ చేసే తోటి కళాకారిణి మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించింది.బాధితురాలు మాధురి రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరి మధ్య జానపద పాటల షూటింగ్‌లు, సోషల్ మీడియా రీల్స్ చేసే క్రమంలో పరిచయం ఏర్పడింది. బాసింగ బలాలు పాటతో పాటు మరికొన్ని ప్రాజెక్టులలో ఇద్దరూ కలిసి నటించడంతో ఆ పరిచయం కాస్తా చొరవగా మారింది. ఆ తర్వాత మాధురిపై ప్రేమ పేరిట వల విసిరిన ఈశ్వర్ సాయి, ఆమెను పెళ్లి చేసుకుంటానని బలంగా నమ్మించాడు. అతడి మాటలను నిజమని నమ్మిన మాధురి, అతడితో సహజీవనానికి సైతం అంగీకరించింది.సహజీవనం.. ఆపై బెదిరింపులు!పెళ్లి చేసుకుంటాననే నెపంతో ఈశ్వర్ సాయి ఆమెను పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. అయితే, కొంతకాలంగా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తప్పించు తిరగడం ప్రారంభించాడు. అనుమానం వచ్చి గట్టిగా నిలదీయగా.. పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పడమే కాకుండా, ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, కెరీర్ నాశనం చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మాధురి రాథోడ్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈశ్వర్ సాయిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. అందుకే అర్ధరాత్రి మాధురి రూమ్ కు వెళ్లాను: అసలు నిజం బయటపెట్టిన ఫోక్ యాక్టర్ ఈశ్వర్ సాయిపోలీసుల కేసు నమోదు.. నిందితుడి కోసం గాలింపు!బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై సెక్సువల్ అబ్యూస్, మోసం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణ ముమ్మరం కావడంతో

Anakapalle: నర్సీపట్నంలో విచిత్ర చోరీ: వెండి వస్తువులతో పాటు భోజనం కూడా! Anakapalle: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విచిత్రమైన చోరీ ఘటన వెలుగు చూసింది. స్థానికులు, బాధితుల వివరాల మేరకు.. గ్రంధి వెంకట కృష్ణ దంపతులు ఇంట్లోలేని సమయంలో దొంగ చొరబడ్డారు. 10 తులాల వెండి వస్తువులను అపహరించాడు. వంట గదిలోకి వెళ్లి కుక్కర్లోని అన్నం, పెరుగు తినేశాడు. ఇంటికి వచ్చిన బాధితులు చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు.... మొత్తానికి ఇంటికి కన్నం వేయడమే కాకుండా తాపీ గా భోజనం చేసి వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది

ఎటు చూసినా తుపాకులతో కాపలా కాసే బలగాలు.. రెప్పపాటు కాలం కూడా కన్ను మూయని నిఘా నేత్రాలు.. సాధారణ పౌరుడు అడుగు పెట్టాలన్నా వేల ప్రశ్నలు ఎదురయ్యే అత్యంత కట్టుదిట్టమైన మిలిటరీ జోన్! అలాంటి హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్ స్థావరంలో ఎవరూ ఊహించని దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసింది. శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఆర్మీ అధికారుల స్థావరంలో చొరబడిన కొందరు కళ్లుచేదిరే చోరీకి ఒడిగట్టారు. పకడ్బందీ భద్రత ఉండే ఆయుధాగారంలోకే జొరబడి ఏకంగా 12 ప్రమాదకర తుపాకులను మాయం చేయడం ఇప్పుడు రక్షణ రంగాన్ని షాక్‌కు గురిచేస్తోంది.ఏకే-47లతో సహా ఆయుధాలు గాయబ్!ఈ చోరీ సాదాసీదాగా జరగలేదు. అతికొద్ది మందికి మాత్రమే ప్రవేశం ఉండే వెపన్స్ స్టోర్ రూమ్ తలుపుల తాళాలను అత్యంత చాకచక్యంగా పగలగొట్టారు. క్షణాల వ్యవధిలో 4 అత్యాధునిక ఏకే-47 రైఫిళ్లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ (INSAS) రైఫిల్‌తో పాటు మరో కీలక తుపాకీని ఊడ్చేశారు. వాటితో పాటు వాటిలోకి వాడే బుల్లెట్లను కూడా పట్టుకెళ్లారు. పొద్దున్నే డిపో తెరిచి చూసిన సైనిక సిబ్బందికి ఖాళీగా ఉన్న స్టాండ్లను చూసి దిమ్మతిరిగిపోయింది. ఆర్మీ స్థావరంలోనే ఈ స్థాయిలో ఆయుధాలు మాయమవ్వడం జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది.AK 203: ఆర్మీని శాసించబోతున్న షేర్ గన్, నిమిషానికి 700 రౌండ్ల ఫైరింగ్లోపలి స్కెచ్ లేకపోతే సాధ్యమేనా?ఈ దారుణం వెనుక అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు ప్రతీ ఒక్కరిని వేధిస్తోంది. ఆర్మీ కాంపౌండ్ చుట్టూ ఉండే ఎత్తైన గోడలు, భద్రతా గేట్లు, నిరంతరం తిరిగే పెట్రోలింగ్ టీమ్‌లను దాటుకుని బయటి వ్యక్తులు రావడం దాదాపు అసాధ్యం. అసలు ఆయుధాల గది ఎక్కడ ఉంది? తాళాలు ఎవరి వద్ద ఉంటాయి? సిబ్బంది ఏ సమయంలో మారతారు? అనే పక్కా సమాచారం ఉన్న లోపలి వ్యక్తుల హస్తం లేకుండా ఈ ఆపరేషన్ సాధ్యం కాదని విచారణ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు

ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకుని ఆమెపై దాడి చేసి మెడలోని బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ దాడిలో వృద్ధురాలి నోటికి తీవ్ర గాయాలై పళ్లు ఊడిపోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వేములవాడ అర్బన్ మండలం ఆర్ఆర్ చింతల్‌ఠాణా గ్రామానికి చెందిన మల్లవ్వ ఒంటరిగా జీవిస్తోంది. ప్రతిరోజూ మాదిరిగానే సోమవారం రాత్రి పక్కింట్లోని బంధువుల ఇంట్లో నిద్రించింది. మంగళవారం ఉదయం తన ఇంటికి వచ్చి తాళం తీసి లోపలికి వెళ్లింది. మల్లవ్వ ఇంట్లోకి వెళ్లడాన్ని గమనించిన దుండగుడు ఆమెను వెంబడించి ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం వృద్ధురాలిపై దాడి చేసి మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు తాళిబొట్టును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. దుండగుడి దాడిలో మల్లవ్వ నోటికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దుండగుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. వృద్ధురాలు ఒంటరిగా ఇంట్లోకి వచ్చిన సమయాన్ని దుండగుడు ముందుగానే గమనించాడా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది

Kankipadu: కంకిపాడులో పోలీసుల కాల్పుల కలకలం క్లూస్ టీమ్ విస్తృత తనిఖీలు ఈ వార్తకు సంబంధించిన

కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. విజయవాడ, సెప్టెంబర్ 1: కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న(సోమవారం) రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే పోలీసులపై రాళ్లు రువ్వుతూ, కత్తితో దాడి చేసేందుకు యత్నించడంతో నిందితుడిపై సీఐ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. నిన్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల సమీపంలోని దేవరపల్లిలో పోలీస్ కానిస్టేబుల్‌పై యువకుడు కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. పెట్రోలింగ్ విధుల్లో భాగంగా జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టగా.. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను కానిస్టేబుల్ గమనించాడు. వారి వద్ద ఉన్న బ్యాగులో ఏముందని ప్రశ్నిస్తుండగా.. ఇద్దరు యువకుల్లో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్‌పై దాడి చేశారు.. ఆపై నిందితులు ఇద్దరూ బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలించగా కంకిపాడు వద్ద ఉన్నట్లు తెలుసుకున్న సీఐ, కానిస్టేబుల్ శ్రీనివాస్.. రాత్రి 11 గంటల సమయంలో అక్కడకు వెళ్లారు. నిందితుడు అవినాధ్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. సీఐ, కానిస్టేబుల్‌పై రాళ్లు రువ్వడంతో పాటు కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిలో కత్తితో పొడవంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సీఐ.. అవినాధ్ కాళ్లపై కాల్పులు జరిపారు. ఆపై గాయపడిన యువకుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అవినాధ్.. పెనమలూరు గ్రామ వాసిగా గుర్తించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ శ్రీనివాస్, నిందితుడు అవినాధ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థానిక ఎన్నికలు జరగడం ఖాయం: మంత్రి నారాయణ

నెల్లూరు నగరంలో రౌడీషీటర్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. నెల్లూరు, సెప్టెంబర్ 01: నగరంలోని దారుణ హత్యకు గురైన రౌడీషీటర్ లక్ష్మీశెట్టి సాయితేజ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు స్నేహితుల మధ్య పాత గొడవలు, విభేదాలే కారణమని తేల్చారు. వీరంతా మద్యం సేవించే సమయంలో సాయితేజ తలపై బండరాయితో కొట్టి హత్య చేసినట్లు వారు ఒప్పుకున్నారు. ఈ హత్య కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వివరించారు. ఈ సంఘటన స్థలంలో లభించిన ఆధారాలు, సైబర్ టెక్నాలజీ, సీసీటీవీ ఫూటేజీతోపాటు అనుమానితుల కదలికలపై నిఘాతో నిందితులను వెంటనే పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. కేవలం 24 గంటల్లో ఈ కేసు ఛేదించిన డీఎస్పీలు గిరిధర్, జి. శ్రీనివాసరావు, సీఐ సీతారామయ్యతోపాటు సిబ్బందిని నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల అభినందించారు. శాంతిభద్రతలకి విఘాతం కలిగించినా, నేరాలకి పాల్పడినా ఎవరినీ ఉపేక్షించబోమని జిల్లా ప్రజలను ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. నగరంలోని స్థానిక ఆర్టీవో కార్యాలయం సమీపంలో రౌడీ షీటర్ లక్ష్మీశెట్టి సాయితేజ ఆదివారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న డీఎస్పీలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు

కదులుతున్న బస్సులో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం అఘాయిత్యానికి పాల్పడిన కండక్టర్, డ్రైవర్ తల్లి చీవాట్లతో అలిగి బంధువుల ఇంటికి బయల్దేరిన యూపీకి చెందిన విద్యార్థిని గమ్యస్థానానికి ముందే బస్సు దిగిన బాలిక మాయమాటలు నమ్మి మరో బస్సులోకి.. దాంట్లోనే దారుణం.. నిందితుల అరెస్టు ఆగస్టు 4న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి ఢిల్లీలో నర్సరీ చదివే చిన్నారిపై పాఠశాల బస్సు డ్రైవర్ లైంగికదాడి న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశ రాజధాని ఢిల్లీలో మరో ‘నిర్భయ’ తరహా దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల ఓ బాలికపై ఇద్దరు దుండగులు నడుస్తున్న బస్సులో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆగస్టు 4వ తేదీన జరిగినప్పటికీ.. వివరాలు సోమవారం వెల్లడయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన 11వ తరగతి విద్యార్థిని.. తల్లి తిట్టిందన్న కోపంతో ఇల్లు వదిలి, ఢిల్లీ శివార్లలోని నోయిడా సెక్టార్ 63లో ఉండే తమ బంధువుల ఇంటికి బస్సులో బయల్దేరింది. చీకటి, దానికితోడు వర్షం కురుస్తుండటంతో ఆ బాలిక తాను దిగాల్సిన ప్రాంతాన్ని గుర్తించలేక, రాత్రి 9 గంటల సమయంలో సెక్టార్ 63 చేరుకోకముందే బస్సు నుంచి దిగేసింది. అక్కడి నుంచి వాళ్ల బంధువుల ఇల్లు మరో 25 కి.మీ.ల దూరం ఉండటంతో.. ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది. ఇంతలో ఓ స్లీపర్ బస్సు వచ్చి ఆమె ముందు ఆగింది. దాంట్లో ఉన్న కండక్టర్ తాము నోయిడా సెక్టార్ 63 వైపే వెళ్తున్నామని చెప్పటంతో, ఆ బాలిక బస్సు ఎక్కింది. బస్సులో డ్రైవర్, కండక్టర్ తప్ప ఎవరూ లేరు. బస్సు బయల్దేరిన కొంతసేపటికి, కండక్టర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికదాడి జరిపాడు. ఆ తర్వాత డ్రైవర్ కూడా దారుణానికి పాల్పడ్డాడు. ఇదంతా బస్సు కదులుతుండగానే జరిగింది. స్లీపర్ బస్సు కావటంతో కిటికీలకు ఉన్న తెరల వల్ల.. లోపల జరుగుతున్న అఘాయిత్యం గురించి బయట ఎవరికీ కనిపించలేదు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి, ఓల్డ్

తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ చింతల గోపాలరావును అరెస్ట్ చేసినట్లు తిరువూరు రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తిరువూరు, ఆగస్టు 22: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ చింతల గోపాలరావును అరెస్ట్ చేసినట్లు తిరువూరు రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. శనివారం తిరువూరు సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పుట్రేల సమీపంలో స్కూటిపై వెళ్తున్న నిందితుడు గోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. సీసీ కెమెరాల ఆధారంగా అతడిని అరెస్ట్ చేశామన్నారు. తమ విచారణలో ఈ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారని పేర్కొన్నారు. ఏ కొండూరు, విస్సన్నపేట, తిరువూరు మండలాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని అతడు వరుస చోరీలకు పాల్పడుతున్నాడని వివరించారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ అతడి స్వస్థలమని డీసీపీ చెప్పారు. ఆగస్టు10వ తేదీన ఏ. కొండూరు మండలం చీమలపాడు, విస్సన్నపేట మండలం కలగర, తిరువూరు మండలం మల్లేల గ్రామాల్లో వరుస చోరీలు జరిగాయి. ఆయా ఇళ్ల తాళాలను పగులగొట్టి బంగారు నగలు, వెండి వస్తువులతోపాటు నగదు దొంగలించినట్లు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. దీంతో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారని చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజీతోపాటు ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలపై నిఘా పెట్టామన్నారు. అలా అతడిని శనివారం అరెస్ట్ చేసినట్లు డీసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల దూసుకొచ్చిన కొండచిలువ

Sullurpeta: చెంగాళమ్మ లేఅవుట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం! సూళ్ళూరుపేట: సూళ్ళూరుపేటలోని చెంగాళమ్మ లేఅవుట్ వద్ద లభ్యమైన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని నాయుడుపేట డీఎస్పీ శ్రీ జి. చెంచుబాబు స్వయంగా పరిశీలించారు. ఘటనాస్థలాన్ని సందర్శించిన ఆయన, మృతదేహం లభ్యమైన పరిస్థితులు, పరిసరాలను పరిశీలించి, లభించిన ఆధారాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి దర్యాప్తు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ పర్యవేక్షణలో, ఎస్సై జి. అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతుడు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిగా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా, గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని చెంగాళమ్మ లేఅవుట్ వద్ద పడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి గుర్తింపు మరియు ఆచూకీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసులు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే లేదా అతనికి సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసినట్లయితే, వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా సూళ్ళూరుపేట పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Madhuri Rathod Latest News: ప్రముఖ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ పై దాడితో పాటు ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తనపై దురుసుగా ప్రవర్తించి.. దాడి చేయడమే కాకుండా తన మొబైల్ ఫోన్‌ను చోరీ చేసి అందులో వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ ఆమె వేములవాడ పోలీసులను ఆశ్రయించింది.. ఈ వ్యవహారంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు మరికొందరిపై పోలీస్ కేసు నమోదు చేశారు.. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఈ నెల 19వ తేదీన వేములవాడలోని రెడ్డి భవన్లో ఈ వివాదం చోటు చోటుచేసుకుంది. అక్కడ ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనతో అత్యంత దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించి.. ఆమెపై భౌతికంగా దాడి కూడా చేసిందని మాధురి పేర్కొంది. ఆ సమయంలో సుమారు 50 వేల విలువైన ఐఫోన్ బలవంతంగా లాక్కొని తీసుకొని వెళ్ళిపోయారని ఆరోపించారు.. తన ఫోన్‌ను దొంగలించి తీసుకొని పోయిన తర్వాత.. అందులోని వ్యక్తిగత డేటా తో పాటు వీడియోలను రికార్డు చేసి.. ఉద్దేశ పూర్వకంగా తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేశారని మాధురి ఫిర్యాదులు తెలిపారు. సమాజంలో తనకున్న గౌరవంతో పాటు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ వ్యవహారానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో వివరించారు.. వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలతోపాటు సోషల్ మీడియా ఛానల్లు తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్తలు ప్రసారం

హైదరాబాద్‌లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంపులో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. హైదరాబాద్, ఆగస్టు 22: నగరంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంపులో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. మృతురాలు కమలమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మహిళ హత్య కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న శ్రీకృష్ణ హాట్ చిప్స్ యజమాని ప్రకాష్.. నగదు, బంగారు కమ్మల కోసం కమలమ్మను హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడు. కమలమ్మ జీతం తీసుకుని ఇంటికి వెళ్తుండగా ప్రకాష్ ఆమెను తన షాపులోకి పిలిచినట్లు పోలీసులు గుర్తించారు. కమలమ్మ షాపులోకి వెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే షాపులోకి వెళ్లిన అనంతరం ఆమె బయటకు రాకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సీసీఫుటేజ్‌లో రికార్డైన దృశ్యాలను పరిశీలించడంతో పాటు దర్యాప్తు ముమ్మరం చేసి అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. కమలమ్మ వద్ద ఉన్న రూ.10 వేల నగదు, అర తులం బంగారు కమ్మల కోసమే ఈ హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఐటీ ఉద్యోగి మృతి విద్యార్థులే లక్ష్యంగా గంజాయి చాక్లెట్ల విక్రయం.. నలుగురి అరెస్ట్

Husband Killed Case : వివాహేతర సంబంధాలతో భర్తల ప్రాణాలు తీస్తున్న భార్యల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. ప్రేమవివాహం చేసుకున్న మహిళ.. భర్త షాపులో పనిచేసే మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొద్దిరోజుల తరువాత భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ చేసింది. భర్త మృతిని కారు ప్రమాదంగా చిత్రీకరించింది. కానీ, పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో ఇద్దరు మైనర్లతో కలిసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఉత్తరాఖండ్ లోని రామ్‌నగర్‌కు చెందిన సంజీవ్ కుమార్ (24) టెంట్ హౌస్ వ్యాపారం నిర్వహించేవాడు. ఐదేళ్ల క్రితం సంజీవ్ కుమార్, నిషాలు ప్రేమ వివాహం చేసుకున్నారు. సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యులు ఈ వివాహంకు ఒప్పుకోకపోవడంతో కుటుంబ సభ్యులను ఎదిరించి నిషాను ప్రేమవివాహం చేసుకున్నాడు. అయితే, కొంతకాలం తరువాత భర్త టెంట్ హౌస్‌లో పనిచేసే 17ఏళ్ల బాలుడితో నిషాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన నిషా.. అతన్ని హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. సంజీవ్ కుమార్ ను హత్య చేసేందుకు తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న బాలుడిని పురమాయించింది. దీంతో అతను మరో మైనర్ బాలుడితో కలిసి ఆగస్టు 16న తమలో ఒకరి పుట్టినరోజు వేడుకల పేరుతో నిషా భర్త సంజీవ్‌ను పార్టీకి తీసుకెళ్లేందుకు ఒప్పించారు. కారులో సంజీవ్ డ్రైవింగ్ చేస్తుండగా వెనుక సీట్లో కూర్చున్న మైనర్ బాలుడు తుపాకీతో సంజీవ్ మెడపై కాల్పులు జరిపాడు. దీంతో సంజీవ్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో కారు రోడ్డు పక్కన ఉన్న వరి పొలంలోకి దూసుకెళ్లి ప్రమాదానికి గురైంది. ఇద్దరు మైనర్ బాలురు అక్కడి నుంచి పరారయ్యారు. సంజీవ్ కారు ప్రమాదంలో మరణించినట్లుగా నిషా అందరిని నమ్మించింది. పోలీసు కేసు కావడంతో నిబంధనల ప్రకారం సంజీవ్ కుమార్ కు

భూపాలపల్లి జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. హెచ్ఐవీతో బాధపడుతున్న మహిళను అడవిలో వదిలేశారు. అక్కడ ఒంటరిగా ఉన్న సదరు మహిళను స్థానికులు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. భూపాలపల్లి, ఆగస్టు 22: మానవత్వాన్ని మంటగలుపుతూ కన్నవారే కసాయివారిలా మారారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులే అడవిలో వదిలేశారు. ఈ అమానుష ఘటన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన లలిత (35) హెచ్ఐవీతో బాధపడుతున్నారు. కరీంనగర్ ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్తామని చెప్పి కుటుంబ సభ్యులు ఆమెను మేడారం-కాటారం రహదారిలోని పెద్దవాగు సమీప అడవిలో వదిలేశారు. ఒంటరిగా ఉన్న లలితను అటుగా వెళ్తున్న స్థానికులు గమనించారు. ఆ వెంటనే 108కి సమాచారం అందించడంతో సిబ్బంది మహదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై స్థానిక గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఆదుకోవాల్సిన కుటుంబమే అలా ఒంటరిగా వదిలేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన బాధితురాలి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే

కొండ పైనుంచి కిందపడి కుమారుడు, దంపతుల దుర్మరణం ఈటీవీ భారత్: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఐ ఫోను ఈఎంఐ చెల్లింపు కోసం తల్లిదండ్రులతో గొడవపడిన కునాల్ (19) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడేందుకు స్థానిక ఖవడ్యా డోంగర్ కొండ అంచుకు వెళ్లాడు. కిందికి దిగి రావాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఎంతగా బతిమాలినా వినలేదు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వలలు సిద్ధం చేయగా.. పైన ఉన్న కునాల్ పదే పదే స్థానాలు మారుస్తూ వచ్చాడు. దీంతో కుమారుడిని రక్షించేందుకు తండ్రి మురళీధర్ (48) కూడా కొండపైకి వెళ్లి తీవ్ర ప్రయత్నం చేశారు. దాదాపు మూడు గంటలపాటు ఈ వ్యవహారం నడిచింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరూ కొండపై నుంచి జారిపడి మృతిచెందారు. కళ్ల ముందే భర్త, కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్రంగా కలత చెందిన యువకుడి తల్లి సంగీత అదే కొండపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. అందరూ చూస్తుండగా.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఇలా మృతిచెందడం స్థానికులను కలచివేసింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఒక్క ఫోన్ మోజు, అది తెచ్చిపెట్టిన అప్పుల భారం ఒక పచ్చని కుటుంబాన్ని నిలువునా బలితీసుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా పరిధిలోని దేవలాయ్ ప్రాంతంలో ఒళ్లు గగుర్పొడిచే విషాద సంఘటన వెలుగు చూసింది. ఐఫోన్ ఈఎంఐ కిస్తీ డబ్బుల విషయంలో తండ్రితో గొడవపడి, ఆవేశంలో కొండపైకిక్కిన 18 ఏళ్ల కుర్రాడు.. అతడిని కాపాడుకోవడానికి వెళ్లిన తండ్రి, ఇద్దరినీ కళ్లముందే కోల్పోయి తట్టుకోలేకపోయిన తల్లి.. ముగ్గురూ కొండపై నుంచి కిందపడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం.. 18 ఏళ్ల కునాల్ చందగూడే అనే యువకుడు ఇటీవలే ఖరీదైన ఐఫోన్ కొనుగోలు చేశాడు. అయితే, దానికి సంబంధించి నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ కోసం ఇంట్లో నిత్యం గొడవపడుతున్నాడు. శుక్రవారం ఉదయం కూడా తండ్రి మురళీధర్‌తో ఈఎంఐ డబ్బుల విషయమై తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కునాల్, ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి సమీపంలోని తిస్గావ్ కొండపైకి ఎక్కాడు. కొండ అంచున నిలబడి కిందకి దూకేస్తానని బెదిరించడం ప్రారంభించాడు.మూడు గంటల నరకం.. అమ్మా నాన్నల కోసం బ్రతుకురా!విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, స్థానిక సర్పాంచ్ సంజయ్ జాధవ్, గ్రామస్థులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు కునాల్‌ను కిందకు తీసుకురావడానికి సర్వవిధాలా ప్రయత్నించారు. నానా! నీకు ఏది కావాలంటే అది కొనిస్తాం, నీకు మంచి భవిష్యత్తు ఉంది, మీ అమ్మను చూసైనా కిందకి దిగి రారా అని సర్పాంచ్, పోలీసులు ఎంతో బతిమిలాడారు. నాకు చావే శరణ్యం, వేరే దారి లేదు అంటూ కునాల్ భీష్మించుకూర్చున్నాడు. కొండ కింద నిలబడి కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు కొండపైకి చేరుకుని కొడుకుని బతిమాలే ప్రయత్నం చేశారు.Viral Video: వికెట్ తీసి Gen-Z సెలబ్రేషన్స్.. రాత్రికి రాత్రే స్టార్!క్షణాల వ్యవధిలోనే ముగిసిన మూడు ప్రాణాలు!మధ్యాహ్నం 1 గంట సమయంలో కొండ అంచుకు

దాదాపు మూడు దశాబ్దాల క్రితం కానిస్టేబుల్‌ను హత్య చేసి పరారైన మాజీ నక్సలైట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నంద్యాల, ఆగస్టు21: దాదాపు మూడు దశాబ్దాల క్రితం కానిస్టేబుల్‌ను హత్య చేసి పరారైన మాజీ నక్సలైట్‌ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. 1992లో నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్ల కాలువ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సును అడ్డుకుని హెడ్ కానిస్టేబుల్ షేక్ అబ్దుల్ కరీంను మాజీ నక్సలైట్ మాడుగుల సుబ్బన్న కాల్చి చంపాడు. అనంతరం అతడు పరారైయ్యాడు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఏ1గా మాడుగుల సుబ్బన్న పేరును పోలీసులు చేర్చారు. నాటి నుంచి అతడి కోసం గాలించినా.. ఆచూకీ లభ్యం కాలేదు. అయితే అతడు కర్ణాటకలోని చిత్రదుర్గలో నివాసం ఉంటున్నట్లు పోలీసులకు ఇటీవల రహస్య సమాచారం అందింది. దీంతో ఆత్మకూరు సీఐ సురేశ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఓ బృందం కర్ణాటక వెళ్లింది. చిత్రదుర్గలో మాడుగుల సుబ్బన్న అలియాస్ గుంటూరు గద్దర్ అలియాస్ మంజునాథ్ పాటిల్‌ను వారు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని నంద్యాల జేఎంఎఫ్‌సీ (JMFC) కోర్టులో హజరుపరిచారు. 34 ఏళ్లుగా పరారిలో ఉన్న మాజీ నక్సలైట్ మాడుగుల సుబ్బన్న అరెస్ట్‌తో ఆత్మకూరు మండల కేంద్రంలో కలకలం రేగింది. సీఎం రేవంత్ యూఎస్ పర్యటనకు నో క్లియరెన్స్.. స్పందించిన కేంద్రం ఉయ్యూరులో డయేరియాపై అసత్యాలు ప్రచారం: మంత్రి నారాయణ ఫైర్

బాడీ బిల్డింగ్ పేరిట మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా హైదరాబాద్‌లో పట్టుబడింది. టాస్క్‌ఫోర్స్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురిని అరెస్ట్ చేసి, 50 ఇంజెక్షన్ వాయిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, ఆగస్టు 21: నగరంలో బాడీ బిల్డింగ్ పేరిట మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టైంది. టాస్క్‌ఫోర్స్ గోల్కొండ జోన్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ఇంజెక్షన్ల సప్లయర్లు, మరో ఇద్దరు వినియోగదారులు ఉన్నారు. నిందితుల నుంచి రూ.1.85 లక్షల విలువైన 50 మెఫెంటర్మైన్ సల్ఫేట్ వాయిల్స్‌తో పాటు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో వాయల్‌ను రూ.160కు కొనుగోలు చేసి, దాదాపు రూ.900కు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధాన నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నుంచి వాట్సాప్ ద్వారా ఇంజెక్షన్లను ఆర్డర్ చేసి, షాడోఫ్యాక్స్ కొరియర్ ద్వారా హైదరాబాద్‌కు తెప్పిస్తున్నట్లు గుర్తించారు. జిమ్‌లో పరిచయమైన ఇద్దరు యువకులు.. మొదట కండరాల పెంపు కోసం ఈ ఇంజెక్షన్లను వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వాటి అక్రమ విక్రయాలపై దృష్టి సారించి గోషామహల్ ప్రాంతంలో కస్టమర్లకు విక్రయాలు సాగించినట్లు వెల్లడించారు. ఎంజే బ్రిడ్జి, భోలక్ష్మి మాత ఆలయం సమీపంలో కస్టమర్లకు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ దందా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. బయటకొచ్చిన వీడియో.. నేను వచ్చానని అద్దె విద్యార్థులను తీసుకొచ్చారు: అభిజీత్ సంచలన ఆరోపణలు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Yadadri Bhuvanagiri News: సమాజంలో పేదలకు అండగా ఉండాల్సిన ఓ ప్రజా నాయకుడు కామాంధుడిగా మారిపోయాడు.. ప్రభుత్వ పథకాలను ఆసరాగా చేసుకుని.. ఓ అభాగ్యురాలిపై లైంగిక దాడికి పాల్పడిన అత్యంత అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలో చోటు చేసుకుంది.. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి.. ఆపై బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఓ మహిళపై కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతూ వస్తోంది.. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు (ఎం) మండలం పుల్లాయగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కన్ను ఓ అమాయక మహిళపై పడిందట.. ఆమెకు ప్రభుత్వ పథకం కింద ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చాలా రోజుల నుంచి నమ్మించిన్నట్లు సమాచారం.. ఇల్లు మంజూరైన తర్వాత.. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్ బస్తాలు ఇస్తానని.. ఆశచూపి ఆమెను తన ఇంటికి పిలిపించుకున్నట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారట.. ఈ దారుణం ఒక్క రోజుతో ఆగిపోలేదట.. జరిగిన విషయాన్ని బయటపెడితే.. పరువు పోతుందని బెదిరిస్తూ.. గత రెండు నెలలుగా ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలో భార్య తీవ్ర మానసిక క్షోభకు గురికావడంతో పాటు ఆమె ప్రవర్తనలో మార్పును గమనించిన భర్త అసలు విషయం ఆరా తీశాడట. ఆతను చేస్తున్న అఘాయిత్యాల గురించి.. భార్య కన్నీరుమున్నీరుగా విలపించడంతో బాధితురాలి భర్త ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి

ఎల్కతుర్తి బస్టాండ్ సమీపంలో ఒక కారు రెండు రోజులుగా పార్క్ చేసి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వాహనం నుంచి దుర్వాసన రావడంతో అనుమానం మరింత పెరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారును పరిశీలించిన పోలీసులు డిక్కీ తెరిచి చూడగా అందులో మూటకట్టిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించింది. కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మృతురాలు గోదావరిఖనికి చెందిన మానస (33)గా గుర్తించినట్లు సమాచారం. వాహనం మానసకు పరిచయమైన వినోద్ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. దీంతో అనుమానాలు వినోద్ వైపు మళ్లాయి. మృతదేహం లభ్యమైన విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు వినోద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మానసతో తనకు పరిచయం ఉందని, ఆమెతో కలిసి కరీంనగర్‌లోని ఓ గదిలో ఉన్న సమయంలో మానసకు ఫిట్స్ వచ్చి నోటి నుంచి నురగలు రావడంతో ఆమె మృతి చెందినట్లు వినోద్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. మానస మృతి చెందడంతో భయపడిపోయిన తాను మృతదేహాన్ని అక్కడే ఉంచకుండా కారులో తీసుకెళ్లి ఎల్కతుర్తి వద్ద వదిలి వెళ్లినట్లు వినోద్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వాంగ్మూలం నిజమేనా? ఘటనకు సంబంధించి మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఎల్కతుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మానస మృతి చెందిన పరిస్థితులు, ఆమె చివరిసారిగా ఎవరితో ఉంది, కారు ఎక్కడి నుంచి వచ్చింది, మృతదేహాన్ని ఎల్కతుర్తికి ఎందుకు తీసుకువచ్చారు వంటి అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. వినోద్ చెప్పిన విషయాలను ఇతర ఆధారాలతో సరిపోల్చే పనిలో ఉన్నారు. మృతదేహానికి సంబంధించిన వైద్య, ఫోరెన్సిక్ వివరాలు కూడా దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు పోలీసుల విచారణలోనే తేలాల్సి ఉంది