translateexpand_more

Crude Oil Prices News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu31 May, 11:22 am
మన ఆర్థికవ్యవస్థకు..3 భయంకరమైన సవాళ్లు.. ఏమిటవి

పెరుగుతున్న ముడి చమురు ధరలు, రానున్న’సూపర్ ఎల్ నినో’, అసాధారణ వడగాల్పులు, బలహీనమైన వర్షపాత అంచనాలు, వెరసి ఆహార ద్రవ్యోల్బణం.. ఇవన్నీ కలిసి 2026 ఆర్థిక సంవత్సరంలో భారతీయ గృహాలు, వ్యాపారాలు, దేశ ఆర్థిక వృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ఇలాంటి సమస్యను దేశం విడివిడిగా ఎదుర్కొని ఉండవచ్చు. కానీ, ఈ విపత్తులన్నీ ఒకేసారి ముంచుకొస్తే ఏమవుతుంది? అదే ఇప్పుడు ఆర్థికవేత్తలను కుదిపేస్తున్న ప్రశ్న. భారత ఆర్థిక వ్యవస్థ.. ఇప్పటికీ సరసమైన ధరలకు దొరికే ఇంధనం, స్థిరమైన రుతుపవనాలు, గ్రామీణ డిమాండ్‌పైనే ఎక్కువగా ఆధారపడి నడుస్తోంది. దురదృష్టవశాత్తూ, ఈ మూడూ ఇప్పుడు ఒకేసారి ఒత్తిడికి గురవుతున్నాయి.భారతదేశానికి తగలనున్న మొట్టమొదటి షాక్.. అంతర్జాతీయ చమురు సంక్షోభం. 2026లోకి అడుగుపెడుతూనే మన దేశం ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ సంక్షోభం కావడంతో ఈ సమస్యకు పరిష్కారం కూడా మన చేతుల్లో లేదు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన ‘హోర్ముజ్ జలసంధి’లో ఏర్పడిన అంతరాయాల కారణంగా, ముడి చమురు ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ప్రపంచ చమురు, ఎల్ఎన్‌జీ వాణిజ్యంలో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండానే జరుగుతుంది. పెద్ది స్టోరీ.. చరణ్ చెప్పిన కథలాంటిదేనా? ‘పెద్ది’ సినిమాకు అన్నీ శుభ శకునాలే.. రెచ్చిపోవడమే తరువాయి..

Andhra Jyothy26 May, 02:21 am
Home » National » delhi cng price hiked by rs2 per kg third time in 11 days avn...

Home » National » delhi cng price hiked by rs2 per kg third time in 11 days avn ABN , Publish Date - May 26 , 2026 | 07:51 AM దేశ రాజధాని ప్రాంతంలో నివసించే వాహనదారులకు ఈ ఉదయాన్నే మరో గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయంగా...

10TV Telugu31 May, 07:53 am
గోల్డ్ ఢమాల్..! 70 శాతం తగ్గిన డిమాండ్.. బంగారం కొనాలా? ఆగాలా? అసలు కారణాలివే

Gold Demand Drop : బంగారం కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారానికి పెద్దగా డిమాండ్ లేదు.. భారతీయులకు బంగారం అతిపెద్ద సెంటిమెంట్ అయినా అలాంటి పసిడిని ఇంటికి తెచ్చుకునేందుకు ఆస్తి చూపడం లేదు. వాస్తవానికి, బంగారం అనేది కేవలం ఆభరణం కాదు.. అది పెట్టుబడి, భద్రతగా కూడా భావిస్తారు. అయితే, ప్రస్తుతం గోల్డ్ కొనాలా వద్దా? అనే సందిగ్ధంలో చాలా భారతీయ ఫ్యామిలీలు ఉన్నాయి. దీనికి కారణం ఒకటని చెప్పలేం.. అందులో పెరిగిన బంగారం ధరలు కావొచ్చు.. కొత్త దిగుమతి సుంకాలు, జీవన వ్యయాల భారమంతా ఇప్పుడు బంగారం మార్కెట్‌ను గట్టిగా దెబ్బతీశాయి. బంగారం డిమాండ్‌లో దాదాపు 70శాతం పతనమైంది. దిగుమతి సుంకాన్ని భారీగా పెంచడంతో కొనుగోలుదారుల్లో ఆందోళన మొదలైంది. 70 శాతానికి పడిపోయిన గోల్డ్ డిమాండ్ : కేంద్ర ప్రభుత్వం మే 13 నుంచి గోల్డ్ దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచేసింది. దాంతో దేశంలో గోల్డ్ డిమాండ్ దాదాపు 70 శాతం మేర క్షీణించింది. 2025 ఏడాదిలో ఇదే సమయంలో 25 టన్నులు ఉన్న డిమాండ్ ఈసారి కేవలం 7.5 టన్నులకు పరిమితమైనట్లు ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. పన్నుల భారం.. కొనుగోలుదారుల వెనుకడుగు : దిగుమతి సుంకం పెంచడంతో జీఎస్టీతో కలిపి పసిడిపై మొత్తం పన్ను భారం 9.18 శాతం నుంచి 18.45 శాతానికి పెరిగింది. అలాగే, పెట్రోల్, డీజిల్, ఆహార ధరలు కూడా పెరగడంతో భారతీయ వినియోగదారులు గోల్డ్ వంటి భారీ కొనుగోళ్లను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నారు. అందులోనూ రూపాయి బలహీనపడటం, ముడిచమురు ధరలు పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని దిగుమతి నిబంధనలను కఠినతరం చేసింది.

Samayam Telugu31 May, 06:06 am
ఆ కారణంతో 'డీజిల్' ధరలు తగ్గింపు.. కేంద్రం వద్దకు ప్రతిపాదన.. ఈరోజు లీటర్ ఎంతుందంటే

Diesel Price: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. దీంతో దేశీయంగా డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్లు వస్తున్నాయి. డీజిల్ ధరలను తగ్గించడం ద్వారా దేశీయంగా రవాణా రంగానికి ఉపశమనం కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (AIMTC) విజ్ఞప్తి చేసింది. అధిక ఇంధన ధరలు ఉండడంతో దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని, డీజిల్ ధరలను తగ్గించి ఉపశమనం కల్పించాలని ఏఐఎంటీసీ జాతీయ అధ్యక్షుడు హరీష్ సబర్వాల్ తెలిపారు. దేశంలో వాణిజ్య వాహనాల నిర్వహణ ఖర్చులో సుమారు 60 శాతం వరకు డీజిల్‌ ఖర్చులు ఉంటాయి. దీంతో అధిక ఇంధన ధరల కారణంగా లారీలు, ట్రక్కులు, చిన్న వాణిజ్య వాహనాల యజమానులు, డ్రైవర్లు, వారి కుటుంబాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు ఏఐఎంటీసీ ప్రెసిడెంట్ హరీష్ సబర్వాల్ తెలిపారు. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా వ్యయాలు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకూ దారితీస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్ సహా ఇతర ఇంధనల కన్నా డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో రవాణా వ్యయాలు భారీగా పెరిగి ద్రవ్యోల్బణం భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నగరాల్లో డీజిల్ ధరలుపశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను రెండు వారాల వ్యవధిలోనే నాలుగుసార్లు పెంచారు. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.7.50 వరకు ధర పెరిగింది. దీంతో రవాణా వ్యయాలు భారీగా పెరిగాయి. ఈ ప్రభావం నిత్యావసర సరకుల నుంచి ఇతర ఉత్పత్తుల ధరలపైన చూపించింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో లీటర్