translateexpand_more

Current Weather News

Latest updates from Telugu Digital news sources.

Eenadu02 Jun, 10:40 am
భానుడి భగభగల వేళ.. చల్లని కబురు

హైదరాబాద్‌: భానుడి భగభగలతో జనం అల్లాడుతున్న వేళ వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు అంచనా వేసింది. ఇవి కేరళను తాకిన వారం రోజులకు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణుల ప్రభావంతో రాష్ర్టంలో నేడు, రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నట్లు తెలిపారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ జిల్లాలకు వర్ష సూచన ఉందని, ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు రాత్రి 7గంటల వరకు నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్‌ కర్నూల్‌, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్, మహబూబ్‌ నగర్‌తో పాటు యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వర్ష సూచన ఉండగా.. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు, ఉమ్మడి నల్గొండ, వరంగల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, మహబూబ్‌ నగర్‌తో పాటు కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన అధికారులు.. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రాబోయే నాలుగు రోజుల్లో క్రమంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. సాధారణంగా ఉద్యోగ విరమణ చేయగానే చాలా మంది ఇంట్లోనే కాలక్షేపం చేస్తుంటారు.

Current Weather News Keyword | Telugu Digital