
Horoscope Today 02 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు హంస, సాధ్య, శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈరోజు ఇంటా బయటా పని ఒత్తిడులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమతో కానీ పనులు పూర్తికావు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసిరావు. జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. వృషభ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మిథున రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. కర్కాటక రాశి వారు ఈరోజు పాత రుణాలు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులుంటాయి. మిత్రులతో కలహా సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. సింహ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. డబ్బు పరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. కన్య రాశి వారు ఈరోజు దూరపు బంధువులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు డబ్బు సహాయం చేస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. తుల రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలం. ఇంట్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొంత ఒత్తిడి తప్పదు. ధనుస్సు రాశి వారికి ఈరోజు కొన్ని వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తికావు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదానికి సంబంధించి విలువైన సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. కుంభ రాశి వారికి ఈరోజు ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కీలక వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. మీన రాశి వారు ఈరోజు కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు డబ్బు సహాయం చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.