
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Dhee Fame Dance Master Pandu Road Accident: లొడగలవాని పాలెం హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. రియాలిటీ షో ద్వారా గుర్తింపు పొందిన డాన్స్ మాస్టర్ పండుకు ఈ ప్రమాదంలో రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. హైవేపై ఆగి ఉన్న రెండు వాహనాలను అతివేగంగా వచ్చిన బొలెరో వ్యాన్ బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించి, ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు. నిద్రమత్తు లేదా అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. తగరపువలస ఉత్సవాల నుండి తిరిగి వస్తున్న సమయంలో ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బుల్లితెర డాన్స్ మాస్టర్ పండు తగరపువలస ఉత్సవాల్లో పాల్గొని, తన బృందంతో కలిసి తిరుగు ప్రయాణమవుతున్నారు. అదే సమయంలో లొడగానే వానిపాలెం హైవేపై ఆగి ఉన్న వాహనాలను, కోళ్లలోడుతో వెళ్తున్న బొలెరో వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. వ్యాన్‌లో బరువు ఎక్కువగా ఉండటంతో డ్రైవర్ అదుపు తప్పి వరుసగా వాహనాలను ఢీకొట్టారు. దీనివల్ల వాహనాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. ప్రమాద సమయంలో పండు కాళ్లు వాహనంలో ఇరుక్కుపోవడంతో స్థానికులు తీవ్రంగా ప్రయత్నించి ఆయనను బయటకు తీశారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు లేదా అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. క్రేన్ల సహాయంతో వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పండు ప్రమాదానికి గురైన వార్త తెలియగానే ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, డ్రైవర్ నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. READ ALSO: రెప్పపాటులో ఘోరం.. మహిళ దుర్మరణం, సిరిసిల్ల రోడ్డు ప్రమాదం లైవ్ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే! ఇక ఈ ఘోర రోడ్డు ప్రమాదం హైవేపై జరగడంతో అర్ధరాత్రి వేళ ఈ ఒక్కసారిగా తీవ్ర కలగలం రేపుతోంది. బుల్లితెర ప్రేక్షకులను స్థానికులను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తన డ్యాన్స్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్న డాన్స్ మాస్టర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి