
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు
Tirumala | వేయి నామాలు గల వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.
© 2026 telugu.digital

Tirumala | వేయి నామాలు గల వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

మహారాష్ట్రలో జీపు బోల్తా ప్రమాదం నిర్మల్ జిల్లా వాసులు నలుగురు మృతి శివయ్య దర్శనం ముగించుకుని వస్తుండగా విషాదం Maharashtra Jeep Accident: శ్రావణ సోమవారం నాడు దైవదర్శనానికి వెళ్లిన నిర్మల్ జిల్లా వాసుల ప్రయాణం విషాదాంతమైంది. మహారాష్ట్ర (Maharashtra Jeep Accident)సరిహద్దు ప్రాంతంలో జీపు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల సరిహద్దులోని తొటాంబ గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని శివాలయానికి వెళ్లిన వీరంతా, తిరుగుప్రయాణంలో మహారాష్ట్రలోని సాసర్ కొండ జలపాతాన్ని సందర్శించి వస్తుండగా ఈ విషాదం జరిగింది. BC Dedicated Commission: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. బీసీ డెడికేటెడ్ కమిషన్ గడువు పెంపు.. కొత్త డెడ్‌లైన్ ఎప్పుడంటే? భైంసా ఆసుపత్రికి క్షతగాత్రులు తరలింపు: ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతులలో ముగ్గురిని కుబీర్ మండలం పార్డి (బి) గ్రామానికి చెందిన తులసీరామ్, గంగన్న, గంగాబాయిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద వార్త తెలియగానే గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం అత్యంత వైభవంగా పూర్తయింది. ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించిన ఈ పవిత్ర వేడుకల్లో వేలాదిమంది భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు.వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని ఈ వేకువజామున అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు అర్చకులు. సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారు చీరతో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.రోజా, మల్లె, చామంతి, సంపంగి, తామర, తులసి తదితర సుగంధ, సంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో అర్చించారు. తొమ్మిది గ్రంథులతో అమ్మవారిని అలంకరించి, ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు ప్రతీకగా పూజించారు. అనంతరం 12 రకాల నైవేద్యాలను సమర్పించి మహా మంగళహారతితో వ్రతాన్ని ముగించారు. వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ద్వారా సంతానం, దీర్ఘమాంగల్య సౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని అర్చకులు పేర్కొన్నారు.శ్రావణంలో దానం చేయదగ్గ వస్తువులు.. ఓ దోసెడు పోసినా చాలుకాగా.. ఆలయానికి తరలివచ్చిన అశేష భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ తదితర ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 60 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించి సుమారు మూడు టన్నుల పుష్పాలు, 14 రకాల 30,000 కట్ ఫ్లవర్స్‌తో ఆలయం, ఆస్థాన మండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష, మొసంబి, పైనాపిల్ తదితర పండ్లు, వివిధ రకాల పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మండపం పైభాగంలో గజలక్ష్మి

ఇంద్రీకీలాద్రి భక్తులకు తీపి కబురు. దుర్గమ్మను దర్శించుకునే భక్తుల కోసం ఆలయ ప్రాంగణం లో కొత్త సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. రానున్న దసరా పండగ లోపు భక్తులకు ఇంకా మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఇంద్రకీలాద్రి కొండ దిగువన రూ.52 కోట్లతో నిర్మించిన అన్నదాన నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. ఒకేసారి 800 మంది కూర్చొని భోజనం చేసేలా ఈ భవనాలు నిర్మించామని తెలిపారు.ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఇంద్రకీలాద్రిపై మరిన్ని అభివృద్ధి పనులు చేసేందు కు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ప్రస్తుతం ప్రారంభించిన భవనంలో మెకనైజ్డ్ కిచెన్‌కు కొత్త టెక్నాలజీ వినియోగిస్తున్నామని మంత్రి ఆనం వివరించారు. ఏడాదికి 3 కోట్ల మందికి ఏపీ దేవాలయల్లో అన్నదానం జరుగుతోందని పేర్కొన్నారు.Umrah Visa: ఉమ్రా భక్తులకు షాక్, ఇక ఇలా మక్కా వెళ్లలేరు.. సౌదీ కొత్త రూల్ఇంద్రకీలాద్రికి రెండో ఘాట్ రోడ్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని గుర్తు చేశారు. అందుకు సంబంధించిన నివేదిక సిద్ధమవుతుందని అన్నారు. త్వరలో టెండర్స్ పిలుస్తామని చెప్పారు. కాగా, ఏడాదికి 3 కోట్ల మందికి ఏపీ దేవాలయల్లో అన్నదానం జరుగుతోందని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రికి రెండో ఘాట్ రోడ్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని గుర్తు చేశారు. అందుకు సంబంధించిన నివేదిక సిద్ధమవుతుందని అన్నారు. త్వరలో టెండర్స్ పిలుస్తామని చెప్పారు.ఇంద్రకీలాద్రి భక్తుల కోసం రూ.26 కోట్ల వ్యయంతో 5,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవనం నిర్మించారు. మొదటి అంతస్తులోని విశాల భోజనశాలలో ఒకేసారి 800 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించేలా సదుపాయాలు కల్పించారు. గ్రౌండ్ ఫ్లోర్లో కేంద్ర నిల్వ గదులు, నిత్య అన్నదాన సామగ్రి నిల్వ, వంటకు ముందస్తు ఏర్పాట్ల విభాగం, క్యూ మార్గాలు, ఏర్పాటు చేశారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా క్యూ మార్గాలను