
సింహ వాహనంపై విహరించిన శ్రీ మలయప్పస్వామి
తిరుమల (Tirumala)లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
© 2026 telugu.digital

తిరుమల (Tirumala)లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

తిరుమల కల్యాణ వేదికలో 1.5 ఎకరాల విస్తీర్ణంలో పుష్ప ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. 18 రకాల పుష్పాలు, 72 వేల పూలతో నాలుగు యుగాలు, 14 రకాల థీమ్స్‌ను అందంగా ఆవిష్కరించారు.

Ankurarpanam at Tirumala: Vaikhanasa Agama Ceremony Kickstarts Srivari Salakatla Brahmotsavams. Dhwajarohanam will be performed on Tuesday between 6:21 p.m. and 6:35 p.m. in the auspicious Meena Lagnam for Brahmotsava celebrations. విద్యుద్దీప కాంతులతో వెలిగిపోతోంది. నారాయణుడి నామస్మరణతో పులకించిపోతోంది.

Tirumala | వేయి నామాలు గల వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. అయితే బిగ్ అలర్ట్. దర్శన టికెట్ల జారీని టీటీడీ నిలిపివేసింది. ఆరు రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం ఎస్ఎస్డీ దర్శన టికెట్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ టికెట్లను 14వ తేదీ నుంచి 19 వరకు నిలిపివేయనున్నారు.

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్, 10 రోజుల పాటు పలు దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్బంగా భక్తుల రద్దీ భారీగా పెరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సామాన్య భక్తుల దర్శనానికి అవకాశం కల్పించనుంది. అందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దయ్యాయి.

9 day religious festival of annual Brahmotsavams at Tirumala observed ceremonially Ankurarpana today. Vaikhanasa Agama also describes Ankurarpanam as Beejavapanam, conducted seeking the divine intervention for the well being of the humanity. వైఖానస ఆగమ సాంప్రదాయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోన్నారు టీటీడీ అర్చకులు.
Tirumala Srivari Brahmotsavams VIP Break Darshans Cancelled: తిరుమల వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహోత్సవాలు నెల 15 నుంచి 23 వరకు జరగనున్నాయి. టీటీడీ బ్రహ్మోోత్సవాల కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది.. ఈ ఏడాది కూడా సాధారణ భక్తులకే ప్రాధాన్యమివ్వనుంది. దీని కోసం టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ఈ నెల 15 నుంచి 23 వరకు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించమని టీటీడీ ప్రకటించింది. గరుడసేవ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

Tirumala | తిరుమల కు వచ్చే ప్రైవేటు వాహనాల పై ఆంక్షలు విధిస్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది .
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలలో సెప్టెంబర్ నాలుగో తేదీన గోకులాష్టమి ఆస్థానం, 5న ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ ఐదో తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఓ ప్రకటనలో వెల్లడించింది. సెప్టెంబర్ 4న శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామికి నివేదనలు సమర్పిస్తారు. అనంతరం ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. దీని తర్వాత ద్వాదశారాధనం చేపడతారు.అలాగే సెప్టెంబర్ నాలుగో తేదీ గోగర్భం డ్యామ్ వద్ద ఉన్న ఉద్యానవనంలో టిటిడి ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో శ్రీకృష్ణునికి పంచాభిషేకాలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇక సెప్టెంబర్ ఐదో తేదీ తిరుమలలో ఉట్లోత్సవం జరగనుంది. ఉట్లోత్సవం సందర్భంగా సాయంత్రం 4 గంటలకు మలయప్పస్వామి, శ్రీకృష్ణస్వామి తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. కార్యక్రమంలో భాగంగా యువకులు ఉట్లోత్సవంలో పాల్గొని.. ఉత్సాహంతో ఉట్లను కొడుతూ భక్తులకు ఆనందాన్ని పంచుతారు.మరోవైపు వర్షాలు సమృద్ధిగా కురిసి దేశప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ టీటీడీ చేపడుతున్న కారీరిష్టి యాగం రేపటితో ముగియనుంది. తిరుమలలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న కారీరిష్టి యాగం.. గురువారం పూర్ణాహుతితో ముగియనుంది. సకాలంలో వర్షాలు కురిసి, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ టీటీడీ 1994వ సంవత్సరం నుంచి కారీ రిష్టి యాగాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఐదు రోజుల పాటు కొనసాగిన ఈ వైదిక క్రతువు సెప్టెంబర్ మూడో తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్యన

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ స్వామివారి పాదాల వద్ద రాకెట్ సెప్టెంబర్ 4న జీఎస్ఎల్వీ ప్రయోగం ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చైర్మన్ ఎస్. సోమనాథ్, ఇతర ఉన్నతాధికారులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఇస్రో బృందం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆనంద నిలయంలోకి ప్రవేశించి స్వామివారి సేవలో పాల్గొంది. రాబోయే ముఖ్యమైన రాకెట్ ప్రయోగానికి ముందు స్వామివారి ఆశీస్సులు పొందడం ఇస్రో శాస్త్రవేత్తలకు ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ జీఎస్ఎల్వీ ఎఫ్-17, ఇఓఎస్-05 (GSLV F-17, EOS-05) రాకెట్ నమూనాను మూలవిరాట్ పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. Jai Kottu Logo Launch: జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. పిఠాపురంలో లోగో ఆవిష్కరించిన.. పవన్ కీలక సందేశం సెప్టెంబర్ 4న జీఎస్ఎల్వీ ఎఫ్-17 ప్రయోగం: దర్శనం అనంతరం ఇస్రో చైర్మన్‌కు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:55 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్‌లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ ద్వారా ఇఓఎస్-05 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్, తుది ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి

టీటీడీలో అవినీతి ఆరోపణలు కలకలం రేపాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈవో) ఎం. లోకనాథం నివాసం, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. తిరుపతి, తిరుమలతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఏడు బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఈరోజు ఉదయం 6 గంటలకే అధికారులు తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉండగా తనిఖీలు ప్రారంభించారు. అదే సమయంలో తిరుమలలోని ఆయన కార్యాలయంలో మరో బృందం సోదాలు చేపట్టింది. ఈ దాడులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా జరుగుతున్నాయని ఏసీబీ వర్గాలు తెలిపాయి.ఈ సోదాలను అధికారులు బహుళ ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. తిరుపతిలో లోకనాథం ఇద్దరు బావమరుదుల ఇళ్లలో, యెర్పేడు మండలం చెల్లూరులో ఉన్న ఆయన సోదరి నివాసంలోనూ తనిఖీలు చేపట్టారు. తిరుమలలో లోకనాథంకు సంబంధం ఉందని భావిస్తున్న ఒక గెస్ట్ హౌస్‌లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. విచారణలో భాగంగా తిరుపతి ఎస్టీవీ నగర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలో ఉన్న లోకనాథం బ్యాంక్ లాకర్లను కూడా అధికారులు తెరిచి పరిశీలిస్తున్నారు. లోకనాథం ప్రస్తుతం శ్రీవారి ఆలయం టెంపుల్ డిప్యూటీ ఈవోగా కీలక బాధ్యతల్లో ఉండగా, గతంలో టీటీడీలో వివిధ హోదాల్లో పనిచేశారు.గత దశాబ్ద కాలంలో ఒక టీటీడీ ఉన్నతాధికారిపై ఏసీబీ సోదాలు నిర్వహించడం ఇది రెండోసారి

తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాల్లో ఉదయాన్నే ఒక వార్త పిడుగులా పడింది. టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే బలమైన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేయడమే కాకుండా, తిరుపతితో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆయన నివాసాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. శనివారం తెల్లవారుజామున 6 గంటలకే రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు ఒకేసారి పలు చోట్ల తనిఖీలు చేపట్టడంతో తిరుమలలో తీవ్ర సంచలనం వ్యక్తమవుతోంది.ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మొత్తం 7 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు ఈ దాడులను అత్యంత రహస్యంగా నిర్వహించారు. తిరుపతిలోని పెదకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం ప్రధాన నివాసంలో సోదాలు చేస్తున్న సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. దీంతో పాటు తిరుపతి ఎస్టీవీ నగర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఉన్న ఆయన లాకర్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం ఆయన ఇల్లే కాకుండా.. తిరుమలలోని ఆయన డిప్యూటీ ఈవో ఆఫీస్, వసతిగృహంతో పాటు బంధువుల ఇళ్లను కూడా ఏసీబీ వదల్లేదు. అవినీతి ముత్యం @రూ.200 కోట్లు.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 14రోజుల రిమాండ్ బంధువుల ఇళ్లపైనా విరుచుకుపడ్డ బృందాలులోకనాథంకు చెందిన బినామీ ఆస్తులు, కీలక పత్రాల అన్వేషణలో భాగంగా ఆయన నెట్‌వర్క్‌పై ఏసీబీ నిఘా పెట్టింది. తిరుపతిలోని ఆయన ఇద్దరు బావమరుదుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా.. ఏర్పేడు మండలం చెల్లూరులోని ఆయన సోదరుడి ఇంట్లో కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కీలక ఆధారాలు, నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పాస్తుల డాక్యుమెంట్లను సీజ్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.డీఎస్పీ భీంరెడ్డి ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్.. తొలిరోజే రూ.200 కోట్లకు పైనే 15 ఏళ్ల తర్వాత టీటీడీలో మళ్లీ ఏసీబీ ప్రకంపనలు!తిరుమల శ్రీవారి దేవస్థానంలో దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘ

తిరుమల: ఇస్రో(ISRO) చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన బృందంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్సు ద్వారా ఆనంద నిలయంలోకి వెళ్లిన నారాయణన్.. జీఎస్ఎల్వీ ఎఫ్-17, ఇఓఎస్- 05 నమూనా రాకెట్‌ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇస్రో చేపడుతున్న జీఎస్ఎల్వీ-ఎఫ్17 సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:55 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) రెండవ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి వెళ్లనుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
నకిలీ వెబ్సైట్ల గురించి తిరుమల శ్రీవారి భక్తులను టీటీడీ మరోసారి అప్రమత్తం చేసింది. గదుల కేటాయింపు పేరుతో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ.. పోస్టర్లు, తప్పుడు హామీలతో భక్తులను మోసం చేస్తున్న 249 నకిలీ వెబ్సైట్లను ఈ సంవత్సరం ఇప్పటివరకు గుర్తించినట్లు టీటీడీ తెలిపింది. ఆ ఫేక్ వెబ్సైట్లను తొలగించామని.. రెండు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపింది. ఆన్లైన్లో టీటీడీ పేరుతో కనిపించే నకిలీ వెబ్సైట్లు, లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులను హెచ్చరించింది. శ్రీవారి దర్శనం, వసతి, సేవలు, టోకెన్ల విషయాల్లో దళారులను నమ్మి మోసపోవద్దని.. తిరుమలకు సంబంధించిన అన్ని సేవలు, నిబంధనలు, మార్గదర్శకాలపై అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.దర్శనం, గదుల కేటాయింపు అంటూ మోసాలకు పాల్పడుతున్న దళారులపై ఈ ఏడాది ఇప్పటివరకు 30 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన 43 మంది టీటీడీ ఉద్యోగులపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. తిరుమలకు వచ్చే భక్తులు తమ సూచనలు, నిబంధనలు పాటిస్తూ.. భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవాలని సూచించింది.ఇక తిరుమలకు వచ్చే వెంకన్న భక్తులు తమ వెంట తీసుకువచ్చే వస్తువులపైనా టీటీడీ కీలక సూచనలు చేసింది. తిరుమలకు వచ్చే వాహనాల్లో నిషేధిత వస్తువులను తరలించకుండా అలిపిరి, శ్రీవారిమెట్టు వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు టీటీడీ తెలిపింది. నిషేధిత వస్తువులను గుర్తిస్తే.. అలిపిరి టోల్గేట్ స్కానింగ్ కేంద్రం వద్దనే సీజ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు అలిపిరి వద్ద 261 డ్రోన్లు, 105 మెటా స్మార్ట్ గ్లాసెస్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమల క్షేత్రంలో భద్రత, గోప్యతను దృష్టిలో పెట్టుకుని శ్రీవారి భక్తులు.. డ్రోన్లు, స్మార్ట్ గ్లాసెస్ వంటి రికార్డింగ్ పరికరాలను తమ వెంట తీసుకురావద్దని విజ్ఞప్తి చేసింది.తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోందన్న టీటీడీ.. పరిమితికి మించి వస్తున్నప్పటికీ, భక్తులకు
Viral Video: సబ్‌స్రైబ్ చేస్తే చేస్తే తిరుమల లడ్డూ ఫ్రీ! సబ్‌స్క్రైబ్ చేస్తే తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ ఉచితమంటూ.. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. తమిళనాడుకు చెందిన షణ్ముగం అనే వ్యక్తి తన ఫేస్బుక్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఇది ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఎవరైనా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయిస్తే ఒక్కో లడ్డూ చొప్పున బహుమతిగా ఇస్తున్నట్లు ఆ వీడియోలో చూపించారు. ఇలా ఏకంగా 30 మందితో సబ్‌స్క్రైబ్ చేయించుకుని.. దానికి ప్రతిఫలంగా 30 లడ్డూలను పొందినట్లు.. ఆ వ్యక్తి అందులో పేర్కొన్నాడు. ప్రపంచ ప్రఖ్యాత శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇలా సోషల్ మీడియా ప్రమోషన్లకు, సబ్స్క్రైబర్లను పెంచుకోవడానికి వాడుకోవడం పట్ల భక్తులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఈ వార్తకు సంబంధించిన

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మంగళవారం కావడం, వరస సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ అనుకున్నంత స్థాయిలో లేదు. భక్తులు సులువుగానే ఏడుకొండలవాడిని దర్శించుకుని తరిస్తున్నారు. ఈ నెలలో ప్రత్యేక పర్వదినాలు.. బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే సమయంలో బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు మరింత గా సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.తిరుమలకు వచ్చే భక్తుల వసతి కష్టాలకు టీటీడీ చెక్ పెడుతోంది. కొద్ది నెలల క్రితం తిరుమలలో అందుబాటులోకి వచ్చిన పీఏసీ- 5 ను పెద్ద సంఖ్యలో భక్తులు వినియోగించుకుంటున్నారు. తిరుమలలో తిరుమలలో 60 వేల మంది యాత్రికులకు వసతి కల్పించేలా 7600 గదులు, 5 పీఏసీలు ఉన్నాయి. అయినా.. గదుల కోసం భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో.. తిరుపతిలో కొత్త వసతి సముదాయాలను సిద్దం చేసారు. బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో భక్తుల కోసం నిర్మించిన శ్రీపాదం, అచ్యుతం వసతి సముదాయాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ మేరకు టీటీడీ తుది ఏర్పాట్లను వేగవంతం చేసింది. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో నిర్మిస్తున్న శ్రీపాదం, అచ్యుతం సముదాయాల పనులు చివరి దశకు వచ్చాయి. ప్రధాన భవనం, గదుల నిర్మాణం పూర్తయినా, లోపలి ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తయ్యాయి. తిరుపతికి విమానాల రాకపోకల షెడ్యూల్ మార్పు, కొత్త టైమింగ్స్..!!బ్రహ్మోత్పవాల వేళ ప్రారంభం.. ఒకే సారి పది వేల మందికి ఈ రెండు సముదాయాల్లో భాగంగా ఒక్కో భవనంలో తొమ్మిది అంతస్తులు నిర్మిస్తున్నారు. గదులు 532 చొప్పున 1,064 ఉన్నాయి. దాదాపుగా పదివేల మంది భక్తులకు వసతి కల్పించే వెసులుబాటు కలగనుంది. కాగా, రెండో అంతస్తులో రిసెప్షన్, అన్నదానం, వసతి కేంద్రాలు ఉంటాయి. మూడు, నాలుగు అంతస్తుల్లో 48 డార్మెటరీలు.. సుమారు 7,000 మందికి సరిపడా లాకర్ల ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

శ్రీవారి రెండు బ్రహ్మోత్సవాల ప్రకటన సెప్టెంబరు పధ్నాలుగున అంకురార్పణ కార్యక్రమం తొమ్మిది రోజుల వాహన సేవలు TTD: కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. ఏడాది పొడవునా స్వామివారికి ఎన్నో ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ, సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వయంగా ప్రారంభించిన ఈ బ్రహ్మోత్సవాలకు విశేష ప్రాధాన్యత ఉంది. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి వచ్చే అధిక మాసం కారణంగా ఈ సంవత్సరం భక్తులకు రెండు బ్రహ్మోత్సవాలు(TTD) కనులవిందు చేయనున్నాయి. సెప్టెంబరులో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరులో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరగనున్నాయి. Ramchander Rao Arrest: భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్ట్.. నల్గొండలో హైటెన్షన్ ముఖ్యమైన తేదీలు- శాస్త్రోక్త క్రతువులు: బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందుగా సెప్టెంబరు 8న ఆలయ శోధన ప్రక్రియ అయిన 'కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం' నిర్వహిస్తారు. అనంతరం సెప్టెంబరు 14న సాయంత్రం విష్వక్సేనుల వారి సమక్షంలో ధాన్యాలను నాటే 'అంకురార్పణం' వేడుక జరుగుతుంది. సెప్టెంబరు 15న ధ్వజారోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో స్వామివారు వివిధ వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిస్తారు. వాహన సేవల వైశిష్ట్యం- ముగింపు వేడుకలు: ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 19న జరిగే గరుడ వాహన సేవ, మోహినీ అవతారం అత్యంత కీలకమైనవి. వీటితో పాటు స్వర్ణరథం, సర్వభూపాల, రథోత్సవ సేవలు భక్తులను పరవశింపజేస్తాయి. చివరిరోజున అంటే సెప్టెంబరు 23న పుష్కరిణిలో చక్రస్నానం వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించి, రాత్రి ధ్వజావరోహణంతో ఈ మహా యజ్ఞం ముగుస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది

తిరుపతికి వచ్చే విమాన ప్రయాణీకులకు బిగ్ అలర్ట్. తిరుపతికి రాకపోకలు సాగించే విమానాల షెడ్యూల్ లో మార్పులు చేసారు. కొత్త వేళలు ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. విమానయాన సంస్థలు ఈ షెడ్యూల్ ఖరారు చేసాయి. నిత్యం వేలాది మంది ప్రయాణీకులు విమానాల ద్వారా తిరుపతికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కాగా, ప్రయాణీకుల నుంచి వస్తున్న ఆదరణ.. అభ్యర్ధన లకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.తిరుపతి విమానాశ్రయం నుంచి నడిచే పలు విమాన సర్వీసుల వేళల్లో మార్పులు చేశారు. ఈ మేరకు విమానాశ్రయం అధికారులు వెల్లడించారు. ఇవి ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచి అమలు లోకి వస్తాయని తెలిపారు. అందులో భాగంగా హైదరాబాద్ - తిరుపతి: ఉదయం 7:20కి వచ్చి, తిరిగి 8:00 గంటలకు బయలుదేరుతుంది. హైదరాబాద్ - తిరుపతి: ఉదయం 11:15కి వచ్చి, తిరిగి 11:45 గంటలకు బయలుదేరుతుందని వెల్లడించారు. హైదరాబాద్ - తిరుపతి: మధ్యాహ్నం 1:50కి వచ్చి, తిరిగి 2:30 గంటలకు బయలుదేరనుంది. ఇక, విశాఖపట్నం - తిరుపతి: మధ్యాహ్నం 3:30కి వచ్చి, తిరిగి సాయంత్రం 4:00 గంటలకు బయలుదేరుతుందని.. కాగా, ఢిల్లీ - తిరుపతి: సాయంత్రం 6:25కి వచ్చి, తిరిగి రాత్రి 7:05 గంటలకు బయలుదేరు తుందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ - తిరుపతి: రాత్రి 8:20కి వచ్చి, తిరిగి రాత్రి 9:00 గంటలకు బయలుదేరేలా మార్పు చేసారు. శ్రీవారి సేవలో కొత్తగా వీరికీ TTD భాగస్వామ్యం - అర్హతలు, నమోదు ప్రక్రియ..!!విమానాల రాకపోకల కొత్త షెడ్యూల్అదే విధంగా స్టార్ ఎయిర్‌లైన్స్ సర్వీస్ కు చెందిన శివమొగ్గ - తిరుపతి: మధ్యాహ్నం 12:20కి వచ్చి, తిరిగి సాయంత్రం 6:00 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. ఇక.. ఎయిర్ ఇండియా సర్వీస్ కు చెందిన హైదరాబాద్ - తిరుపతి సర్వీసు: సాయంత్రం 5:10కి వచ్చి, తిరిగి సాయంత్రం 6:00 గంటలకు బయలుదేరేలా మార్పులు ప్రకటించారు. ఇక.. ఇప్పటికే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Cauliflower gobi dishes ban in Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఒకవైపు వీకెండ్ , మరోవైపు శ్రావణ మాసం, వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో విపరీతంగా భక్తుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం 31 కంపార్ట్ మెంట్స్ లలో భక్తులు వేచి ఉన్నారు. అంతే కాకుండా శిలాతోరణం వరకు క్యూలైన్ ఉంది. టీటీడీ భక్తులకు అల్పాహరం, తాగునీటి సదుపాయాల్ని కల్పిస్తుంది. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకుంది. తిరుమలలో ప్రస్తుతం ప్రతి బుధవారం రోజు ఎస్ఎస్ డీ టొకెన్ల జారీని నిలిపివేశారు. ఇక ఎస్ ఎస్ డీ టొకెన్లు ఉన్నవారికి దర్శనాలకు 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. రూ. 300 టొకెన్లు ఉన్న భక్తులకు 5 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. ఇక తిరుమలలో రీల్స్, రాజకీయాలు మాట్లాడటంపై టీటీడీ సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. అయితే.. టీటీడీ తిరుమలలో కాలీఫ్లవర్ వంటకాన్ని నిషేధించింది. ఇప్పటికే తిరుమలలోని రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో.. తిరుమలలో గోబీ (కాలీఫ్లవర్) వంటకాలను టీటీడీ నిషేధించింది. ఇటీవల తిరుమల ఫుడ్ సెఫ్టీ అధికారుల తనిఖీల్లో అనేకచోట్ల గోబీల్లో పురుగులు, కీటకాలు ఉండటంను అధికారులు గుర్తించారు. Read more: తిరుచానూరు ఆలయంలో నేత్రపర్వంగా వరలక్ష్మీ వ్రతం.. బంగారు చీరలో దర్శనమిచ్చిన పద్మావతి అమ్మవారు! ఈ నేపథ్యంలో భక్తుల ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే తిరుమలలోని రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో చైనీస్
తిరుమల శ్రీవారిని మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ కుటుంబసభ్యులు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ అభిమాని రామచంద్ర రాజు అలియాస్ ఎన్టీఆర్ కుమారుడు శ్రీధర్ వర్మ ఎస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా.. ఆయనతో కలసి నందమూరి రామకృష్ణ , మోహనకృష్ణ కుటుంబంతో స్వామివారిని దర్శించుకున్నారు. రామచంద్రరాజుతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ ఎమోషనల్ అయ్యారు. శ్రీధర్ వర్మకు తన తండ్రి ఎన్టీఆర్, ఎన్టీఆర్ రాజు ఆశీస్సులు ఉండాలంటూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.ఎన్టీఆర్ రాజు రెండుసార్లు వరుసగా పాలకమండలిలో సభ్యుడిగా ఉన్నారని.. మూడోసారి పదవి ఇవ్వబోతే ఎన్టీఆర్ వద్దని చెప్పిన విషయాన్ని నందమూరి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. అప్పుడే ఎన్టీఆర్ టీటీడీ పాలకమండలి సభ్యుల పదవీ కాలానికి సంబంధించి ఓ నిబంధనను తీసుకొచ్చారని.. టీటీడీ పాలకమండలిలో రెండుసార్లకు మించి ఎవరూ ఉండకూడదని ఎన్టీఆర్ జీవో తెచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ రాజు సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.శ్రీధర్ వర్మకు ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిరావడం ఆనందంగా ఉందన్నారు నందమూరి మోహనకృష్ణ. శ్రీధర్ వర్మ తండ్రి ఎన్టీఆర్ రాజుతో తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ రాజు పిల్లలు మాకు సోదరసమానులు.. అందరం అన్నదమ్ముల్లా ఉంటామన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో ఎన్టీఆర్ రాజును పోటీచేయమని కోరితే.. ఆయన నిరాకరించి 'మీకు సేవ చేసుకుంటాను' అని చెప్పిన మాటన గుర్తు చేశారు. ఎన్టీఆర్ కోరితేనే టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించారని.. ఆయన భూ దానం కూడా చేశారన్నారు. అంతేకాదు ఎన్టీఆర్ రాజు గతేడాది కన్నుమూశారు.. ఆయన పాడెను మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు కుమారులు నందమూరి మోహనకృష్ణ, రామకృష్ణ మోశారు.టీడీపీ స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ టీటీడీకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నిన్న వరలక్ష్మీ వ్రత వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాల్లో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి కూడా పాల్గొన్నారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. ఇక్కడ అష్టలక్ష్మి మంటపాన్ని కూడా ఎంతో శోభాయమానంగా అలంకరించారు. ఇక సాయంత్రం వేళ వైభవంగా స్వర్ణ రథోత్సవం కూడా నిర్వహించారు. ఉదయాన్నే సుప్రభాత సేవతో కార్యక్రమాలు మొదలయ్యాయి. అమ్మవారికి సహస్రనామార్చన, నిత్యార్చన, అభిషేకాలు నిర్వహించారు. ఈరోజు అమ్మవారు బంగారు చీరతో విశేషంగా అలంకరించబడి భక్తులకు దివ్యదర్శనాన్ని ఇచ్చారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆస్థాన మండపంలో పద్మ పీఠంపై ప్రతిష్టించారు. వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి, రోజా, మల్లె, చామంతి, సంపంగి, తామర, తులసి వంటి సుగంధ పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. మొత్తం 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి, మహా మంగళ హారతితో వ్రతాన్ని ముగించారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం, దీర్ఘ మాంగల్యం, సౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఈ వ్రతాన్ని ఆచరించడం అత్యంత విశిష్టమని పండితులు పేర్కొంటున్నారు. టీటీడీ ఉద్యానవన విభాగంలోని 60 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించి, సుమారు మూడు టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 14 రకాల కట్ ఫ్లవర్స్‌తో ఆలయం, ఆస్థాన మండపాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. మంటపాన్ని మోసంబి, పైనాపిల్, ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్లతో, పూలతో అందంగా తీర్చిదిద్దారు. మంటపం పైభాగంలో గజలక్ష్మి అమ్మవారు, ఇరువైపులా ఐరావతాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలను కనులారా చూడాలనుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏడు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు

అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాలినడక మార్గానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నాలుగు కాళ్లతో నడిచే క్వాడ్రుపెడ్ రోబోట్ డాగ్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించింది. సాధారణ నిఘా కెమెరాలు, ఫుట్ పెట్రోలింగ్ ద్వారా చేరుకోవడం కష్టమైన ప్రాంతాల్లోకి వెళ్లి పరిస్థితులను పరిశీలించే సామర్థ్యం ఈ రోబోట్‌కు ఉంది. తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద నిర్వహించిన ట్రయల్‌లో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు రోబో పనితీరును పరిశీలించారు. తిరుమల కొండల్లోని కొన్ని అటవీ ప్రాంతాలు సాధారణ సిబ్బంది నిరంతరం పర్యటించేందుకు అనుకూలంగా ఉండవు. ఎత్తుపల్లాలు, రాళ్లు, మెట్లు, గుట్టలు, దట్టమైన వృక్ష సంపద ఉన్న ప్రాంతాల్లో మానవ నిఘాకు పరిమితులు ఉంటాయి. ఇలాంటి ప్రదేశాల్లో రోబో డాగ్‌ను మోహరించడం ద్వారా మరింత విస్తృతంగా పర్యవేక్షణ చేపట్టే అవకాశం ఉంటుంది. నాలుగు కాళ్ల నిర్మాణం కారణంగా సమానంగా లేని నేలపైనా ఇది సమతుల్యతను కాపాడుకుంటూ ముందుకు కదలగలదు. అవసరాన్ని బట్టి వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దీనిని త్వరగా తరలించవచ్చు. దీంతో సిబ్బంది నేరుగా ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లాల్సిన అవసరం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. రోబో డాగ్లో సాధారణ కెమెరాలతో పాటు థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్, వివిధ సెన్సర్లు అమర్చినట్లు అధికారులు తెలిపారు. వీటి సాయంతో పరిసరాలను వివిధ కోణాల్లో పరిశీలించవచ్చు. ముఖ్యంగా వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో థర్మల్ కెమెరా ద్వారా ఉష్ణోగ్రత ఆధారిత చిత్రాలను సేకరించే అవకాశం ఉంటుంది. దట్టమైన పొగమంచు, చీకటి వంటి పరిస్థితుల్లోనూ పరిసరాల్లో కదులుతున్న జీవులను గుర్తించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. సేకరించిన సమాచారం ఆధారంగా అటవీ ప్రాంతంలో ఏ సమయంలో, ఏ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉంటున్నాయనే అంశంపై టీటీడీకి మరింత స్పష్టమైన సమాచారం లభించే అవకాశం