విశాఖపట్నం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ (Dhee) ఫేమ్ డాన్సర్ పండు మాస్టర్‌కు (Pandu Master) రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పండు మాస్టర్ కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అసలేం జరిగిందంటే..?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పండు మాస్టర్ తన బృందంతో కలిసి తగరపువలసలో జరిగిన ఒక జాతర కార్యక్రమానికి హాజరయ్యారు. వేడుక ముగిసిన అనంతరం వారు కారులో తిరిగి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఆనందపురం పరిధిలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, కారులో ఉన్న ఒకరికి వాంతులయ్యాయి. దీంతో కారును రోడ్డు పక్కన ఆపారు. ఆ సమయంలో పండు మాస్టర్ కూడా కారు దిగారు. అదే సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన ఒక కోళ్ల లారీ, రోడ్డు పక్కన ఆగి ఉన్న పండు మాస్టర్ కారును, ఆయనను బలంగా ఢీకొట్టింది.

కాళ్లకు తీవ్ర గాయాలు.. కారు ధ్వంసం..

కోళ్ల లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో పండు మాస్టర్ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. లారీ ఢీకొట్టిన వేగానికి పండు మాస్టర్ ప్రయాణిస్తున్న కారుతో పాటు, దాని ముందు ఆగి ఉన్న మరో బొలెరో వాహనం కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న పండు మాస్టర్‌ను స్థానికులు, సహచరులు కలిసి చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి.

రంగంలోకి దిగిన పోలీసులు..

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఆనందపురం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను పరిశీలించి, వాహనాలను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లీయర్ చేశారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పండు మాస్టర్‌కు ప్రమాదం జరిగిందనే వార్త తెలియడంతో సహా కళాకారులు, అభిమానులు షాక్‌కు గురయ్యారు. పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రార్థిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

‘సర్’ను సీరియస్‌గా తీసుకోండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

సునీల్ కుమార్ వ్యాఖ్యలపై విచారణ చేయాలి: రఘురామకృష్ణరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News