
రోజుకు 3-4 కప్పుల కాఫీతో కాలేయానికి మేలు..?
కాఫీ తాగని వారితో పోలిస్తే కాఫీ తాగే వారిలో దీర్ఘకాలిక కాలేయ వ్యాధులతో మరణించే ప్రమాదం 49 శాతం తక్కువగా ఉన్నట్లు తాజా పరిశోధనల్లో గుర్తించారు..| Coffee and Liver Disease
© 2026 telugu.digital

కాఫీ తాగని వారితో పోలిస్తే కాఫీ తాగే వారిలో దీర్ఘకాలిక కాలేయ వ్యాధులతో మరణించే ప్రమాదం 49 శాతం తక్కువగా ఉన్నట్లు తాజా పరిశోధనల్లో గుర్తించారు..| Coffee and Liver Disease

ఛాతీలో నొప్పి లేదా మంట వస్తే చాలామంది గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇదే తరహా లక్షణాలు గుండె సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. గ్యాస్ నొప్పి, గుండెపోటు లక్షణాల మధ్య తేడాను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంటర్నెట్ డెస్క్: ఛాతీలో మంట, నొప్పి లేదా అసౌకర్యం కనిపించినప్పుడు చాలామంది దాన్ని గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. ముఖ్యంగా అజీర్తి, కడుపు ఉబ్బరం, వికారం వంటి లక్షణాలు ఉంటే గ్యాస్ట్రిక్ సమస్యేనని అనుకుంటారు. అయితే ఇలాంటి లక్షణాలు కొన్ని సందర్భాల్లో గుండెకు సంబంధించిన సమస్యల్లోనూ కనిపించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఛాతీలో అసౌకర్యం కలిగినప్పుడు కారణాన్ని నిర్ధారించకుండా నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని సూచిస్తున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు సాధారణంగా పొట్ట పైభాగంలో అసౌకర్యం, ఛాతీ కింది భాగంలో నొప్పి లేదా మంట కనిపించవచ్చు. కడుపు ఉబ్బినట్లు అనిపించడం, తేన్పులు రావడం, అజీర్తి వంటి సమస్యలు కూడా ఉండొచ్చు. అయితే కేవలం లక్షణాలను బట్టి ఇది గ్యాస్ సమస్యేనని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. గుండెకు రక్తప్రసరణ తగ్గినప్పుడు ఛాతీలో బిగుతుగా, భారంగా లేదా ఒత్తిడిగా అనిపించవచ్చు. కొందరిలో ఛాతీ నొప్పితో పాటు వికారం, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో గుండె సమస్య లక్షణాలు అజీర్తి లేదా గ్యాస్ సమస్యను పోలి ఉండే అవకాశం ఉంది. అందుకే ఛాతీ నొప్పిని కేవలం గ్యాస్ అని భావించి ఇంట్లోనే ఉండిపోవడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగేకొద్దీ గుండె సంబంధిత సమస్యలపై జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర వంటి అంశాలు ఉన్నవారు ఛాతీ సంబంధిత లక్షణాలను తేలిగ్గా తీసుకోకూడదు. ఛాతీలో కొత్తగా లేదా తీవ్రమైన నొప్పి రావడం, నొప్పి తగ్గకుండా కొనసాగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, మూర్ఛ

చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. ఫలితంగా చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి చేరతాయి. సమస్త ఆరోగ్య సమస్యలకు ఇక్కడే బీజం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చేతుల శుభ్రత విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికి రాదని సూచిస్తున్నారు. ⚛ చేతులు శుభ్రం చేసుకోకపోతే చేతిపై ఉన్న వ్యాధికారక క్రిములన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి వెడతాయి. ఇక అపరిశుభ్ర చేతులతో ఇతరులను తాకితే వారి చేతులకు కూడా ఆ క్రిములన్నీ అంటుకుంటాయి. ⚛ చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల డయేరియా, హెపటైటిస్, జలుబు.. వంటి వివిధ రకాల అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. ఒక టాయిలెడ్ కమోడ్ పైనే లక్షల సంఖ్యలో క్రిములు దాగి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి తరచూ చేతులు శుభ్రం చేసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నారు నిపుణులు. ⚛ చేతులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల కంటి సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి సబ్బు, హ్యాండ్‌వాష్, శానిటైజర్‌తో కనీసం 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకుంటే వివిధ అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకించి పిల్లలకు కూడా చేతులు చక్కగా శుభ్రం చేసుకునేలా చిన్నప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలి అని చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి

ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ వాచ్ లు పెట్టుకుంటున్నారు. వాకింగ్, రన్నింగ్..ఇలా ప్రతిదానికి రీడింగ్ చెక్ చేసుకోవడం కోసం వాడతారు. యోగా, ఎక్సర్ సైజ్ చేసేటప్పుడు కూడా స్మార్ట్ వాచ్ ఉండాల్సిందే. హార్ట్ రేట్‌ను ట్రాక్ చేస్తాయి. ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్‌లలో ఉండే సెన్సార్లు మన హార్ట్ రేట్‌ను నిరంతరం ట్రాక్ చేస్తాయి. కొన్ని అడ్వాన్స్డ్ మోడల్స్‌లో ECG రికార్డ్ చేసే ఫీచర్ కూడా ఉంది. దీనివల్ల గుండె వేగం సాధారణం కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నా, లయ తప్పినా గమనించవచ్చు. ముఖ్యంగా, కొన్ని వాచ్‌లు ఏట్రియల్ ఫైబ్రిలేషన్ (Atrial Fibrillation - AF) అనే అసాధారణ గుండె లయకు సంబంధించిన సంకేతాలను గుర్తించగలవు. కానీ ఇదే ఫైనల్ మెడికల్ డయాగ్నసిస్ కాదు. స్మార్ట్‌వాచ్ సెన్సార్ల రీడింగ్స్ ఎప్పుడూ 100 శాతం కరెక్ట్‌గా ఉంటాయని చెప్పలేం. చేతి కదలికలు, వాచ్ సరిగ్గా ఫిట్ అవ్వకపోవడం, చర్మానికి సరిగ్గా టచ్ కాకపోవడం వంటి కారణాల వల్ల కూడా కొన్నిసార్లు తప్పుడు రీడింగ్స్ లేదా ఫాల్స్ అలర్ట్స్ రావచ్చు. అలాగే, కొన్ని గుండె సమస్యలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి కాబట్టి, వాచ్ వాటిని రికార్డ్ చేయకపోవచ్చు. అందుకే, అలర్ట్ రాగానే భయపడటం, అలర్ట్ రాలేదని పూర్తిగా నిశ్చింతగా ఉండటం రెండూ కరెక్ట్ కాదు. గుండె వేగానికి సంబంధించి వాచ్ పదేపదే అసాధారణ రీడింగ్స్ చూపిస్తే, ఆ డేటాను డాక్టర్‌కు చూపించడం మంచిది. ముఖ్యంగా గుండె దడ, ఛాతీలో అసౌకర్యం, ఆయాసం, తల తిరగడం, కళ్లు బైర్లు కమ్మడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరాన్ని బట్టి డాక్టర్ ECG, రక్త పరీక్షలు, ఎకోకార్డియోగ్రామ్ (Echocardiogram) లేదా ఇతర టెస్టులు చేయాలని చెప్తారు. స్మార్ట్‌వాచ్‌ను గుండె ఆరోగ్యాన్ని నిర్ధారించే మెడికల్ డివైజ్‌గా కాకుండా, ఒక మానిటరింగ్, ముందస్తు హెచ్చరికల టూల్‌గా వాడాలి. రోజూవారీ హార్ట్ రేట్లోని మార్పులను గమనించడానికి, వ్యాయామం చేసేటప్పుడు గుండె వేగాన్ని

Kidney Health Tips Telugu: నేటి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం వంటి సమస్యలు దీర్ఘకాలంలో మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదాన్ని పెంచుతాయి. కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం ద్వారా మూత్రపిండాలపై పడే భారాన్ని తగ్గించుకోవచ్చు. అధికంగా స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం పిండి పదార్థాలు, స్వీట్లు, కేకులు, పేస్ట్రీలు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలు రావచ్చు. మధుమేహం, అధిక బరువు వంటి పరిస్థితులు దీర్ఘకాలంలో మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను పరిమితం చేసి, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు వంటి పోషకమైన ఆహారాన్ని సమతుల్యంగా తీసుకోవడం మంచిది. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువసేపు శారీరక కదలిక లేకపోవడం వల్ల శారీరక చురుకుదనం తగ్గి, బరువు పెరగడం, రక్తపోటు వంటి సమస్యల ప్రమాదం పెరగవచ్చు. ఇవి క్రమంగా మూత్రపిండాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువసేపు కూర్చోవాల్సి వచ్చినా ప్రతి అరగంటకు లేదా గంటకు ఒకసారి లేచి కొద్దిసేపు నడవడం, శరీరాన్ని సాగదీయడం అలవాటు చేసుకోవాలి. ఆహారంలో అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరగవచ్చు. అధిక రక్తపోటు మూత్రపిండాల ఆరోగ్యానికి హానికరమైన ప్రధాన కారకాల్లో ఒకటి. ప్యాక్డ్ ఫుడ్స్, చిప్స్, సాస్‌లు, ఇన్స్టంట్ ఫుడ్స్, రెడీమేడ్ పదార్థాల్లో కూడా ఉప్పు అధికంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల వీటి వినియోగాన్ని తగ్గించి, ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని నియంత్రించడం మంచిది. శరీరానికి తగినంత ద్రవాలు అందడం కూడా ముఖ్యం. నీరు శరీరంలోని వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపడంలో సహాయపడుతుంది. అయితే ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే నీటి పరిమాణం వేర్వేరుగా ఉండవచ్చు

ఒంటరితనం కేవలం మానసిక ఆరోగ్యాన్నే కాదు.. గుండె ఆరోగ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ డెస్క్: గుండె ఆరోగ్యం అంటే కేవలం కొలెస్ట్రాల్, రక్తపోటు లేదా రోజుకు ఎన్ని అడుగులు నడిచామన్నది మాత్రమే కాదు. మన మానసిక ఆరోగ్యం, ఇతరులతో మనకున్న సంబంధాలు కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ధూమపానం, అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, ఒంటరితనం, దీర్ఘకాలిక ఒత్తిడి వంటివి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఒంటరితనం గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఒంటరితనం అంటే ఇంట్లో ఒంటరిగా ఉండటం మాత్రమే కాదు. మనసుకు దగ్గరైన వారితో మాట్లాడే అవకాశం లేకపోవడం, ఇతరులతో అనుబంధం లేకపోవడం కూడా ఒంటరితనంలోకి వస్తాయి. ఎక్కువ కాలం ఇలా ఒంటరిగా ఉంటే ఒత్తిడి పెరగడం, నిద్ర సరిగా లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. ఇవన్నీ పరోక్షంగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. పరిశోధనల్లోనూ దీర్ఘకాలిక ఒంటరితనం, సామాజికంగా ఇతరులకు దూరంగా ఉండటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యల ముప్పు పెరిగే అవకాశం ఉందని తేలింది. గుండె ఆరోగ్యం కోసం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ధూమపానం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. ఒంటరితనాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇతరులతో బంధాలు కొనసాగించాలి. దీర్ఘకాలిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒంటరితనం ఒక్కటే గుండె జబ్బులకు కారణమవుతుందని ఖచ్చితంగా చెప్పలేం. గుండె జబ్బుల ముప్పుపై వయసు, వంశపారంపర్యం, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, ధూమపానం, ఆహారం, శారీరక శ్రమ వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. అయితే గుండె ఆరోగ్యం కేవలం ఆహారం, వ్యాయామంపైనే ఆధారపడదు. మానసిక ఆరోగ్యం, ఒత్తిడిని నియంత్రించుకోవడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగించడం కూడా మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమే. Note: ఇందులోని