translateexpand_more

Dk Shivakumar Takes Oath Updates News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu03 Jun, 11:46 am
మాలవ్య యోగం- అమ్మ ఆశీర్వాదం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్.. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటకకు 25వ ముఖ్యమంత్రి అయ్యారు. బెంగళూరులోని లోక్ భవన్ లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. డీకేశితో పాటు 13 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తోన్నారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం సందడిగా కొనసాగింది. ప్రమాణ స్వీకార సమయంలో డీకే శివకుమార్ చేతిలో రాజ్యాంగ ప్రతి కనిపించింది. రాజ్యాంగం సాక్షిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి తన పేరును పిలవగానే భావోద్వేగానికి గురయ్యారు డీకేశి. కుర్చిలో నుంచి లేచి వేదిక మీద సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం మైక్ వద్దకు వెళ్లారు. కన్నడంలో ఆయన ప్రమాణ స్వీకారం కొనసాగింది. వేదిక వద్ద ముందు వరుసలో కూర్చున్న డీకే శివకుమార్ భార్య ఉషా శివకుమార్, కుమార్తె సైతం ఎమోషన్ అయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారాయన. వివిధ మఠాధిపతులు, ముస్లిం మతపెద్దలు, క్రైస్తవ మిషనరీ ఫాదర్ల నుంచి ఆశీర్వచనాలు తీసుకున్నారు. డీకే శివకుమార్ సొంత నియోజకవర్గం కనకపుర నుంచి వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సహా రాహుల్ గాంధీ స్థాయి సీనియర్ నాయకులు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో లోక్ భవన్ లో కోలాహలం నెలకొంది. ఇది ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఓ మైలురాయిగా నిలిచింది. ప్రమాణ స్వీకార సమయం తన గురువు వీర గంగాధర అజ్జ పేరును స్మరించుకున్నారు డీకే శివకుమార్. అజ్జయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రమాణ స్వీకారం కోసం జ్యోతిష్యులు, సంఖ్యాశాస్త్ర నిపుణులు అరుదైన, శక్తివంతమైన మాలవ్య యోగం ఆధారంగా ఈ శుభ ముహూర్తాన్ని నిర్ణయించారు. 3వ తేదీ 13 మందితో ప్రమాణ స్వీకారం చేయడానికి గల కారణం కూడా ఇదేనని చెబుతున్నారు. తులాలగ్నంలో డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. ప్రస్తుత ఆయన జాతకంలో గురు గ్రహం ఉచ్చ స్థితిలో కొనసాగుతోంది. దశమ భావం బలంగా ఉంది. జాతకం ప్రకారం.. భవిష్యత్తులో కూడా పాలన, రాజకీయ సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తారని నమ్ముతున్నారు. ప్రజానుకూల, సుస్థిర పాలన అందించడానికి ఈ ముహూర్తం దోహదపడుతుందని బలమైన నమ్మకం ఉంది.

Dk Shivakumar Takes Oath Updates News Keyword | Telugu Digital