translateexpand_more

Dog Sized Scorpion In Britain News

Latest updates from Telugu Digital news sources.

AP7AM03 Jun, 04:55 pm
వామ్మో, కుక్క సైజులో తేలు... ఇప్పుడు కాదులెండి

భూమిపై దాదాపు 415 మిలియన్ సంవత్సరాల కిందట కుక్క సైజులో ఉండే భారీ తేళ్లు సంచరించాయని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. మీటరు పొడవు పెరిగే ఈ రాకాసి తేలుకు 'ప్రీయాక్టురస్ గైగాస్' అని పేరు పెట్టారు. డైనోసార్లు, అడవులు కూడా ఏర్పడక ముందు కాలంలో ఇవి జీవించాయని పరిశోధకులు తెలిపారు.ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ తేలుకు సంబంధించిన శిలాజాలను 19వ శతాబ్దంలోనే కనుగొన్నారు. అయితే, శిలాజాలు అసంపూర్ణంగా ఉండటంతో వాటిని ఓ భారీ సముద్ర జీవిగా పొరబడ్డారు. దాదాపు 150 ఏళ్లకు పైగా లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం వంటి సంస్థల్లో ఈ శిలాజాలు మరో జీవి పేరుతోనే ఉండిపోయాయి. ఇటీవల పేలెంటియాలజిస్టులు ఆధునిక సాంకేతికతతో వీటిని తిరిగి పరిశీలించగా, అది తేలు అని నిర్ధారణ అయింది.ఈ భారీ తేలు 16 సెంటీమీటర్లకు పైగా పొడవున్న బలమైన కొండితో ఉండేది. బ్రిటన్‌లో చిత్తడి నేలలు, నదీ వ్యవస్థలలో ఇది నివసించేది. నీటిలో, నేలపైనా సంచరించే సామర్థ్యం దీనికి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ కాలంలో దీనికి పోటీ ఇచ్చే జీవులు పెద్దగా లేకపోవడంతో, చిన్న జీవులను, చేపలను వేటాడే అగ్రశ్రేణి మాంసాహారిగా ఇది జీవించింది.మ్యూజియంలలోని పాత శిలాజాలను కొత్త పద్ధతుల్లో విశ్లేషించడం ద్వారా ప్రాచీన జీవుల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చని ఈ అధ్యయనం నిరూపించింది. ఈ పరిశోధన వివరాలు 'పేలెంటియాలజీ' అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.