translateexpand_more

Dsc Recruitment Transparency News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy01 Jun, 03:20 pm
డీఎస్సీపై గొడ్డలి పార్టీ అసత్య ప్రచారం

విశాఖపట్నం, జూన్01: మెగా డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిందని ఎమ్మెల్సీ చిరంజీవి రావు స్పష్టం చేశారు. మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నాయకులపై మండిపడ్డారు. దగా డీఎస్సీ అని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ-2025పై వైసీపీ రాజకీయం చేస్తున్న నేపథ్యంలో సోమవారం విశాఖపట్నంలో అభ్యర్థుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చిరంజీవి రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తీవ్రంగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. 2025 మెగా డీఎస్సీపై గొడ్డలి పార్టీ అసత్య ప్రచారాలు చేస్తుందని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఉద్యోగ కల్పనతో కూటమి పార్టీకి మంచి పేరు వస్తుందని వైసీపీ అసత్య ప్రచారాలకు తెర తీసిందన్నారు.

నిరుద్యోగులను మోసం చేసిన జగన్: ప్రణవ్ గోపాల్

జాబ్ క్యాలెండర్ పేరుతో వైఎస్ జగన్ నిరుద్యోగులను మోసం చేశారని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ విమర్శించారు. వైఎస్ జగన్ నిరుద్యోగుల ద్రోహి అని అభివర్ణించారు. మెగా డీఎస్సీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ జగన్‌పై మండిపడ్డారు. 2025 మెగా డీఎస్సీ పారదర్శకంగా జరిగిందని తెలిపారు. వైఎస్ జగన్‌కు దమ్ముంటే పేపర్ ఎక్కడ లీక్ అయిందో చెప్పాలని ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఉద్యోగ ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని నిరుద్యోగులకు ప్రణవ్ గోపాల్ పిలుపునిచ్చారు.

డీఎస్సీ అభ్యర్థుల కామెంట్స్..

మెగా డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం చేయడం తగదని డీఎస్సీ అభ్యర్థులు స్పష్టం చేశారు. దీనిపై క్షమాపణలు చెప్పాలని వైసీపీ నేతలను వారు డిమాండ్ చేశారు. మీ రాజకీయాలు కోసం తమ

NTV Telugu27 May, 02:02 am
మెగా డీఎస్సీ-2025పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు.. పాఠశాల విద్యాశాఖ తీవ్ర హెచ్చరిక

Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని పూర్తి పారదర్శకతతో, అత్యాధునిక సాంకేతిక విధానాల ఆధారంగా విజయవంతంగా పూర్తి చేశామని విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో, నియామక ప్రక్రియ మొత్తం ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు, రిజర్వేషన్ విధానాలు, చట్టబద్ధమైన మార్గదర్శకాలకు అనుగుణంగానే నిర్వహించామని తెలిపింది. ప్రతి దశలో డిజిటల్ భద్రతా వ్యవస్థలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, జిల్లా స్థాయి ధృవీకరణ ప్రక్రియలను కట్టుదిట్టంగా అమలు చేసినట్లు వెల్లడించింది. అయితే కొన్ని వార్తాపత్రికలు, సోషల్ మీడియా వేదికలు మరియు కొందరు వ్యక్తులు కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా హారిజాంటల్ రిజర్వేషన్ అమలును సరైన రీతిలో అర్థం చేసుకోకుండా ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందని, మెరిట్ జాబితాలు విడుదల చేయలేదని, అక్రమ ఎంపికలు జరిగాయని అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి మెరిట్ జాబితాలు, ఎంపిక జాబితాలు మరియు ఇతర అన్ని వివరాలను నోటిఫై చేసిన విధానం ప్రకారమే పారదర్శకంగా విడుదల చేసినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఎంపిక ప్రక్రియ మొత్తం మెరిట్, రిజర్వేషన్ రోస్టర్ మరియు పలు స్థాయిల ధృవీకరణ వ్యవస్థల ఆధారంగానే జరిగిందని తెలిపింది. ఇందులో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేదని పేర్కొంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు అభ్యర్థుల్లో అనవసర ఆందోళనలు కలిగించడమే కాకుండా విద్యాశాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తగిన న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. తప్పుడు ప్రచారం చేసిన మీడియా సంస్థలు,