translateexpand_more

Fluorescent Spider News

Latest updates from Telugu Digital news sources.

AP7AM03 Jun, 09:53 am
మెరిసే సాలీడు... ఎప్పుడైనా చూశారా

ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం క్షీణిస్తున్న తరుణంలో, అంగోలాలో జరిగిన ఒక పరిశోధన ఆశాకిరణాలను రేకెత్తిస్తోంది. తూర్పు అంగోలాలోని లిసిమా పీఠభూమిలో శాస్త్రవేత్తల బృందం జరిపిన యాత్రలో, విజ్ఞాన ప్రపంచానికి ఇంతవరకు తెలియని డజన్ల కొద్దీ కొత్త జీవజాతులను కనుగొన్నారు. ఆఫ్రికాలోని అతిపెద్ద జీవ వైవిధ్య రహస్య ప్రదేశాలలో ఒకటిగా భావిస్తున్న ఈ ప్రాంతంలో ఈ ఆవిష్కరణ చోటుచేసుకుంది.దశాబ్దాలపాటు సాగిన అంతర్యుద్ధం, చేరుకోవడానికి వీలులేని భౌగోళిక పరిస్థితుల కారణంగా లిసిమా పీఠభూమిపై ఇప్పటివరకు పెద్దగా పరిశోధనలు జరగలేదు. ఫిబ్రవరిలో 'ది వైల్డర్‌నెస్ ప్రాజెక్ట్' ఆధ్వర్యంలో 16 మంది నిపుణులతో కూడిన బృందం 'కస్సాయ్ లైఫ్ అట్లాస్' పేరుతో ఈ సర్వేను నిర్వహించింది. ఈ యాత్రలో అతినీలలోహిత కాంతిలో నీలి రంగులో మెరిసే క్రౌన్డ్ క్రాబ్ స్పైడర్, విషపూరితమైన లేడీబర్డ్ పురుగును పోలి ఉండే ఆర్బ్-వెబ్ స్పైడర్ వంటివి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాయి. వీటితో పాటు 8 కొత్త రకాల తూనీగలు, 8 కొత్త రకాల చిమ్మటలు, 3 రకాల గొల్లభామ జాతులను కూడా గుర్తించారు.వర్షాకాలం కావడంతో బురదలో వాహనాలు కూరుకుపోవడం, మలేరియా బారినపడటం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ యాత్రను పూర్తి చేసినట్లు యాత్రా బృంద నాయకుడు రాబ్ టేలర్ తెలిపారు. ఈ సర్వేలో లభించిన ఆధారాలను పూర్తిగా విశ్లేషించడానికి, కొత్త జాతులను అధికారికంగా వర్గీకరించడానికి కొన్ని నెలల నుంచి సంవత్సరాల సమయం పట్టవచ్చని ఆయన వివరించారు.కొత్త జాతులను కనుగొనడమే కాకుండా, అవి ఆధారపడి ఉన్న ఆవాసాలను కాపాడటమే తమ అసలు లక్ష్యమని టేలర్ స్పష్టం చేశారు. ఈ

Fluorescent Spider News Keyword | Telugu Digital