translateexpand_more

Folk Song News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu03 Jun, 12:23 pm
భలే ఉంది మావ సాంగ్.. విన్నాకొద్దీ వినాలనిపిస్తుంది.. యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న పాట

వారం వారం యూట్యూబ్ లో కొత్త సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక వైపు సినిమా సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంటే మరో వైపు ఫోక్ సాంగ్స్ రిలీజ్ అయ్యి దుమ్మురేపుతున్నాయి. ఈ మధ్య కాలంలో సినిమా సాంగ్స్ కంటే ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. యూట్యుబ్స్ లో ప్రతి నెల కొత్త కొత్త ఫోక్ సాంగ్స్ విడుదల అవుతూ తెగ సందడి చేస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా తెలంగాణ ఫోక్ సాంగ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ఫోక్ సాంగ్స్ విడుదలై సంచలనాలు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.. అలాగే కొన్ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై రికార్డ్స్ క్రియేట్ చేశాయి. మిలియన్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకొని సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఓ ఫోక్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతుంది. ఇటీవలే ఈ సాంగ్ విడుదలైంది. ఈ ఫోక్ సాంగ్ లో రాము రాథోడ్ మరోసారి అదరగొట్టాడు. ఫోక్ సాంగ్స్ లో రాము రాథోడ్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా రాను బొంబాయికి రాను సాంగ్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోనూ అడుగుపెట్టాడు. బిగ్ బాస్ సీజన్ 9లో తన ఆటతో ఆకట్టుకున్నాడు రాము రాథోడ్. ఇక ఇప్పుడు మరోసారికొత్త సాంగ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. బొంగరంల సంత అంటూ సాంగ్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఈ సాంగ్ ను రాము రాథోడ్ తో పాటు సింగర్ ప్రభ ఆలపించారు. అలాగే ఈ సాంగ్ లో రాము రాథోడ్, భ్రమరాంబిక కలిసి డాన్స్ చేశారు. అంజి పేట్ల ఈ సాంగ్ ను రచించారు. ఈ సాంగ్ కు కళ్యాణ్ సంగీతం అందించాడు. ఇక ఈ సాంగ్ ఇటీవలే విడుదలైంది. ఇప్పటికే ఈ సాంగ్ 3.76 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ క్రేజీ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Folk Song News Keyword | Telugu Digital