translateexpand_more

Forest News News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu03 Jun, 09:12 am
ఈ కోడిని కూర వండుకుని తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష తప్పదు

చికెన్ లవర్స్‌కు ఇది నిజంగానే షాకింగ్ న్యూస్! ముక్క లేనిదే ముద్ద దిగని ఈ రోజుల్లో.. కోడి మాంసం తినడమేంటి, జైలుకు వెళ్లడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే.. ప్రతిరోజూ మార్కెట్లలో టన్నుల కొద్దీ చికెన్ విక్రయాలు సాగుతుండగా, ఈ ప్రత్యేకమైన కోడిని మాత్రం ముట్టుకుంటే చట్టం తన ప్రతాపం చూపిస్తుంది. పైగా భారీ జరిమానాతో పాటు ఏకంగా మూడేళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది. ఇంతకీ ఈ కోడి కథేంటో చూద్దాం! మనం నిత్యం చూసే సాధారణ కోడి పుంజుల లాంటిది కాదు ఇది. పూర్తిగా అడవులకే పరిమితమైన ‘అడవి కోడి’. దీనిని ఆంగ్లంలో ‘గ్రే జంగిల్ ఫౌల్’ అని పిలుస్తారు. మన దేశంలో మాత్రమే కనిపించే ఈ అరుదైన పక్షి జాతి అంతరించిపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం దీనిని ‘వన్యప్రాణి రక్షణ చట్టం’ కింద చేర్చి, ప్రత్యేక రక్షణ కల్పించింది. ఈ అడవి కోళ్లు సాధారణంగా నేల మీదే తిరుగుతూ గింజలు, చెదలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. నేలపైన లేదా చిన్న చిన్న చెట్లపై గూళ్లు కట్టుకుంటాయి. ఇవి అత్యంత అప్రమత్తంగా ఉంటాయి. చిన్న అలికిడి వినపడినా క్షణాల్లో పారిపోతాయి. ఒకవేళ ప్రాణాపాయం ఉందని గ్రహిస్తే మాత్రం వెంటనే చెట్లపైకి ఎగిరిపోతాయి. మంచిర్యాల జిల్లా జన్నారం అడవుల్లో ఈ అరుదైన ‘గ్రే జంగిల్ ఫౌల్’ కెమెరా కంటికి చిక్కి వన్యప్రాణి ప్రేమికులను ఆకట్టుకుంది. చట్టప్రకారం వీటిని వేటాడటం, చంపడం లేదా వీటి మాంసాన్ని తినడం నేరమని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. గొర్రెల కాపరి ఉద్యోగానికి భారీ క్యూ.. జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు

Forest News News Keyword | Telugu Digital