
వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తమ విజయాన్ని అభిమానులతో పంచుకోవడానికి కొంత సమయం పట్టేలా ఉంది. టైటిల్ గెలిచిన వెంటనే జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అహ్మదాబాద్ నుంచే నేరుగా తమ ఇళ్లకు, సెలవులకు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బొబాట్ సోమవారం మీడియాకు వెల్లడించారు."దురదృష్టవశాత్తు మేమెవరమూ బెంగళూరు వెళ్లడం లేదు. నేను యూకేకు తిరిగి వెళ్తున్నాను. రజత్ తన కుటుంబంతో సమయం గడపడానికి ఇంటికి వెళుతున్నాడు. హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ హాలిడే ప్లాన్ చేసుకున్నాడు. కాబట్టి మా అభిమానులను కలుసుకోవడానికి మరికొంత కాలం వేచి ఉండాలి" అని బొబాట్ తెలిపారు.ఒకప్పుడు ఐపీఎల్‌లో 'అండర్ అచీవర్స్'గా ముద్రపడిన ఆర్సీబీ, 2025 నుంచి అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండు టైటిళ్లు గెలుచుకుంది. ఈ భారీ మార్పు వెనుక డేటా, అనలిటిక్స్‌తో కూడిన సమతుల్య విధానం కీలక పాత్ర పోషించిందని బొబాట్, కెప్టెన్ రజత్ పటీదార్ వివరించారు. లీడ్ అనలిస్ట్ ఫ్రెడ్డీ వైల్డ్, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, మెంటార్ దినేశ్ కార్తీక్ వంటి వారి ఆధ్వర్యంలో జట్టును నిర్మించడం నుంచి మ్యాచ్ వ్యూహాల వరకు ప్రతి విషయంలో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు."మేం కేవలం డేటాపైనే ఆధారపడం. ఆధారాలతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాం. ఇందులో డేటాతో పాటు నిపుణుల అనుభవం, అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాం" అని బొబాట్ అన్నారు. ఈ విజయాల్లో అనలిస్ట్ ఫ్రెడ్డీ వైల్డ్